22 November 2023

అంజుమన్-ఎ-ఇస్లాం-ముంబై-భారత దేశం లోని అతి పురాతన విద్యా సంస్థ Anjuman-e-Islam-Mumbai Oldest Educational Institution in India.

 

 

అంజుమన్-ఎ-ఇస్లాం 150 సంవత్సరాల క్రితం 1874లో   ముంబయిలో స్థాపించబడింది. అంజుమన్-ఎ-ఇస్లాం పాఠశాల ముంబయిలోని ప్రగతిశీల ముస్లిం మేధావుల కృషి ఫలితంగా ఏర్పడింది.

అంజుమన్-ఎ-ఇస్లాం పాఠశాల స్థాపనకు బాంబే హైకోర్టు మొదటి అక్టింగ్ చీఫ్ జస్టిస్ మరియు భారత జాతీయ కాంగ్రెస్ మూడవ అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ, అతని అన్నయ్య మరియు న్యాయవాది ఖమరుద్దీన్ త్యాబ్జీ, దాత   నఖుదా మహ్మద్ అలీ రోగే, వ్యాపారవేత్త మరియు సామాజిక కార్యకర్త గులాం మహ్మద్ మున్షీ చొరవ తీసుకున్నారు. అప్పటి బొంబాయి ప్రావిన్స్‌లోని ఉమర్‌ఖాడి సమీపంలోని బాబులా ట్యాంక్ వద్ద అంజుమన్-ఎ-ఇస్లాం పాఠశాల ప్రారంభమైంది.

1893లో, 'అంజుమన్-ఎ-ఇస్లాం' విక్టోరియా టెర్మినల్స్ (ప్రస్తుతం 'ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్') ఎదురుగా ఉన్న భవనానికి మార్చబడింది, అప్పటినుండి అది అక్కడే కొనసాగుతోంది. అప్పట్లో 'అంజుమన్'లో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పించారు. ఈ సౌకర్యాలలో ఉడికించిన గుడ్లు, రొట్టె మరియు అరటిపండ్లతో కూడిన మధ్యాహ్న భోజనం కలదు..

ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల పోషకాహార అవసరాలను భర్తీ చేయడానికి మరియు పేద కుటుంబాల వారు  తమ పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించడానికి భారత దేశం లో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టడానికి  చాలా కాలం ముందే స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టిన మొదటి విద్యా సంస్థ ముంబైలోని అంజుమాన్-ఎ-ఇస్లామ్.  

ముస్లింలకు ఆధునిక విద్యను అందించాలనే ఏకైక ఉద్దేశ్యంతో సర్ సయ్యద్ అహ్మద్ అలీఘర్‌లో 'అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం' (AMU) స్థాపనకు ఒక సంవత్సరం ముందు 1874లో అంజుమాన్-ఎ-ఇస్లామ్   స్థాపించారు.

'అంజుమన్' లో మొదట్లో 'మగపిల్లలకు మాత్రమే ప్రవేశం కల్పించారు మరియు చాలా కాలం తర్వాత  బాలికలకు ప్రవేశం కల్పించడం జరిగింది. 1936లో, బెల్లాసిస్ రోడ్‌లో 'సైఫ్ తయ్యబ్జీ గర్ల్స్ హై స్కూల్' పేరుతో బాలికల కోసం ప్రత్యేక పాఠశాల కూడా ప్రారంభించబడింది.

1874 ఫిబ్రవరి 21న ముగ్గురు ఉపాధ్యాయులు, 120 మంది విద్యార్థులతో ప్రారంభమైన 'అంజుమన్-ఎ-ఇస్లాం' ఇప్పుడు 97 విద్యాసంస్థలుగా రూపాంతరం చెందింది. నేడు 'అంజుమన్-ఎ-ఇస్లాం' విద్యాసంస్థల్లో 1.1 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు నర్సరీ నుండి పీహెచ్‌డీ వరకు చదువుతున్నారు.. నమోదు చేసుకున్న విద్యార్థులలో 70 శాతం మంది వారి కుటుంబాల నుండి విద్యను పొందిన మొదటి వారు.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అంజుమన్-ఎ-ఇస్లాం ప్రధాన పాత్ర పోషించింది. స్వాతంత్ర్య పోరాటంలో 'అంజుమాన్'కి చెందిన మొయినుద్దీన్ హారిస్ మరియు ముస్తఫా ఫకీతో సహా చాలా మందికి జైలు శిక్ష విధించబడింది. స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన అనేక విధాన సమావేశాలు దీని ప్రాంగణంలో జరిగాయి.దేశ నిర్మాణంలో 'అంజుమన్‌'కు సుదీర్ఘ చరిత్ర ఉంది.

ఈ రోజు 'అంజుమన్‌' సంస్థ యొక్క ప్రధాన పరిపాలనా కార్యాలయం 'అంజుమాన్ పాఠశాల ' స్థాపించబడిన ప్రదేశంలో ఉంది. 'అంజుమన్‌' ఇన్‌స్టిట్యూట్ యొక్క మూడు ఎకరాల క్యాంపస్‌లో ఐదు కళాశాలలు - రెండు క్యాటరింగ్ కళాశాలలు, ఒక వ్యాపార-నిర్వహణ కళాశాల, హోమ్ సైన్స్ కళాశాల మరియు ఒక న్యాయ కళాశాల - స్థాపించబడ్డాయి. అదనంగా, ఒక పాలిటెక్నిక్, మహిళల కోసం ఒక జూనియర్ కళాశాల మరియు ఇంగ్లీష్ మరియు ఉర్దూ మాధ్యమంలో రెండు పాఠశాలలు ఉన్నాయి. 'అంజుమన్‌'క్యాంపస్‌లో పెద్ద లైబ్రరీ మరియు పరిశోధనా కేంద్రం కూడా ఉన్నాయి.

సర్ కరీంబోయ్ ఇబ్రహీం, హాజీ యూసుఫ్ హాజీ ఇస్మాయిల్ సోబానీ, జస్టిస్ A. M. ఖాజీ, జస్టిస్ ఫైజ్ B. తయ్యబ్జీ, సర్దార్ సర్ సులేమాన్ కుల్సూమ్ మితా, హుస్సేన్ B. తయ్యాబ్జీ, ఉస్మాన్ సోబానీ, మహ్మద్ హాజీ అహ్మద్, A. I. మస్కతి, హదీ తయ్యాబ్, సయాబ్ తయ్యాబ్. అక్బర్ ఎ.పీర్‌బోయ్, ఎ.కె.హఫీజ్, ఎ.ఆర్.అంతులయ్, మొయినుద్దీన్ హారిస్, డాక్టర్ ఎం. ఇషాక్ జమ్‌ఖాన్‌వాలా, సమీ ఖతీబ్‌లు విశేష కృషి చేశారు. ప్రస్తుతం 'అంజుమన్‌'డా. జహీర్ కాజీ 'అంజుమన్‌' అధ్యక్షుడు.

''అంజుమన్' రెండు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది, మొదటిది - 'కనీస ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడం' మరియు రెండవది - 'నిధుల కొరత కారణంగా ఏ విద్యార్థి విద్యకు దూరం కాకుండా చూడడం ' 

'అంజుమన్'లో 50 శాతానికి పైగా విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుండి వచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసేందుకు వీలుగా అంజుమాన్ 'ప్రత్యేక జకాత్ ఫండ్'ను రూపొందించింది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా ఫీజులో 50 నుంచి 100 శాతం రాయితీ ఇస్తారు.

'హృదయపూర్వకంగా భోదించే  విద్య సమాజంలో విప్లవాన్ని తీసుకురాగలదు' అనే మౌలానా అబుల్ కలాం ఆజాద్ సందేశంతో అంజుమాన్ స్ఫూర్తి పొంది పని చేస్తోంది. 'అంజుమన్'లో 40 శాతానికి పైగా అమ్మాయిలు చదువుకొంటున్నారు.

నేడు 'అంజుమన్ సంస్థ ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, హాస్పిటాలిటీ, క్యాటరింగ్ మరియు హోటల్ మేనేజ్‌మెంట్, లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హోమ్ సైన్స్ మరియు టీచర్స్ ట్రైనింగ్ వంటి కోర్సులను అందిస్తోంది.

అంజుమన్ సంస్థల్లో 3000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2000 సంవత్సరంలో, 'అంజుమన్' రాష్ట్ర ప్రభుత్వంచే 'మహారాష్ట్రలోని ఉత్తమ విద్యా మరియు సామాజిక సంస్థ' అవార్డును పొందింది. ఇటీవల అంజుమన్ సంస్థ అలీఘర్ విశ్వవిద్యాలయంలోని AMU యొక్క 'సర్ సయ్యద్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్'ను అందుకుంది.

`అంజుమన్‌' పూర్వ విద్యార్థులు నేడు అనేక దేశాల్లో వ్యాపారం, సాంకేతికత, కళలు, క్రీడలు, మీడియా, వైద్య విజ్ఞానం, రాజకీయాలు వంటి వివిధ రంగాలలో ఉన్నత స్థానాల్లో పని చేస్తున్నారు. ఫార్చ్యూన్ కంపెనీ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, M.A. పఠాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి A. R. అంతులే, ప్రముఖ నటుడు దిలీప్ కుమార్, `మర్చంట్ ఆఫ్ మర్చంట్ ఐవరీ ప్రొడక్షన్స్' ఇస్మాయిల్ మర్చంట్, `ఇలస్ట్రేటెడ్ వీక్లీ' మాజీ డిప్యూటీ ఎడిటర్ ఫాతిమా జకారియా, మాజీ సంపాదకులు 'ముంబయి మిర్రర్' మరియు 'సండే టైమ్స్' ఫరీదా నాయక్ మరియు ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ.వంటి  సెలబ్రిటీలు 'అంజుమన్' పూర్వ విద్యార్థులు.

 

 

No comments:

Post a Comment