2016-2021
మధ్య కాలంలో ఉన్నత విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థుల నమోదు గణనీయంగా
పెరిగిందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (MoE) వెల్లడించింది
అని కేంద్ర
విద్యా శాఖ సహాయ మంత్రి సుభాస్ సర్కార్ వెల్లడించారు..
2016-2021
మధ్య కాలంలో ముస్లిం సమాజానికి చెందిన ఉపాధ్యాయుల సంఖ్య కూడా గణనీయమైన వృద్ధిని
సాధించింది.
రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు
సమాధానంగా మంత్రి సమర్పించిన డేటా ప్రకారం, ఉన్నత
విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థుల నమోదు 2016-17లో
17.39
లక్షలు ఉంది.. అది 2020-21 విద్యా సంవత్సరంలో 19.22
లక్షలకు పెరిగింది. గత ఐదేళ్ల కాలంలో 1.83
లక్షల మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిooచారు
ఉన్నత విద్యా సంస్థలలో ముస్లిం
సమాజానికి చెందిన ఉపాధ్యాయుల సంఖ్య కూడా గణనీయమైన పురోగతిని కనబరిచింది.
ముస్లిం సమాజానికి చెందిన ఉపాధ్యాయుల
సంఖ్య 2016-17లో
67,215
మంది ఉండగా 2020-21
విద్యా సంవత్సరంలో 86,314 మంది ఉన్నారు.
ఈ గణాంకాలు 2020-21
సంవత్సరానికి సంబంధించిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE)
నుండి
తీసుకోబడ్డాయి. భారతదేశంలో ఉన్నత విద్య స్థితిగతులపై డేటాను సేకరించేందుకు
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర వార్షిక కసరత్తు ఈ సర్వే.
ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా
మైనారిటీ విద్యార్థులను చురుగ్గా ప్రోత్సహిస్తోందని కేంద్ర మంత్రి సుభాస్ సర్కార్ అన్నారు.
. దేశవ్యాప్తంగా ఆరు నోటిఫైడ్ మైనారిటీ
కమ్యూనిటీలు - బౌద్ధ, క్రిస్టియన్,
జైన్,
ముస్లిం,
సిక్కు
మరియు జొరాస్ట్రియన్ - విద్యార్థులలో విద్యా సాధికారతను పెంపొందించడానికి,
కేంద్ర
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మూడు విద్యా సాధికారత పథకాలను అమలు చేస్తుంది.
ఉన్నత విద్యాసంస్థల్లో ముస్లిం
విద్యార్థుల నమోదు పెరుగుదల మరియు ముస్లిం ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుదల సానుకూల పరిణామం
గా చూడవచ్చు..
ముస్లిం విద్యార్ధుల నమోదులో ఈ పెరుగుదల
మరియు ముస్లిం ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుదల దేశం తన పౌరులందరికీ నాణ్యమైన విద్య
మరియు అవకాశాలను అందించడానికి చేస్తున్న ప్రయత్నాలలో పురోగతిని ప్రదర్శిస్తుంది.
వివిధ విద్యా పథకాల ద్వారా మైనారిటీ కమ్యూనిటీలకు సాధికారత కల్పించడంపై ప్రభుత్వం
నిరంతరం నొక్కిచెప్పడం దాని నిబద్ధతను సూచిస్తుంది.
No comments:
Post a Comment