వలసవాద కాలంలో ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు హాలండ్‌కు బానిసలుగా మారాయి. ఇండోనేషియా, మలేషియా లోకూడా తమ దేశాన్ని విముక్తి చేయడానికి పోరాడుతున్న స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారు. భారతదేశంలో, స్వాతంత్ర్య సమరయోధులను స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్నందుకు శిక్షగా అండమాన్ మరియు నికోబార్ లేదా మాల్టా దీవులకు పంపెవారు.. అలాగే ఇండోనేషియా, మలేషియా స్వాతంత్ర్య సమరయోధులను శిక్షగా దక్షిణాఫ్రికాకు పంపబడేవారు.
ఇమామ్ అబ్దుల్లా బిన్ ఖాజీ అబ్దుల్ సలామ్ ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. అబ్దుల్లా బిన్ ఖాజీ అబ్దుల్ సలామ్ (తవాన్ గురు)గా ప్రసిద్ధి చెందాడు. అబ్దుల్లా బిన్ ఖాజీ అబ్దుల్ సలామ్ ను 1780లో శిక్షగా సౌత్ ఆఫ్రికా లోని కేఫ్-టౌన్ కు సమీపంలోని బౌకేప్ కు కూలి గా పంపారు. బౌకేప్‌లో ఇండోనేషియా, మలేషియా మరియు భారతదేశంలోని గుజరాత్ నుండి తీసుకురాబడిన అనేక మంది ఇతర ఖైదీలు మరియు బానిసలు కలరు. వారిలో ఎక్కువ మంది ముస్లింలు.
సమస్య ఏమిటంటే, వారందరూ ముస్లింలు, కానీ దక్షిణాఫ్రికాలో మసీదు లేదు, వారి వద్ద ఖురాన్ లేదు. ముస్లిం ఖైదీలు మరియు బానిసలు మసీదును నిర్మించడానికి అక్కడి అధికారుల నుండి అనుమతి కోరారు. అనుమతి పదిహేనేళ్ల తర్వాత లబించినది.. 1798లో కేప్ టౌన్ ప్రాంతమైన బుకేప్‌లో ఒక మసీదును నిర్మించారు, దీనికి (అవ్వల్ AUWALअव्वल మస్జిద్) అని పేరు పెట్టారు. ఇది దక్షిణాఫ్రికాలో నేటికీ ఉనికిలో ఉన్న మొదటి మసీదు.
కాని పారాయణం చేయడానికి ఖురాన్ గ్రంధం లేదు. అప్పుడు స్వయంగా హఫీజ్ అయిన తవాన్ గురు, తన చేతితో ఖురాన్ రాయడం ప్రారంభించాడు మరియు చాలా అందమైన దస్తూరితో ఖురాన్ రచన జరిగింది. నేటికి ఈ ఖురాన్ రాత ప్రతి సందర్శకులు చూడటం కోసం అవ్వల్ మసీదులో ఉంచబడింది
ఈ విధంగా, వలస ఖైదీలు మరియు బానిసలు దక్షిణాఫ్రికాలో ఇస్లాం మతానికి పునాది వేశారు, నేడు ఆ దేశంలో దాదాపు 2% ముస్లింలు ఉన్నారు, అయితే కేప్ టౌన్ నగరంలో ముస్లింల జనాభా 5%, మరియు అక్కడి సమాజంలో వారికి ముఖ్యమైన స్థానం ఉంది.
బుకేప్ పరిసర ప్రాంతం ఇప్పటికీ ముస్లిం జనాభా కలిగిన ప్రాంతం. ఇక్కడ ఇండోనేషియా, మలేషియా మరియు భారతదేశం నుండి ముస్లింల వారసులు నివసిస్తున్నారు. ఈ పరిసరాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. బుకేప్‌లో ఇళ్లను రంగురంగులగా ఉంచడం ఆచారం. ఆ ఇళ్లను చూడటానికి పర్యాటకులు వస్తారు..
ఈ విధంగా, ఇమామ్ అబ్దుల్లా
బిన్ ఖాజీ అబ్దుల్ సలామ్ అలియాస్ తవాన్ గురు మరియు అతని సహచరులు ఇస్లాంను సుదూర
దేశానికి తీసుకువచ్చారు.
No comments:
Post a Comment