19 September 2023

పేద ముస్లిం పిల్లల కోసం 100 పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న 23 ఏళ్ల వలీ రహ్మానీ Wali Rahmani, 23, is close to setting up 100 schools for poor Muslim children

 

 

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), విద్య మరియు పేదరికం గురించి గణాంకాలను విడుదల చేసింది. గణాంకాల ప్రకారం ఫీజు కట్టలేక 2021లో 10 లక్షల మంది పాఠశాలలకు వెళ్లడం మానేశారు.

23 ఏళ్ల వలీ రహ్మానీ అనే న్యాయ విద్యార్థి. విద్యారంగంలో వెనుకబడి ఉన్న ఉన్న ముస్లిం బాలల కోసం స్కూల్స్ స్థాపించబోతున్నాడు.

లా ఫైనల్ ఇయర్ విద్యార్ధి అయిన కోల్‌కతాకు చెందిన 23ఏళ్ళ  వలీ రహ్మానీ దేశంలోని అత్యుత్తమ పాఠశాలలు అయిన  సెయింట్ జేమ్స్, కోల్‌కతా మరియు జెనెసిస్ గ్లోబల్ స్కూల్, నోయిడాలో చదివాడు. సింగపూర్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిగా ముంబైలో జరిగిన టర్న్‌కోట్ డిబేట్‌లో జాతీయ స్థాయి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

వలీ రెహ్మానీ ఉమీద్ అకాడమీని స్థాపించారు, ఇక్కడ వలీ రెహ్మానీ పేద ముస్లిం కుటుంబాల నుండి వచ్చిన అమ్మాయిలు మరియు అబ్బాయిలకు "కాన్వెంట్ తరహా" విద్యను అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. 2018లో వలీ రెహ్మానీ 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వెంటనే, 10 మంది పిల్లలతో ఉమీద్ ఫౌండేషన్ మరియు వలీ రెహ్మానీ పాఠశాల ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు.

పెద్ద సంఖ్యలో ముస్లిం విద్యార్థులకు కాన్వెంట్ తరహావిద్యను అందించడం వలీ రెహ్మానీ కల. ప్రస్తుతం ఉమీద్ అకాడమీ క్యాంపస్ కోల్‌కతా సమీపంలోని రెండు ఎకరాల స్థలంలో నిర్మించబడుతోంది. ఉమీద్ అకాడమీ క్యాంపస్ ఒక పాఠశాల, బాలురు మరియు బాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, ఫుట్‌బాల్ మైదానం మరియు బాస్కెట్‌బాల్ కోర్టును కలిగి ఉంటుంది.

సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసిన వలీ రెహ్మానీ 10 లక్షల మంది ముస్లింలు ఒక్కొక్కరు రూ. 100 విరాళంగా ఇస్తే కోటి రూపాయలు సమకూరుతాయని అవి పేదరికం కారణంగా చదువుకొని muslim పిల్లలకు ఉపయోగపడతాయని వివరించాడు.

యూట్యూబ్‌లో విడుదల చేసిన మరొక వీడియోలో  వలీ రెహ్మానీ ముస్లింలలో పాఠశాల మానేసిన/డ్రాప్-అవుట్ muslim పిల్లల  గణాంకాలను వివరించడానికి ప్రయత్నించారు.

దేశంలోని 21 శాతం ముస్లింలు దారిద్య్ర రేఖకు దిగువన బతకాల్సి వస్తుందని నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రిసోర్సెస్ యొక్క 2019 డేటాను వలీ రెహ్మానీ ఉటంకించారు. 6 కోట్ల మంది భారతీయ ముస్లింల నెలవారీ ఆదాయం రూ. 2500 కంటే తక్కువగా ఉంది, అయితే నెలకు రూ. 2500 నుండి రూ. 10,000 సంపాదిస్తున్న ముస్లిముల  డేటా అందుబాటులో లేదు.

తన 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, కష్టపడి పనిచేసే ముస్లిం కుటుంబాల పిల్లలకు ఇస్లామిక్-కాన్వెంట్ విద్యను అందించాలని నిర్ణయించుకున్నట్లు వలీ రహ్మానీ తన వీడియోలో చెప్పారు.

కోల్‌కతాలో ప్రస్తుతం ఉన్న ఉమీద్ అకాడమీ క్యాంపస్ చిన్నదని, దానిని మరో రెండు ఎకరాల్లో క్యాంపస్ నిర్మిస్తున్నట్లు వలీ రెహ్మానీ చెప్పారు. రూ. 10 కోట్ల కార్పస్‌తో ఇలాంటి మరో 100 పాఠశాలలను నిర్మించేందుకు సహకరిస్తానని వలీ రెహ్మానీ చెప్పారు.

వలీ రెహ్మానీ వీడియో సందేశం ప్రభావం చూపుతుంది. ప్రజలు డబ్బు విరాళంగా ఇస్తున్నారు..నాయకులు పుట్టరు, తయారవుతారు అని వలీ రెహ్మానీ అభిప్రాయపడ్డారు.

వలీ రెహ్మానీ 2019లో జరిగిన సౌత్ ఇండియా NGO కాన్ఫరెన్స్‌లో యంగ్ సోషల్ హీరో అవార్డు గ్రహీత.

ఉమ్మీద్ అకాడమీలో లౌకిక విద్య మరియు ఇస్లామిక్ విద్య ను  పెంపొందించే పాఠ్యాంశాలు ఉన్నాయి.

ఉమ్మీద్ అకాడమీ పాఠశాలలో CBSE మరియు ISC పాఠ్యాంశాలు ఉన్నాయి. బాల్య వివాహాలు, లైంగిక హింస, బహిష్టు పరిశుభ్రత మరియు బాల కార్మికుల పట్ల అవగాహన లేకపోవడం, మాదకద్రవ్యాల వ్యసనం మరియు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు ఎదుర్కొంటున్న మాదకద్రవ్యాల ప్రేరిత వాతావరణం వంటి సామాజిక సమస్యలపై కూడా ఉమీద్ ఫౌండేషన్ పని చేస్తుంది

లౌకిక విద్య తో పాటు ముస్లిం పిల్లలకు ఖురాన్ పఠనం, ఇస్లామిక్ చరిత్ర, సీరా, దువా, హదీసులు మరియు ఇస్లామిక్ మర్యాదలు నేర్పిస్తారు.

 

No comments:

Post a Comment