భారత రాజకీయాల్లో మహాత్మా గాంధీ
ప్రారంభించిన ప్రసిద్ధ చంపారన్ సత్యాగ్రహం సందర్భంగా చంపారన్‌లోని రైతుల కష్టాలను గాంధీకి తెలియజేసిన
వ్యక్తి పీర్ మహమ్మద్.
పీర్ మహమ్మద్ పర్తాప్ Partap అనే పేపర్‌కి ప్రెస్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాడు.”మునిస్ Munis” అనే కలం పేరును ఉపయోగించిన పీర్
ముహమ్మద్, గొప్ప
స్వాతంత్ర్య సమరయోధుడు గణేష్ శంకర్ విద్యార్థి సంపాదకత్వం వహించిన జాతీయవాద హిందీ
వార్తాపత్రిక ప్రతాప్ Pratap కు రెగ్యులర్
కంట్రిబ్యూటర్.
1906లో బలవంతపు నీలిమందు తోటల సాగుకు వ్యతిరేకంగా రైతుల
ఆందోళనను షేక్ గులాబ్ మరియు సీతాల్ రే నిర్వహించినప్పటి నుండి చ౦పారన్ Champaran వలసవాద వ్యతిరేక ఆందోళనకు కేంద్రంగా ఉంది.
పీర్ ముహమ్మద్ చంపారన్‌లోని ఒక పాఠశాల
ఉపాధ్యాయుడు, కవి రచయిత మరియు
పాత్రికేయుడు... 1914లో, పీర్ ముహమ్మద్ “ప్రతాప్”లో తన
కథనాలతో స్థానిక రైతులపై బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలను ఎత్తి చూపడం
ప్రారంభించాడు
పీర్ మహమ్మద్ కథనాలు చంపారన్‌లో
జరిగిన ఆందోళనలను జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చాయి. రాజ్ కుమార్ శుక్లాతో
పాటు పీర్ మహమ్మద్ గాంధీని చంపారన్‌కు తీసుకువచ్చి సత్యాగ్రహం ప్రారంభించడంలో కీలక
పాత్ర పోషించాడు. ఒక బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్టు పీర్ మహమ్మద్ "పదవి లేని
వ్యక్తి, మరియు
ప్రమాదకరమైన వ్యక్తి, ఆచరణాత్మకంగా
బద్మాష్" అని పేర్కొంది.
విద్యావంతులు, సెమీ-ఎడ్యుకేట్
పురుషులు మరియు రైతునాయకులకు మధ్య ఉన్న లింక్ పీర్ ముహమ్మద్, గాంధీ పర్యటనకు ముందు, పర్యటన తర్వాత
కూడా నీలిమందు పెంపకందారుల planters పై న్యాయపోరాటానికి దిగిన రైతులకు పీర్ ముహమ్మద్ సలహా
ఇచ్చారు. నీలిమందు పెంపకందారులపై కేసు పెట్టాలనుకునే రైతుకు సహాయం చేయడానికి అతను SDM మరియు SDO కోర్టుల వద్ద
కూర్చునేవాడు.
గాంధీని జాతీయ హీరోగా నిలబెట్టడంలో
పీర్ ముహమ్మద్ మునిస్ కీలక పాత్ర పోషించారు. చంపారన్ సత్యాగ్రహం తరువాత, పీర్ ముహమ్మద్
మునిస్ రైతుల
హక్కులు, అణగారిన
తరగతుల కోసం పోరాడుతూనే ఉన్నాడు మరియు 1949లో మరణించే వరకు హిందీ భాషను ప్రోత్సహించాడు.
No comments:
Post a Comment