మదరసా అజీజియా మురార్‌పూర్, బీహార్
షరీఫ్, నలంద,
బీహార్‌లోని ఒక భారతీయ మైనారిటీ విద్యా
సంస్థ. బీబీ సోఘ్రా విరాళాల ద్వారా
నిర్మించిన మొట్టమొదటి విద్యా సంస్థల్లో మదరసా అజీజియా ఒకటి.
మదరసా అజీజియా 1896లో
సోఘ్రా వక్ఫ్ ఎస్టేట్ క్రింద స్థాపించబడింది. తన దివంగత భర్త అబ్దుల్ అజీజ్
జ్ఞాపకార్థం పరోపకారి బీబీ సోఘ్రా మదరసా అజీజియా స్థాపించారు. మదర్సా షంసుల్
హోదాతో పాటు బీహార్‌లోని రెండు పురాతన మదర్సాలలో ఇది ఒకటి. .
బీబీ సోఘ్రాకు తన భర్త మరణానంతరం లక్షల విలువైన ఆస్తి సంక్రమించింది మరియు దానిని వక్ఫ్‌కు విరాళంగా ఇవ్వాలని బీబీ సోఘ్రా నిర్ణయించుకుంది.
ఈ విరాళంలో ఎక్కువ భాగాన్ని బీహార్‌లో అట్టడుగున ఉన్న ముస్లింల ఆరోగ్యం మరియు
విద్య కోసం ఖర్చు చేయాలని భావించారు.
మదరసా అజీజియా 1895లో
అబ్దుల్ అజీజ్ మరణం తర్వాత స్థాపించబడింది,
మదరసా అజీజియా 1896లో
ప్రారంభమైనప్పటి నుండి స్వతంత్రంగా నడుస్తోంది. 1910లో బీహార్‌లోని నలంద జిల్లాలోని
చారిత్రాత్మక నగరమైన బీహార్ షరీఫ్‌లోని విశాలమైన మూడు ఎకరాల కొత్త క్యాంపస్‌కు
మార్చబడింది,
మదరసా అజీజియా లో అందమైన రెండంతస్తుల
లైబ్రరీ మరియు హాలు, అనేక తరగతి గదులు, కంప్యూటర్
ల్యాబ్ మరియు విద్యార్థులు,టీచర్లు నివసించడానికి హాస్టల్‌లు ఉన్నాయి. గ్రాండ్ హాల్
మరియు మెజ్జనైన్ mezzanine లైబ్రరీ యొక్క మొత్తం ఎత్తు దాదాపు 20
అడుగులతో సౌందర్య వైభవంగా కనిపిస్తుంది.
మదరసా అజీజియా ఆవరణలోని చారిత్రాత్మక
గ్రంథాలయంలో 250 చేతితో వ్రాసిన అరుదైన
మాన్యుస్క్రిప్ట్‌లతో సహా 4,500 అరుదైన
ఇస్లామిక్ తత్వశాస్త్రం, సైన్స్,
ఇస్లామిక్ న్యాయశాస్త్రం పై చాలా
విలువైన పుస్తకాలు ఉన్నాయి
బీహార్‌లోని ముస్లిం సమాజాల విద్యను
మెరుగుపరచడానికి మదరసా అజీజియా 1920లో
బ్రిటిష్ ప్రభుత్వం నుండి గుర్తింపు పొందింది. భారత స్వాతంత్ర్య పోరాటం లో కోసం
మదరసా లో చదివిన అనేక మంది ముస్లింలు పాల్గొన్నారు.
చుట్టుపక్కల నాలుగు జిల్లాలకు మదరసా అజీజియా
మర్కాజ్‌గా ఉంది. బిన్న మతాల మద్య గురించి
విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి మదరసా అజీజియా నిర్వహిస్తున్న
కార్యక్రమాలు UNESCOచే గుర్తించబడినవి మరియు మార్చి 2020లో యునైటెడ్
నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA)చే మదరసా అజీజియా ప్రత్యేక ప్రస్తావన
పొందింది.
అజీజియా మదర్సా ప్రతిష్టాత్మకమైన
అభ్యాసం, విజ్ఞానం మరియు మతపరమైన కేంద్రం
మదర్సా అజీజియా ఫౌకానియా కోర్సుల వరకు
బీహార్ స్టేట్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్‌తో అనుబంధంగా ఉంది మరియు ఆలిమ్, ఫాజిల్
మరియు మౌల్వీ కోర్సుల కోసం మౌలానా మజరుల్ హక్ అరబిక్ మరియు పర్షియన్
విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉంది
బీబీ సోఘ్రా విరాళాల ద్వారా నిర్మించిన
మొట్టమొదటి విద్యా సంస్థల్లో మదరసా అజీజియా ఒకటి. సోఘ్రా హైస్కూల్ మరియు సోఘ్రా
కాలేజ్ ని సోఘ్రా వక్ఫ్ ఎస్టేట్ నిర్వహిస్తోంది. ప్రారంభమైనప్పటి నుండి, మదరసా అజీజియా
ఇస్లామిక్ విద్య యొక్క ప్రసిద్ధ కేంద్రంగా ఉంది. మదరసా అజీజియా విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు, అలాగే
ఉపాధ్యాయులకు కూడా హాస్టల్ కలదు మరియు
దాని ఆవరణలో ఒక మసీదు ఉంది.
తాజా నివేదికల ప్రకారం, 50౦మంది విద్యార్థులు ఒకటో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు వరకు మదరసాలో చదువుతున్నారు.వారిలో 85% మంది బాలికలు మొదటి తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉన్నారు. మదరసా లో అజీజియా కంప్యూటర్ గది మరియు మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు ఇతర సైన్స్ అంశాల చార్టులతో కూడిన సైన్స్ ల్యాబ్ కలదు.
మదరసా పూర్వ విద్యార్థులలో ఆగ్రాలోని మదర్సా ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ
చేసిన మౌలానా అబూ సల్మా, ప్రముఖ రచయిత మరియు రచయిత మౌలానా మసూద్
అలీ నద్వీ మరియు దారుల్ దేవ్‌బంద్‌లో ముఫ్తీ ఆజం (గ్రాండ్ ముఫ్తీ)గా పదవీ విరమణ
చేసిన ముఫ్తీ నిజాముద్దీన్,. . మౌలానా అబ్దుల్ రెహ్మాన్, ప్రఖ్యాత
కవి మౌలానా షబ్నం కలామి, వీర్ కన్వర్ సింగ్ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా పదవీ
విరమణ చేసిన డాక్టర్ M. M కలరు
మదరసా అజీజియా అనేది బీహార్ మరియు
వెలుపల ఉన్న ముస్లింలకు చెందిన, భాగస్వామ్య గుర్తింపు, జ్ఞాపకాలు
మరియు శాంతియుత సహజీవనానికి చిహ్నం.
మదరసా అజీజియా జ్ఞానానికే కాకుండా
సాంస్కృతిక వారసత్వం మరియు సామాజిక ఐక్యతకు ప్రతీక. మదరసా అజీజియా హిందూ మరియు
ముస్లింల మధ్య స్నేహపూర్వక మరియు శాంతియుత సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తుంది.
మదరసా అజీజియాని 2023లో
రామనవమి ర్యాలీ సందర్భంగా మతోన్మాదులు తగులబెట్టారు. మదరసా అజీజియా లోని వేలాది పుస్తకాలు మంటల్లో కాలిపోయాయి.10 కోట్లకుపైగా
ఆర్థిక నష్టం వాటిల్లింది
No comments:
Post a Comment