మలప్పురం, కేరళ:
హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి
చేసిన తర్వాత కేరళ మలప్పురానికి చెందిన 18 ఏళ్ల రిన్షా పట్టకల్ తన ఖాళీ సమయాన్ని డ్రోన్
ఫ్లైయింగ్ నైపుణ్యం నేర్చుకోవడానికి ఉపయోగించాలని నిర్ణయించుకొని చరిత్ర సృష్టించింది.
సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్
అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే డ్రోన్ ఫ్లైయింగ్ పాఠాలు తీసుకోవాలని
రిన్షా నిర్ణయించుకుంది. సర్వేయింగ్‌లో డ్రోన్‌ల అపారమైన సామర్థ్యాన్ని గుర్తించిన
రిన్షా తండ్రి, రిన్షా డ్రోన్
ఫ్లైయింగ్ పాఠాల నైపుణ్యాన్ని
నేర్చుకోవడానికి ప్రోత్సహించారు
రిన్షా 25 కిలోల బరువున్న
డ్రోన్లను ఎగురవేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుండి లైసెన్స్
పొందిన మొదటి మహిళగా రిన్షా నిలిచింది.
కాసరగోడ్‌లోని ASAP కేరళ కమ్యూనిటీ స్కిల్
పార్క్ లోని DGCA ఆమోదించిన డ్రోన్-ఫ్లయింగ్ శిక్షణా
కేంద్రంలో రిన్షా తీసుకున్న కఠినమైన శిక్షణ, రిన్షా చారిత్రాత్మక
విజయానికి మార్గం సుగమం చేసింది.
రిన్షా, ASAP యొక్క మొట్టమొదటి
డ్రోన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ బ్యాచ్‌లోని ఏకైక మహిళా విద్యార్థిని. రిన్షా తన విజయంతో దేశవ్యాప్తంగా ఉన్న
యువతులకు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది.
భారతదేశంలో, డ్రోన్‌లను ఆపరేట్
చేయడానికి DGCA డ్రోన్
రిమోట్ పైలట్ సర్టిఫికేట్ తప్పనిసరి అవసరం.. పదవ తరగతి ఉత్తీర్ణత మరియు పాస్‌పోర్ట్
కలిగి ఉన్న 18
సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పైలట్‌లు కోర్సులో నమోదు చేసుకోవడానికి
అర్హులు.
రిన్షా సాధించిన విజయాలు అందరికీ
స్ఫూర్తిగా నిలుస్తాయని, కేరళ ASAP అధికారులు
తెలిపారు. “రిన్షా
సాధించిన విజయ౦ విమానయాన రంగంలో మహిళలకు
సాధికారతను అందించడమే కాకుండా కేరళను ముందుకు
నడిపిస్తుంది” అని ఒక
అధికారి తెలిపారు.
మూలం:newindianexpress.com, జూలై 28, 2023
No comments:
Post a Comment