8 November 2023

పాల్వాంకర్ సోదరులు-100సంవత్సరాల పూర్వం ప్రసిద్దిచెందిన భారతీయ క్రికెటర్లు. Palwankar brothers–FaFamous Indian cricketers-100 years ago

 


కుల వివక్ష వ్యవస్థ నుండి బయటపడి, కష్టాలు మరియు పోరాటాల తర్వాత తమకంటూ ఒక పేరు తెచ్చుకున్న నలుగురు పాల్వంకర్ సోదరుల కథ ఇది.

పాల్వంకర్ సోదరులు నలుగురూ బాలూ, శివరామ్, విఠల్ మరియు గణపత్ చాలా ప్రతిభావంతులైన క్రికెటర్లు. నలుగురు సోదరులలో  పెద్దవాడు, బాలూ, తన కాలంలోని అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకరిగా ఆంగ్లేయులచేత కూడా ప్రశంసించబడ్డాడు.

పాల్వంకర్ సోదరుల కథ 1800 ల చివరలో ప్రారంభమైంది. పాల్వంకర్ సోదరుల తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సిపాయి. పాల్వంకర్ సోదరుల తండ్రి సైన్యం నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత పూణేలోని బ్రిటిష్ అధికారుల క్లబ్‌లో గార్డెనర్‌గా ఉద్యోగం సంపాదించాడు. తోటమాలిగా అతని ఉద్యోగం క్లబ్ మైదానంలో ఉన్న క్రికెట్ పిచ్‌ను నిర్వహించడం కూడా కలిగి ఉంది. కొన్నిసార్లు పాల్వంకర్ సోదరులు, తమ తండ్రి కి  పని చేయడంలో కూడా సహాయం చేసేవారు.

పాల్వంకర్ సోదరులు తమ పని పూర్తయిన తర్వాత, కొన్నిసార్లు చుట్టూ పడి ఉన్న క్రికెట్ సామగ్రిని తీసుకొని క్రికెట్ ఆడేవారు.. ఒకరోజు పాల్వంకర్ సోదరుల క్రికెట్ ఆటను కల్నల్ జె.జి గ్రేగ్ అనే ఆర్మీ అధికారి తిలకించాడు..

కల్నల్ జె.జి గ్రేగ్ క్రికెటర్ మరియు పాస్టర్ కూడా. జె.జి గ్రేగ్ బ్రిటిషర్ అయినప్పటికీ, తన తండ్రి పని చేసిన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో జన్మించాడు. జె.జి గ్రేగ్ పొట్టిగా మరియు స్లిమ్ గా ఉండేవాడు మరియు అద్భుతమైన క్రికెటర్.  జె.జి గ్రేగ్ మొదట బాంబే ప్రెసిడెన్సీ టోర్నమెంట్లలో మరియు తరువాత ఇంగ్లాండ్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

క్రికెట్ ఆడే పాల్వంకర్ సోదరుల నైపుణ్యాలు  జె.జి గ్రేగ్ ను ఆకట్టుకోన్నవి.  ముఖ్యంగా, పాల్వంకర్ సోదరులలో ఒకడైన  బాలూ, ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ జె.జి గ్రేగ్ దృష్టిని ఆకర్షించింది. జె.జి గ్రేగ్,  పాల్వంకర్ సోదరుల నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. జె.జి గ్రేగ్,  నెట్స్ లో తనకు బౌలింగ్ చేయమని బాలూకు  చెప్పాడు మరియు తనను అవుట్ చేయమని బాలూని ప్రోత్సహించాడు. జె.జి గ్రేగ్, బాలూతో ఇలా చెప్పాడు – నన్ను అవుట్ చేసిన ప్రతిసారీ, నేను నీకు అర్ద రూపాయి ఇస్తాను. త్వరలోనే  నెట్ ప్రాక్టీస్ చేయాలనుకునే ఇతర బ్రిటిష్ అధికారులు, పాల్వంకర్ సోదరులను  తమకు  బౌలింగ్ చేయమని అడిగేవారు..

పాల్వంకర్ నలుగురు సోదరుల క్రికెట్ ప్రయాణం అలా మొదలైంది. పాల్వంకర్ నలుగురు సోదరులు  తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకున్నారు మరియు ఆటలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. వారు చమర్ కులానికి చెందినవారు మరియు భారత ఆటగాళ్ళు మరియు జట్టు అధికారులు వీరితో స్నేహంగా ఉండటానికి అంగీకరించలేదు. చాలా మంది ఇతర భారతీయ ఆటగాళ్ళు పాల్వంకర్ నలుగురు సోదరులతో కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడలేదు. పాల్వంకర్ సోదరులు  లంచ్ టైంలో మెయిన్ హాల్ బయట కూర్చుని విడివిడిగా భోజనం చేయాల్సి వచ్చింది.

నాటోర్ రాజా (బంగ్లాదేశ్‌లోని) పాల్వంకర్ సోదరులలో ఒకడైన  బాలూ యొక్క ఆట నైపుణ్యం గురించి విన్నాడు. బాలూ పాల్వంకర్ ను  తన పట్టణానికి వచ్చి తన జట్టులో ఆడమని ఆహ్వానించాడు. ఆ తర్వాత పాల్వంకర్ సోదరుల క్రికెట్ నైపుణ్యాలు చాలా ప్రశంసించబడ్డాయి, క్రమంగా కుల అడ్డంకులు తొలగిపోయాయి.

పాల్వంకర్ సోదరులలో ఒకడైన  బాలూ క్రికెట్ ప్రతిభ చాలా విజయవంతమైనది. 1911లో పాటియాలా మహారాజు నేతృత్వంలోని భారతదేశం నుండి ఒక జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు బాలూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్ లో భారత జట్టు పర్యటన అంతగా విజయవంతం కాలేదు కానీ 114 వికెట్లు తీసిన బాలూ ఇంగ్లీష్ క్రికెట్ నిపుణుల దృష్టిని ఆకర్షించాడు. వారు బాలూని విల్ఫ్రెడ్ రోడ్స్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు.

పాల్వంకర్ సోదరులలో మరోకడైన  శివరామ్ పాల్వాంకర్ తన కాలంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెట్ క్రీడాకారులలో ఒకడు. పాల్వంకర్ సోదరులు  ఉన్నత వర్గాలు మరియు బ్రిటీష్ వారు మాత్రమే ఆడే క్రీడగా భావించే క్రికెట్  క్రీడలో రాణించడానికి కుల అడ్డంకులను బద్దలు కొట్టారు. శివరామ్ పాల్వాంకర్ కూడా తన అన్నయ్యతో కలిసి 1911లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు.

పాల్వంకర్ సోదరులకు మహాత్మా గాంధీ నుండి మద్దతు లభించింది

క్వాడ్రాంగులర్ టోర్నమెంట్‌లో హిందువుల జట్టుకు విఠల్ పాల్వాంకర్ కెప్టెన్‌గా ఉన్నాడు. హిందువుల జట్టుకు, విఠల్ పాల్వాంకర్ మొదటి చమర్ కెప్టెన్. దేశమంతటా వ్యాపించిన కుల వ్యతిరేక ఉద్యమం మరియు మహాత్మా గాంధీ సమర్ధన, ప్రోత్సాహం వలన చివరికి  అయిష్ట మనస్సులు కూడా లొంగిపోవడం ప్రారంభించాయి.

పాల్వంకర్ సోదరులలో మరొకడు  గణపత్ పాల్వంకర్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు మరియు హిందువుల జట్టుతో సహా వివిధ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.

నలుగురు సోదరుల కథ క్రీడ స్పూర్తిని సూచిస్తుంది. క్రికెట్ లో వివక్షత తొలగి మెరిట్ మరియు ప్రతిభకు పట్టం కట్టడం జరిగింది..

No comments:

Post a Comment