“ఆయనే మీ మాత్రు గర్భాలలో, మూడేసి చీకటి పొరలలో ఒకదాని తరువాత ఒకటిగా-దశలవారీగా-రూపకల్పన చేస్తూ పోతున్నాడు. ఈ అల్లాహ్ యే మీ ప్రభవు. సార్వబౌమత్వం ఆయనదే. ఆయన తప్ప మరో దైవం లేడు. మరలాంటప్పుడు మీరు ఎక్కడినుండి (దారి) మళ్ళించబడుతున్నారు? దివ్య ఖురాన్ (39: 6)
దివ్య ఖురాన్ లోని పై ఆయత్ కడుపులోని శిశువు యొక్క మూడు చీకటి దశలను ఎత్తి చూపుతుంది మరియు గర్భంలో మనిషి మూడు దశల సృష్టితో సృష్టించబడ్డాడని పేర్కొంటుంది
అరబిక్ వ్యక్తీకరణ, فِيظُلُمَاتٍثَلَاثٍ (fi
zulumatin thalathin), ఆంగ్లంలోకి
"ఇన్ త్రీ వైల్స్ ఆఫ్ డార్క్నెస్" అని అనువదించబడింది, పిండం దాని అభివృద్ధి సమయంలో మూడు చీకటి దశలను
సూచిస్తుంది.
ఈ దశల క్రమం క్రింది విధంగా ఉంది:
1- పూర్వ ఉదర గోడ యొక్క చీకటి The darkness of the anterior
abdominal wall
2- గర్భాశయ గోడ యొక్క చీకటి The darkness of the uterine wall
3- అమ్నియోకోరియోనిక్ పొర యొక్క చీకటి The darkness of amniochorionic
membrane
నేటి ఆధునిక జీవశాస్త్రం కూడా దివ్య
ఖురాన్ లో పెర్కొనట్లు శిశువు యొక్క పిండం
అభివృద్ధి మూడు వేర్వేరు చీకటి దశలలో జరుగుతుందని తెలియజేసింది.
పిండ శాస్త్రంలో జరిగిన పరిణామాలు ఈ భాగాలు మూడు విభాగాలుగా ఉన్నాయని
నిరూపించాయి
అంతేకాక, ఖురాన్ లోని ఆయత్ ప్రకారం మనిషి ఒకదానికొకటి భిన్నంగా ఉండే మూడు వేర్వేరు దశలలో ఉనికిలోకి వస్తాడని
సూచించబడింది. నిజానికి, నేటి ఆధునిక జీవశాస్త్రం కూడా గర్భంలోని శిశువు యొక్క పిండం అభివృద్ధి మూడు
వేర్వేరు దశల్లో జరుగుతుందని తెలియజేసింది..
పిండశాస్త్రం embryology పై బేసిక్ రెఫరెన్సు పుస్తకాలలో ఒకటి అయిన “బేసిక్ హ్యూమన్ ఎంబ్రియాలజీ” అనే పుస్తకం లో ఈ క్రింది విధంగా వివరించబడింది,
గర్భాశయంలోని జీవితం Life in the uterus మూడు దశలను కలిగి ఉంటుంది:
1- ప్రీ-ఎంబ్రియోనిక్ దశ; (మొదటి రెండున్నర వారాలు).
2- పిండ దశ; (ఎనిమిదవ వారం చివరి వరకు).
3- మరియు పిండం దశ; (ఎనిమిదవ వారం నుండి పుట్టిన వరకు).
ఈ దశలలో శిశువు యొక్క వివిధ అభివృద్ధి దశలు ఉంటాయి. గర్భంలో శిశువు అభివృద్ధి గురించిన సమాచారం ఆధునిక సాంకేతిక పరికరాలతో చేసిన పరిశీలనల ద్వారా మాత్రమే పొందవచ్చు.
అనేక ఇతర శాస్త్రీయ వాస్తవాల మాదిరిగానే దివ్య ఖురాన్ యొక్క ఆయత్ లలో ఈ
సమాచారం అద్భుతంగా వివరించబడినది. .
మానవాళికి మెడిసిన్ యొక్క అంశంపై ఎటువంటి వివరణాత్మక సమాచారం లేని సమయంలో(సుమారు
15oo౦౦ సంవత్సరాలకు పూర్వం) పంపబడిన దివ్య
ఖురాన్‌లో హ్యూమన్ ఎంబ్రియాలజీ పై చాలా వివరణాత్మక మరియు నిజమైన సమాచారం ఉన్నందున దివ్య
ఖురాన్ అల్లాహ్ యొక్క వాణి అనుటకు ఇది రుజువు.
:
No comments:
Post a Comment