6 November 2023

నెదర్లాండ్స్‌లోని ముస్లింలు Muslims in the Netherlands

 



యూరప్‌లోని  UK, ఫ్రాన్స్ మరియు నెదర్లాండ్స్‌ మొదలగు దేశాలలో ముస్లింలు మరియు ఇస్లాం గురించి ఒక పర్యాటకుని పరిశీలనలు

యునైటెడ్ కింగ్డం UK

UKలో, ఇస్లాం దాని రెండవ అతిపెద్ద మతం.  2011లో ముస్లిం జనాభా  మొత్తం జనాభాలో 4.4 శాతంగా ఉంది. 2021లో ఇది మొత్తం జనాభాలో 6.5 శాతానికి పెరిగింది, దేశంలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు లండన్‌లో ఉన్నారు.

కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముస్లింల పౌరసత్వాన్ని హరించడానికి కొన్ని చట్టాలు రూపొందించబడ్డాయి. కొంతమంది తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారని ఆరోపించడాన్ని ప్రభుత్వం ఖండించింది

UKజనాభా లెక్కల ప్రకారం 39% మంది ముస్లింలు ఇంగ్లండ్‌లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. యువ ముస్లింలు సామాజిక చలనశీలత అడ్డంకులను ఎదుర్కొంటున్నారని కూడా చెప్పబడింది. 

ఫ్రాన్స్:

ఐదు మిలియన్ల ముస్లింలు లేదా 4 శాతం ఫ్రెంచ్ జనాభా ముస్లింలు. ఇటీవలి అంచనా ప్రకారం ఫ్రాన్స్ లో  10 శాతం మంది ముస్లింలు. ఫ్రాన్స్ లో రాజ్యం ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంది వారిని రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తారు పూర్తి హిజాబ్ నిషేధించబడింది. పారిస్ వీధుల్లో మరియు రైల్వే స్టేషన్లలో వారి తలపై కండువాలు/స్కార్ఫ్స్ ధరించిన స్త్రీలను చూడవచ్చు.  భారీ జరిమానాలు విధించడం ద్వారా అనేక మసీదులు మూసివేయబడ్డాయి.

ఫ్రాన్స్ తన  ముస్లిం కమ్యూనిటీ నుండి 50 మిలియన్ యూరోలు జరిమానాగా వసూలు చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఫ్రెంచ్ ముస్లింలపై రాజ్య నియంత్రణ పెరుగుతోంది.ముస్లిముల పౌర హక్కులు తగ్గించబడ్డాయి నిజానికి వివక్ష పాటించబడుతోంది,

కొంతమంది నిపుణులు ఫ్రాన్స్‌లో ముస్లింలపై హింసకు చారిత్రక మూలాలు ఉన్నాయని చెప్పారు.

ఇటీవల అల్జీరియన్ సంతతికి చెందిన ఫ్రెంచ్ యువకుడు నహెల్ దాని ఫ్రెంచ్ పోలీసులచే చంపబడిన తర్వాత జరిగిన అల్లర్లను విచారించడానికి పారిస్‌ను సందర్శించడానికి UK నుండి వచ్చిన ఒక మానవ హక్కుల కార్యకర్తను ఫ్రాన్స్,  అనుమతించలేదు.

కొంతమంది నిపుణులు ఫ్రాన్స్‌లో ముస్లింలు బలహీనమైన సమాజం కాబట్టి, వారు అణచివేతకు గురవుతున్నారని కాబట్టి muslఫ్రాన్స్ లోని ముస్లిం సమాజం బలంగా మారాలని అన్నారు.

నెదర్లాండ్స్:

2023లో నెదర్లాండ్స్ లో ముస్లింలు1,040,574మంది కలరు.  ముస్లిమ్స్ నెదర్లాండ్స్ మొత్తం జనాభాలో 60 శాతం ఉన్నారు. 2018లో, వారు 5 శాతంగా ఉన్నారు. చాలా మంది ముస్లింలు ఆమ్‌స్టర్‌డామ్ రోటర్‌డ్యామ్, హేగ్ మరియు ఉట్రెచ్‌లలో నివసిస్తున్నారు.

చారిత్రాత్మకంగా నెదర్లాండ్స్ ఉదారవాద దేశం.నెదర్లాండ్స్‌ మతపరమైన స్వేచ్ఛను పాటించడం వల్ల పెద్ద సంఖ్యలో విబిన్న మతపరమైన సమూహాలు ఉన్నాయి.

1990 నుండి, చాలా మంది ముస్లింలు ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా శరణార్థులు నెదర్లాండ్స్  బోస్నియా, సోమాలియా, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్ నుండి వచ్చారు.

నెదర్లాండ్స్ లో 1933లో, మొదటి ముస్లిం మసీదు మరియు ఖనన స్థలం ఏర్పడినది. 1955లో ముబారక్ మసీదు నిర్మించబడింది. 2003లో మెవ్లానా మసీదు రోటర్‌డ్యామ్ లో నిర్మించబడింది.మొత్తంమీద నెదర్లాండ్స్‌లో 400 మసీదులు ఉన్నాయి. ఆమ్‌స్టర్‌డామ్ రోటర్‌డ్యామ్, హేగ్ లో ప్రసిద్ధి చెందిన మసీదులు కలవు.

2019లో, ప్రజా రవాణా, ప్రభుత్వ భవనాలలో  పూర్తి ముసుగు (full
veil
) పై నిషేధం అమలు చేయబడింది.పబ్లిక్ వీధుల్లో ఇది వర్తించదు.పార్కులు మరియు రోడ్లపై చాలా మంది మహిళలు స్కార్ఫ్ మరియు పూర్తి దుస్తులు full dress ధరిస్తారు

పాఠశాలలో యూనిఫాం లేదు కాబట్టి ముస్లిం బాలికలు హిజాబ్ ధరిస్తారు మరియు అక్కడ విద్యా వ్యవస్థలు బాగున్నాయి. విద్య మరియు ఆరోగ్యం అందరికి అందుబాటులో కలదు.

మసీదులు విశాలంగా, సొగసుగా  మరియు అందమైనవి గా ఉన్నవి.  మసిదులలో మహిళలకు వేరే  విభాగం కలదు. మసీదులో అరబిక్‌లో కొన్ని కోర్సులు బోధిస్తారు. మసీదు విరాళాలు మరియు రుసుముతో నడుస్తుంది

నెదర్లాండ్స్‌లోని దాదాపు 80 శాతం మంది మొరాకో మూలానికి చెందిన ముస్లింలు ఆర్ధికంగా బాగా ఉన్నారు.

నెదర్లాండ్స్‌లో ఇస్లామోఫోబియా కొంత వరకు ప్రబలంగా ఉంది, ఇస్లామోఫోబిక్ ఉన్న కొందరు రాజకీయ నాయకులు ఉన్నారు. చాలా మంది చాలా సహనం కలిగి ఉంటారు, ఫ్రాన్స్‌లోని వారితో పోలిస్తే నెదర్లాండ్స్‌లోని ముస్లింలు మెరుగ్గా ఉన్నారు.

కొంతకాలం క్రితం, ఒక  డచ్ వ్యక్తి  ఖురాన్‌ను బహిరంగ ప్రదేశంలో తగులబెట్టాడు.అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్లిం దేశాలతో సంబంధాలను దెబ్బతీస్తున్నందున అలాంటి పద్ధతులను నిషేధించాలని తాము ఆలోచిస్తున్నామని నెదర్లండ్స్ మంత్రి ఒకరు చెప్పారు.

నెదర్లాండ్స్, ఫ్రీడమ్ రాజకీయ పార్టీకి చెందిన ముస్లిం ద్వేషపూరిత రాజకీయ నాయకుడు కొంతకాలం క్రితం ఇస్లాంలోకి మారారు. అతను ఇస్లాం పట్ల

ముస్లిమేతరులకు అవగాహన కల్పించడానికి ఒక కేంద్రాన్ని తెరిచాడు ముస్లింలు ముస్లిం ద్వేషాన్ని శాంతియుతంగా తెలివితో పోరాడాలని నిర్ణయించుకున్నారు.

 

 

No comments:

Post a Comment