4 September 2023

రషీద్-ఉన్-నిసా, మొదటి మహిళ ఉర్దూ నవలా రచయిత్రి Rashid-un-Nisa, the First Woman Urdu Novelist

 



 

మొదటి నుండి ఉర్దూ నవల రచనలో  స్త్రీలు మరియు వారి సమస్యలు ప్రస్తావించబడినవి.  1869లో ప్రచురించబడిన  మౌల్వీ నజీర్ అహ్మద్ యొక్క రచన మిరత్-ఉల్-ఉరూస్  మరియు దాని సీక్వెల్ బినాత్-ఉన్-నాష్‌తో సహా, చాలా ప్రారంభ నవలలు/కథలు స్త్రీలు, వారి విద్య మరియు సామాజిక స్థితిగతుల గురించి చిత్రించినవి.

ముస్లిం రచయితలను  స్త్రీల హక్కు కోసం ప్రచారం చేయడంలో మేలుకొల్పిన ఘనత సర్ విలియం ముయిర్‌కు దక్కుతుంది. ముయిర్ 1857లో అలీఘర్‌లోని మదర్సతుల్-ఉలూమ్ వార్షిక సెషన్‌లో తన ప్రసంగంలో భారతీయ ముస్లిం మహిళలు  ఆధునిక విద్య యొక్క అబ్యాసించడం లో ఈజిప్షియన్ మహిళలను అనుసరించాలని కోరారు..

సర్ విలియం ముయిర్‌ సూచనను అనుసరించి, బ్రిటీష్ ప్రభుత్వం ముస్లిం మహిళల్లో విద్య యొక్క ఆలోచనను ప్రోత్సహించే ఉర్దూ పుస్తకాలకు వార్షిక ద్రవ్య బహుమతిని ప్రకటించింది.

నజీర్ అహ్మద్ మౌల్వీ కరీం-ఉద్దీన్ యొక్క తజ్కిరా-ఉన్-నిసాహ్, ముహమ్మద్ హుస్సేన్ ఖాన్ యొక్క తెహజీబ్-ఎ-నిస్వాన్ మరియు ముహమ్మద్ జహీర్-ఉద్దీన్ ఖాన్ యొక్క తాలిమ్-ఇ-నిస్వాన్ నవలలతో పాటు మరికొన్ని ఇతర నవలలు కూడా ద్రవ్య అవార్డు ను పొందాయి.

1869లో ప్రచురించబడిన  మౌల్వీ నజీర్ అహ్మద్ యొక్క రచన మిరత్-ఉల్-ఉరూస్  ప్రచురించబడినప్పుడు రషీద్-ఉన్-నిసా వయస్సు 16 సంవత్సరాలు. రషీద్-ఉన్-నిసా అజీమాబాద్ (ప్రస్తుతం, పాట్నా)కు చెందిన  విద్యావంతులైన ఉన్నత కుటుంబానికి చెందినది. మిరత్-ఉల్-ఉరూస్ నవల చే రషీద్-ఉన్-నిసా ప్రభావితం అయినది మరియు రషీద్-ఉన్-నిసా ను సమాజం లోని ఇతర మహిళల స్థితిని గురించి ఆలోచించేలా చేసింది.

రషీద్-ఉన్-నిసా సోదరుడు ఇమ్దాద్ ఇమామ్ అసర్ ఉర్దూ సాహిత్యంలో అత్యున్నత సాహితీవేత్తలలో ఒకరు. రషీద్-ఉన్-నిసా, అలీ ఇమామ్ మరియు హసన్ ఇమామ్‌లకు అత్త, రషీద్-ఉన్-నిసా మౌల్వీ మహమ్మద్ యాహ్యాను వివాహం చేసుకున్నారు, మౌల్వీ మహమ్మద్ యాహ్యా సాహిత్య అభిరుచికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. రషీద్-ఉన్-నిసా ఒక మహిళగా తనకు విద్య, సాహిత్యం మరియు జ్ఞానం అందుబాటులో లేదని గ్రహించారు.

19వ శతాబ్దంలో మరియు 20వ శతాబ్దపు ప్రారంభంలో కూడా, స్త్రీ విద్య అందరికి అందుబాటులో లేదు. రషీద్-ఉన్-నిసా హిందూ మరియు ముస్లిం మహిళలకు ఆధునిక విద్య అందుబాటులో ఉండాలి.

 “మిరాత్-ఉల్-ఉరూస్ నవలచే ప్రభావితం అయిన రషీద్-ఉన్-నిసా 1880లో ఒక నవల రాయడం మొదలుపెట్టి ఆరునెలల్లోనే పూర్తి చేసింది. ఈ నవల 1881లో వ్రాయబడినప్పటికీ, రషీద్-ఉన్-నిసా దానిని 1894 వరకు ప్రచురించలేకపోయింది.

రషీద్-ఉన్-నిసా 1881లో ఇస్లా-ఉన్-నిసా Islah-un-Nisa  అనే నవల రాశారు కానీ రషీద్-ఉన్-నిసా కుమారుడు సులైమాన్ బారిస్టర్ లాలో పట్టా పొందిన తర్వాత ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చే వరకు ప్రచురణ కొరకు వేచి ఉండాల్సి వచ్చింది. 1894లో, ఇస్లా-ఉన్-నిసా Islah-un-Nisa నవల ప్రచురించబడినప్పుడు, దానికి రచయిత పేరు లేదు. బదులుగా, రచయితను బారిస్టర్ సులైమాన్ తల్లిగా, సయ్యద్ వహిదుద్దీన్ ఖాన్ బహదూర్ కుమార్తెగా మరియు ఇమ్దాద్ ఇమామ్ సోదరిగా పేర్కొన్నారు.

ఉర్దూలో ప్రచురించబడిన మొదటి మహిళ పుస్తకంలో, రచయిత తన పేరును కూడా పేర్కొనడానికి అనుమతించబడలేదు.

మౌల్వీ నజీర్ అహ్మద్ రచనలకు రషీద్-ఉన్-నిసా ముగ్ధులయ్యారు. మహిళల్లో మేల్కొలుపు సృష్టించిన నజీర్ అహ్మద్‌ రచనలు తనను ప్రోత్సహించాయని  రషీద్-ఉన్-నిసా పేర్కొన్నది. ఇస్లాహ్-ఉన్-నిసాలో రషీద్-ఉన్-నిసా స్త్రీ విద్య గురించి ప్రస్తావించారు.

రషీద్-ఉన్-నిసా రచనలతో పాటు విద్యావేత్త కూడా. 1906లో రషీద్-ఉన్-నిసా మదర్సా ఇస్లామియా (ప్రస్తుతం బెటియా హౌస్ Betia House అని పిలుస్తారు) అనే బాలికల పాఠశాలను స్థాపించింది. ఈ పాఠశాలలో ముస్లింలకు ఉర్దూ మరియు హిందువులకు హిందీ బోధించేవారు.  

రషీద్-ఉన్-నిసా యొక్క పోరాటం స్ఫూర్తిదాయకం మరియు చదవదగినది

 

 

 

No comments:

Post a Comment