12 September 2023

పాశ్చాత్య ఆంక్షలను ఎదుర్కోవడానికి రష్యా ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను ఏర్పరుస్తుంది

 

.

మాస్కో: రష్యా సెప్టెంబరు 01, 2023న అధికారికంగా దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ మరియు దాని పశ్చిమ మిత్రదేశాలు విధించిన ఆంక్షలకు ప్రతిఘటనగా రష్యా ఇస్లామిక్ బ్యాంకింగ్‌ వ్యవస్థను  ఏర్పరచినది.

ఇస్లామిక్ బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఇస్లామిక్ ఫైనాన్స్‌లో ఇప్పటికే అత్యధిక అనుభవం ఉన్న రష్యాలోని నాలుగు ముస్లిం ఆధిపత్య ప్రాంతాలలో టాటర్‌స్తాన్, బాష్‌కోర్టోస్తాన్, చెచ్న్యా మరియు డాగేస్తాన్‌లలో ప్రారంభించబడింది

స్టేట్ డూమా, రష్యా పార్లమెంట్ దిగువ చాంబర్, జూలై 19న తన చివరి సమావేశం లో దేశంలోని నాలుగు ప్రాంతాలలో ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా రెండేళ్లపాటు ప్రవేశపెట్టేందుకు అనుమతించే బిల్లును ఆమోదించింది. ఈ చట్టంపై ఆగస్టు 04, 2023న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు.

ఇస్లామిక్ బ్యాంకింగ్ సిస్టమ్  ను  షరియా ఆధారిత ఫైనాన్స్ లేదా వడ్డీ రహిత బ్యాంకింగ్ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ సిస్టమ్ ను రష్యా యొక్క సెంట్రల్ బ్యాంక్ పర్యవేక్షిస్తుంది మరియు ఫలితాల ఆధారంగా మొత్తం రష్యాలో విస్తరించవచ్చు మరియు ప్రారంభించవచ్చు అని రష్యా చట్టం పేర్కొంది.

ఇస్లామిక్ బ్యాంకింగ్ షరియా కింద పనిచేస్తుంది, ఇస్లామిక్ న్యాయ వ్యవస్థ రిబా, వడ్డీ లేదా వడ్డీకి సంబంధించిన లావాదేవీలను నిషేధిస్తుంది. రిబా,లేదా  వడ్డీ  ఇస్లాంలో అన్యాయమైన మార్పిడిగా పరిగణించబడుతుంది.

సాంప్రదాయిక ఫైనాన్స్ రుణ ఆధారితమైనది మరియు లావాదేవీలలో అన్ని రిస్క్ మరియు బాధ్యతలను క్లయింట్ భరిస్తాడు.. ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది ఆస్తి ఆధారితమైనది, లాభం మరియు నష్టాలను ఆర్థిక సంస్థ మరియు క్లయింట్ భాగస్వామ్యంలో భాగంగా పంచుకుంటారు..

ఇస్లామిక్ బ్యాంకులు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాయి మరియు రుణగ్రహీతలు కాలక్రమేణా స్థిర మొత్తాలలో డబ్బును తిరిగి చెల్లిస్తారు, వ్యాపారాలలో భాగస్వాములు అవుతారు, లాభాలు మరియు నష్టాలను పంచుకుంటారు మరియు డబ్బును రుణంగా ఇవ్వడానికి బదులుగా వినియోగదారులకు ఆస్తులను అద్దెకు ఇస్తారు.

ముస్లిం దేశాలతో పాటు UK, USA మరియు సింగపూర్ వంటి దేశాలలో ఇస్లామిక్ బ్యాంకింగ్ ప్రజాదరణ పొందింది. ఇస్లామిక్ బ్యాంకింగ్ రంగం వార్షిక వృద్ధి రేటు 40 శాతం మరియు 2025 నాటికి $7.7 ట్రిలియన్ల విలువకు చేరుకుంటుందని అంచనా వేయబడింది.

ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను స్వీకరించడం వెనుక ఉన్న తక్షణ కారణం రష్యా యొక్క 25 మిలియన్లు ముస్లిం జనాభా అవసరాలను తీర్చడం  కానీ, రష్యా నిర్ణయం వెనుక ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎదుర్కొంటున్న పాశ్చాత్య ఆంక్షలు మరో కారణమని ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పశ్చిమ దేశాల నిధులకు ప్రత్యామ్నాయంగా ముస్లిం దేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించాలని రష్యా భావిస్తోంది.

ఈ ఆలోచన రష్యాలో మతపరమైన కారణాల వల్ల పెట్టుబడి పెట్టని ముస్లిం-మెజారిటీ దేశాల పెట్టుబడిదారులు  రష్యాలో పెట్టుబడి పెట్టడానికి తలుపులు తెరిచింది, ఇది గేమ్-ఛేంజర్.

రష్యాకు ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి తెలియనిది కాదు. వాస్తవానికి, 2008 ఆర్థిక సంక్షోభం నుండి, బ్యాంకులు లిక్విడిటీ కొరతను ఎదుర్కొన్నప్పుడు మరియు నగదు ప్రత్యామ్నాయ వనరుల కోసం వెతకడం ప్రారంభించినప్పటి నుండి ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ దేశంలో చర్చనీయాంశంగా ఉంది,

"2014లో ఉక్రెయిన్ నుండి క్రిమియాను స్వాధీనం చేసుకున్న తరువాత, రష్యా బ్యాంకులు పాశ్చాత్య ఆంక్షల ఒత్తిడిని అనుభవిస్తున్నందున, రష్యన్ బ్యాంకుల సంఘం రష్యన్ ఫెడరేషన్‌లో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను అనుమతించాలని మరియు షరియా బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంక్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది"

ఉక్రెయిన్‌లో యుద్ధం మరియు రష్యా ఆర్థిక రంగంపై పాశ్చాత్య ఒత్తిళ్లు ఇస్లామిక్ బ్యాంకింగ్ వైపు మళ్లే ప్రక్రియను వేగవంతం చేసిన తాజా పరిణామాలు మాత్రమే.

 

No comments:

Post a Comment