6 August 2023

చరిత్ర మర్చిపోయిన కొందరు భారత మహిళా స్వాతంత్ర్య సమరయోధురాళ్ళు Some Indian women freedom fighters forgotten by the history

 

పర్వీన్ సుల్తానా

 

ముజఫర్‌నగర్ మరియు షామ్లీకి చెందిన రైతు మహిళలు 1857 వేసవిలో ఆంగ్ల దళాలతో పోరాడేందుకు స్వయంగా ఒక మహిళా సాయుధ బెటాలియన్‌ ఏర్పాటు చేసుకున్నారు. అదే సంవత్సరంలో, ఢిల్లీలో వలసవాద సైన్యానికి వ్యతిరేకంగా ఒక మహిళ సాయుధ పౌర దళాలకు నాయకత్వం వహించింది మరియు  ఓ మహిళ ఆంగ్లేయ సైన్యంతో పోరాడినందుకు సజీవ దహనమైంది.

వీరు అంతా భారత స్వాతంత్ర్య పోరాటంలో అంతగా తెలియని మహిళా సైనిక పరాక్రమ యోధులు మరియు  వీరి శౌర్యం మరియు దేశభక్తి చరిత్ర పుటలలో నమోదు కాలేదు.

కస్తూర్బా గాంధీ మహాత్మా గాంధీ  భార్య.   గాంధీ జైలు పాలైనప్పుడు కస్తూర్బా అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. కాని మన చరిత్ర పితృస్వామ్యానికి బలి అయింది. మహిళా స్వాతంత్ర్య సమరయోధులు మరవబడుతారు మరియు పురుష స్వాతంత్ర్య సమరయోధులు చరిత్రలో ప్రధాన దశను పొందుతారు.

చరిత్రకారులు 1857 నాటి మొదటి జాతీయ స్వాతంత్ర్య యుద్ధంలో ఝాన్సీ రాణి మరియు బేగం హజ్రత్ మహల్‌లకు తగిన ప్రాముఖ్యతను ఇచ్చారు, కానీ ఇతర మహిళా విప్లవకారిణిలను మరిచిపోయారు.

ఝాన్సీ రాణికి కలసి పోరాడిన ఒక ముస్లిం మహిళా స్నేహితురాలు ఉందని మన పుస్తకాలలో  చాలా అరుదుగా ప్రస్తావించారు.. మధ్య భారతదేశానికి గవర్నర్ జనరల్ ఏజెంట్ అయిన రాబర్ట్ హామిల్టన్ 1858 అక్టోబర్ 30న బ్రిటీష్ ప్రభుత్వానికి ఇలా తెలియజేశాడు, “రాణి గుర్రపు స్వారీ చేస్తోంది. రాణితో పాటు మరో ముస్లిం మహిళ కూడా స్వారీ చేస్తోంది, muslim మహిళ చాలా సంవత్సరాలు ఝాన్సీ రాణికి  సేవకురాలిగా మరియు తోడుగా ఉండేది. ఇద్దరూ గుర్రం మీద నుండి ఒకేసారి బుల్లెట్ గాయాలతో పడిపోయారు. ఝాన్సీ వద్ద ఫిరంగి దళాలకు మహిళలు నాయకత్వం వహించారు.

మేజర్ జనరల్ హ్యూ రోస్ ఇలా వ్రాశాడు, "మహిళలు మందుగుండు సామగ్రితో కాల్చటం తో పాటు మగ సైనికులను పోరాటంలో పాల్గొనమని ప్రోత్సహిస్తున్నారు."

అదేవిధంగా బేగం హజ్రత్ మహల్ కూడా  సైన్యంలో మహిళా పోరాట యోధులను కలిగి ఉంది.

1857లో, ముజఫర్‌నగర్ మరియు షామ్లీలో యుద్ధవిద్యపై అవగాహన లేని రైతు మహిళలు స్వయంగా  ఒక మహిళా సాయుధ సమూహాన్ని  ఏర్పాటు చేసుకున్నారు.. అనేకమంది  హిందూ మరియు ముస్లిం మహిళలు అనేక ప్రదేశాలలో ఆంగ్ల సైన్యంపై దాడి చేసి ఆంగ్లేయులను సంహరించారు. షామ్లీ మరియు థానా భవన్‌లను వలస పాలన నుండి విముక్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. బీబీ, నూరి, శోభ వంటి మహిళలు యుద్ధభూమిలో వీరమరణం పొందగా, మహిళల నాయకురాలు అస్ఘరీ బేగం ఆంగ్ల సైన్యం చేత కాల్చివేయబడ్డారు. వందలాది మంది మహిళలు ఉరి వేసుకుని చనిపోయారు

ఢిల్లీలో, ఆకుపచ్చ బురఖా ధరించిన ఒక మహిళ ఆంగ్ల సైన్యంతో పోరాడటానికి ప్రజలను ప్రేరేపించింది. లెఫ్టినెంట్ W.S.R హోడ్సన్, 29 జూలై 1857న ఇలా వ్రాశాడు, “ఒక  స్త్రీ ఆకుపచ్చని దుస్తులు ధరించి, ఆయుధాలు ధరించి, బ్రిటిష్ వారిపై తిరుగుబాటు కోసం ప్రజలను ప్రేరేపించి, బ్రిటిష్ బలగాలపై దాడిచేసింది. ఆకుపచ్చని దుస్తులు ధరించిన స్త్రీని  ఎదుర్కొన్న సిపాయిలు, ఆమె పౌరుషంతో పోరాడిందని మరియు ఐదుగురు పురుషుల వలె బలంగా ఉందని అన్నారు..ఆకుపచ్చని దుస్తులు ధరించిన స్త్రీని  అరెస్టు చేసిన రోజున, ఆమె గుర్రంపై స్వారీ చేస్తూ ఆంగ్లేయులపై దాడి చేయడంలో తిరుగుబాటుదారులను వ్యూహాత్మకంగా నడిపించింది. ఆకుపచ్చని దుస్తులు ధరించిన స్త్రీ వద్ద  ఆంగ్లేయులు తుపాకీని కనుగొన్నాము. ఆకుపచ్చని దుస్తులు ధరించిన విప్లవకారిణి తన నిష్కళంకమైన షూటింగ్ నైపుణ్యం మరియు కత్తితో అనేక మంది ఆo౦గ్లేయ సైనికులను చంపింది. బ్రిటిష్ సైనిక అధికారి హాడ్సన్ ఈ అనామక మహిళను జోన్ ఆఫ్ ఆర్క్‌ తో పోల్చాడు.

జలియన్ వాలాబాగ్ వీరుడు సైఫుద్దీన్ కిచ్లేవ్ భార్య సాదత్ బానో వివాహానికి ముందు రచయిత్రి, కవయిత్రి మరియు రాజకీయ కార్యకర్త మరియు స్త్రీల హక్కులు, దేశభక్తి మరియు విద్యపై విస్తృతంగా రాశారని చరిత్ర ప్రస్తావిస్తుంది. సైఫుద్దీన్‌ అరెస్టును నిరసిస్తూ జలియన్‌వాలాబాగ్‌లో ప్రజలు గుమిగూడారనేది అందరికీ తెలిసిన విషయమే అయినా, ప్రజలు సాదత్ బానో ప్రసంగం  వినడానికి థియేటర్‌కి వచ్చిన విషయాన్ని చరిత్ర కారులు విస్మరించారు.

 ధైర్యవంతురాలైన మహిళమరియు నిధుల సేకరణకునాయకత్వం వహించిన అమ్జాదీ బేగం గురించి భారతదేశంలో దాదాపు ఏ చరిత్ర విద్యార్థికి అంతగా తెలియదు. వారికి  అమ్జాదీ బేగం,మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్ భార్య అని  తెలుసు. గాంధీ తన ఒక వ్యాసంలో అమ్జాదీ బేగం తన భర్తకు బహిరంగ వక్తృత్వ కళ public oratory ను నేర్పించినదా  అని ఆశ్చర్యపోయారు! నిధుల సేకరణ ప్రచారాలకు ఒంటరిగా నాయకత్వం వహించిన మరియు జామియా మిలియా ఇస్లామియా వ్యవహారాలను నిర్వహించే మహిళ గురించి గాంధీ వ్యాసాలు వ్రాసినా ఆమె పేరు మనకు తెలియదు!.

"స్వాతంత్ర్యం మరియు పట్టుదల యొక్క పాఠాలు నేర్చుకోవడానికి ఈ దేవత (నిషాత్ ఉన్ నిసా బేగం) పాదాల వద్ద కూర్చోవాలని నేను ఈ దేశ యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను." అని బ్రిజ్ నారాయణ్ చక్‌బస్త్ 1918లో రాశారు. కాంగ్రెస్ సెషన్‌లో ప్రసంగించిన మొదటి ముస్లిం మహిళ నిషాత్ మరియు అది కూడా పర్దా లేకుండా. ఇప్పటికీ, ఆమె పేరు మాకు తెలియదు. ఇంక్విలాబ్ జిందాబాద్‌ను రూపొందించిన హస్రత్ మోహనీ భార్యగా నిషాత్ ఉన్ నిసా బేగం ను సంబోధిస్తారు. నిషాత్‌కు తనదైన గుర్తింపు ఉంది మరియు నిషాత్ ఉన్ నిసా బేగం తన భర్త లేకుండా బహిరంగ రాజకీయ సమావేశాలకు హాజరఅయ్యేది.. నిషాత్ ఉన్ నిసా బేగం వ్యాసాలు రాసింది, వైస్రాయ్ వద్దకు ప్రతినిధి బృందాలను నడిపించింది, సమ్మెలలో పాల్గొంది మరియు కాంగ్రెస్ సెషన్‌లో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం చేసిన మొదటి మహిళ నిషాత్ ఉన్ నిసా బేగం.

ఇది సుదీర్ఘ జాబితా. పెషావర్‌కు చెందిన పేరు తెలియని పఠాన్ అమ్మాయి, పోలీసు కాల్పులకు భయపడి పురుషులు ఊరేగింపు నుండి పారిపోతుంటే తనను కాల్చమని బ్రిటిష్ పోలీసులను సవాలు చేసిన కథ ఉంది. పఠాన్ అమ్మాయి ధైర్యసాహసాలచే ప్రేరణ పొందిన పురుషులు బ్రిటిష్ పోలీసులు పారిపోయేలా పోలీసుల వైపు కవాతు చేయడం ప్రారంభించారు.

అనేక మంది ధైర్యసాహసవంతులు అయిన వీర నారిమణులు భారత స్వతంత్ర సమరం లో తగిన గుర్తింపు పొందలేదు. వారు దేశం కోసం ప్రజలకోసం తమ కుటుంబాలను విడిచి దేశం కోసం అమరులు అయ్యారు. గుర్తింపు లేని మహిళలు ఎందఱో వారదంరికి దేశప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారు.   

 

No comments:

Post a Comment