.1857లో బ్రిటీష్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ఫిరంగితో
పేల్చివేయబడిన మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్న అమరవీరుడు సిపాయి ఆలం
బేగ్ యొక్క పుర్రెను 1985లో తిరిగి అదే
ప్రదేశం లో ఖననం చేయడానికి భారతదేశానికి తీసుకు రావాలి అన్న ఉద్యమం ను క్వీన్ మేరీ
యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో గ్లోబల్ మరియు ఇంపీరియల్ హిస్టరీని బోధించే బ్రిటిష్
ప్రొఫెసర్ కిమ్ ఎ. వాగ్నర్ నిర్వహిస్తున్నారు.
బ్రిటిష్ ప్రొఫెసర్ కిమ్ ఎ. వాగ్నర్ మరియు
“ది స్కల్ ఆఫ్ అలుమ్ భేగ్: ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ ఎ
రెబెల్ ఆఫ్ 1857” పుస్తక రచయిత కూడా.
ప్రొఫెసర్ కిన్ వాగ్నర్ బహు గ్రంధ
కర్త. ప్రొఫెసర్ కిన్ వాగ్నర్ 'థగ్గీ: బాండిట్రీ
అండ్ ది బ్రిటీష్ ఇన్ ఎర్లీ నైన్టీన్త్-సెంచరీ ఇండియా', 'ది గ్రేట్ ఫియర్ ఆఫ్ 1957: రూమర్స్, కాన్పిరసీస్ అండ్ ది మేకింగ్ ఆఫ్ ది
ఇండియన్ అప్‌రైజింగ్' మరియు 'అమృతసర్ 1919: యాన్ ఎంపైర్ ఆఫ్ ఫియర్
అండ్ ది మేకింగ్ ఆఫ్ ఎ మాసకర్' Thuggee: Banditry and the British
in Early Nineteenth-Century India’, ‘The Great Fear of 1957: Rumours,
Conspiracies and the Making of the Indian Uprising’, and ‘Amritsar 1919: An
Empire of Fear and the Making of a Massacre’. వంటి అనేక
పుస్తకాలను ప్రచురించినాడు. బ్రిటిష్ ఇండియా చరిత్ర పై ప్రొఫెసర్ కిన్ వాగ్నర్
నిపుణుడు.
1963లో ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని ఒక పబ్‌లో 1857 నాటి “స్కల్” వార్ ట్రోఫీ దొరికిందని ప్రొఫెసర్ వాగ్నర్ చెప్పాడు. పబ్‌యజమాని దానిని 2014లో ప్రొఫెసర్ వాగ్నర్ కి అప్పగించాడు మరియు ప్రొఫెసర్
వాగ్నర్ 2017లో అలుమ్ భేగ్‌పై “ది స్కల్ ఆఫ్ అలుమ్ భేగ్: ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ ఎ
రెబెల్ ఆఫ్ 1857” అనే పుస్తకాన్ని
ప్రచురించాడు.
గుర్తుతెలియని బ్రిటీష్ అధికారులు
పుర్రె ను ఐర్లాండ్‌కు తీసుకువచ్చారని, తరువాత అది చేతులు మారిందని ప్రొఫెసర్ వాగ్నర్ చెప్పారు.
"పుర్రె తో పాటు లభించిన చేతితో వ్రాసిన నోట్ ప్రకారం పుర్రె 1857 తిరుగుబాటులో పాల్గోన్నo౦దుకు ఫిరంగి కు కట్టి పేల్చివేయబడిన
బ్రిటీష్ సేవలో ఉన్న భారతీయ సైనికుడు అలుమ్ భేగ్ యొక్క పుర్రె అని వెల్లడించింది. అలుమ్
భేగ్ మరణశిక్ష ను అమలు పరిచినప్పుడు అక్కడ ఉన్న ఒక ఐరిష్ అధికారి అలుమ్ భేగ్ పుర్రె ను యుద్ధ
ట్రోఫీగా తీసుకువచ్చాడు" అని కిమ్ వాగ్నర్ రాశాడు.
పంజాబ్ యూనివర్శిటీలోని ఆంత్రోపాలజీ
విభాగానికి చెందిన ప్రొఫెసర్. ఎస్. సెహ్ర్వత్ మాట్లాడుతూ, 1857 విప్లవం సమయంలో, హవల్దార్ ఆలం బేగ్ ను ఫిరంగికి కట్టి పేల్చివేశారు. హవల్దార్ ఆలం బేగ్ పుర్రె
ఇంగ్లాండ్‌లో కనుగొనబడింది.దీని గురించి వాగ్నర్ Wenger.తనతో చెప్పాడని ప్రొఫెసర్. ఎస్. సెహ్ర్వత్ Sehrwat చెప్పాడు
ఆలం బేగ్ పుర్రెతో దొరికిన నోటు
పుర్రె యొక్క పూర్తి శోధన రికార్డు
కనుగొనబడింది. పుర్రె గుర్తింపును నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు DNA పరీక్ష చేయాలని ఆసక్తిగా ఉన్నారు. ఆలం బేగ్
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని మరియు ఒక కుటుంబం కూడా
అతనిని తమ పూర్వీకుడని పేర్కొన్న సంగతి తెలిసిందే.
వారణాసిలోని BHUలో జన్యుశాస్త్రం బోధించే ప్రొఫెసర్ దినేశ్వర్ చౌబే
ప్రకారం, ఆలం బేగ్ పుర్రెపై రెండు రకాల పరీక్షలు చేయవచ్చు.
ఢిల్లీలో నివసిస్తున్న కాన్పూర్ కుటుంబం ఆలం బేగ్‌కు బంధువు అని పేర్కొంది. వారి
జన్యువులను దానితో సరిపోల్చవచ్చు.
కిమ్ వాగ్నెర్ మరియు ఇతర చరిత్రకారులు
భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఏదో ఒక ప్రదేశంలో ఆలం బేగ్‌ని సమాధి చేయాలని
ప్రచారం చేస్తున్నారు, అక్కడ ఆలం బేగ్
మరణించాడు.
ఆలం బేగ్ ఒక క్రైస్తవ మతగురువు
కుటుంబాన్ని చంపాడని బ్రిటిష్ వారు ఆరోపించారని మరియు అది కల్పిత అభియోగమని ప్రొఫెసర్
కిమ్ వాగ్నర్ చెప్పారు. ఆలం బేగ్ బెంగాల్ స్థానిక పదాతిదళానికి Bengal Native Infantry చెందిన 46వ రెజిమెంట్‌కు సిపాయి అని రికార్డు చెబుతోంది.
హవల్దార్ ఆలం బేగ్‌ను తన దేశంలో ఖననం
చేయడానికి ఇదే సరైన సమయమని కిమ్ వాగ్నర్ అభిప్రాయపడ్డాడు, హవల్దార్ ఆలం బేగ్, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య
సరిహద్దు ప్రాంతంలోని రావి నది ఒడ్డున త్రిము ఘాట్ యుద్ధంలో పోరాడాడు.
ప్రొఫెసర్ కిమ్ వాగ్నర్ ప్రకారం , " ఆలం బేగ్ యొక్క భౌతిక అవశేషాలను అతని స్వదేశానికి తీసుకురావడం మాత్రమే నా
లక్ష్యం, తద్వారా అతను మరణించిన చాలా కాలం తరువాత అతను శాంతితో
విశ్రాంతి తీసుకుంటాడు”..
చరిత్రకారుల ప్రకటన కూడా చాలా కాలం
గడిచినా నేటికీ ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. భారతదేశపు గొప్ప పుత్రులలో ఒకరి
పుర్రెను భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ మట్టిలో పాతిపెట్టే సమయం కోసం అది కూడా
వేచి ఉంది.
నేచురల్ హిస్టరీ మ్యూజియం దాని
ప్రామాణికతను ధృవీకరించింది మరియు ప్రొఫెసర్ వాగ్నెర్, చాలా తక్కువ ఆధారాలతో, వివిధ వనరులను ఉపయోగించి ఆలం భేగ్ చరిత్రను గుర్తించాడు.
No comments:
Post a Comment