జర్మనీ, గ్రీస్ మరియు ఇటలీ నుండి
పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్సనల ఫోటోలు
ఆక్రమిత పాలస్తీనియన్ భూభాగాల మ్యాప్ (వెస్ట్ బ్యాంక్ మరియు గాజా స్ట్రిప్), గ్రీన్ లైన్ ద్వారా గుర్తించబడింది.
ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా అనుకూల ప్రదర్సనలు/కవాతుల్లో వినిపించే నినాదం 'నది నుండి సముద్రం వరకు, పాలస్తీనా స్వేచ్ఛగా ఉంటుంది' గురించి తెలుసుకొందాము.
అక్టోబరు 7న పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత, గాజాలో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున సైనికచర్యలను తీసుకోవడం పై ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి నిరసన వ్యక్తమైనది..
హమాస్ దాడి 1,200 మంది మరణానికి దారితీసింది మరియు ఇజ్రాయెల్ యొక్క నిరంతర ముట్టడి ఫలితంగా గాజాలో ఇప్పటివరకు 11,000 మందికి పైగా మరణించారు. కాల్పుల విరమణకు పిలుపునిస్తూ లండన్, న్యూయార్క్, పారిస్, బ్రస్సెల్స్ తదితర నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
'నది నుండి సముద్రం వరకు, పాలస్తీనా స్వేచ్ఛగా ఉంటుంది',అనే నినాదమును నిరసనకారులు/ప్రదర్సకులు పెద్దఎత్తున్న నినదించారు. 'నది నుండి సముద్రం వరకు, పాలస్తీనా స్వేచ్ఛగా ఉంటుంది' అనే నినాదం పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పెద్ద డిమాండ్‌ను ప్రేరేపిస్తుంది. ఈ నినాదం ఎక్కడ నుండి ఉద్భవించింది మరియు సంవత్సరాలుగా దానిని ఎవరు ప్రారంభించారు అనే విషయాన్నీ తెలుసుకొందాము..
మధ్యప్రాచ్యంలోని భూమిని చుట్టుముట్టిన రెండు నీటి వనరులను నినాదం సూచిస్తుంది. మధ్యధరా సముద్రం ఇజ్రాయెల్ మరియు పశ్చిమాన గాజా స్ట్రిప్ సరిహద్దులుగా ఉంది మరియు జోర్డాన్ నది (మృతసముద్రంలోకి ప్రవహిస్తుంది) పశ్చిమ తీరానికి తూర్పు వైపున ఉంది.
'నది నుండి సముద్రం వరకు, పాలస్తీనా స్వేచ్ఛగా ఉంటుంది',అనే నినాదము, పాలస్తీనా విముక్తికి పిలుపునిస్తుంది.. చారిత్రాత్మకంగా, పాలస్తీనా 19వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. 1వ ప్రపంచ యుద్ధంలో (1914 నుండి 1918 వరకు) మిత్రరాజ్యాలు - బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా మరియు మరికొన్ని ఇతర దేశాల చేతిలో ఒట్టోమన్ ఓడిపోయిన తరువాత ఇది మారిపోయింది. పాలస్తీనా బ్రిటీష్ పాలన లేదా మాన్దేట్ mandate క్రింద ఉంచబడింది, అంటే భవిష్యత్తులో దాని స్వీయ-పరిపాలన లేదా స్వాతంత్ర్యం కోసం ఒక మార్గాన్ని కలిగి ఉండాలని ఉద్దేశించబడింది
అయినప్పటికీ, అనేక కారణాలు దీనిని జరగకుండా నిరోధించాయి.-1939లో 2వ ప్రపంచ యుద్ధం నాటికి బ్రిటన్ బలహీనపడటం మరియు ఆ ప్రాంతం నుండి వైదొలగాల్సిన ఆవశ్యకత, జియోనిజం (పాలస్తీనా యూదుల మాతృభూమి అని ప్రోత్సహించిన రాజకీయ భావజాలం) మరియు జర్మనీ యొక్క నాజీ పాలనలో యూదు ప్రజలను హింసించడం మరియు మిలియన్ల మందిని చంపడం జరిగింది.. ఇది యూరప్ నుండి పాలస్తీనాకు యూదుల భారీ వలసలకు దారితీసింది, పాలస్తీనా యూదుల చారిత్రక మాతృభూమిగా పరిగణించబడుతుంది మరియు 1948లో ఇజ్రాయెల్ స్థాపనకు దారితీసింది.
UNప్రతిపాదిత రెండు-రాజ్యాల పరిష్కారం two-state solution - ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాల సృష్టి. 1947లో పాలస్తీనియన్లచే తిరస్కరించబడింది. అరిజోనా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మిడిల్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఆఫ్రికన్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన మహా నాసర్ ఇలా వ్రాశారు. "కారణం ఏమిటంటే పాలస్తీనా ప్రజలు పాలస్తీనా మొత్తాన్ని - నది నుండి సముద్రం వరకు - ఒక విడదీయరాని మాతృభూమిగా చూసారు."
దాదాపు 700,000 మంది పాలస్తీనియన్ల స్థానభ్రంశానికి దారితీసిన యుద్ధం తరువాత శక్తివంతమైన ఇజ్రాయెల్ రాజ్యం నియంత్రణలోకి వచ్చింది. దీనిని నక్బా లేదా విపత్తు అని పిలిచేవారు. ఇజ్రాయెల్‌లో మిగిలి ఉన్న పాలస్తీనియన్ల స్థితి బలహీనపడింది- నిఘా మరియు స్వేచ్ఛగా పని చేయడానికి మరియు ప్రయాణించడానికి వారి హక్కులను తగ్గించడం జరిగింది. . 'నది నుండి సముద్రం వరకు, పాలస్తీనా స్వేచ్ఛగా ఉంటుంది',అనే నినాదము 1960లలో ఉద్భవించింది.
ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య జరిగిన తదుపరి యుద్ధాలలో, ఈజిప్ట్ 1957లో గాజాను ఆక్రమించుకుంది మరియు జోర్డాన్ 1950లో వెస్ట్ బ్యాంక్‌పై నియంత్రణ సాధించింది. 1967 మరియు 1988 లో ఈజిప్ట్ మరియు జోర్డాన్ తాము నియంత్రణ సాధించిన పాలస్తీనా ప్రాంతాలను ఖాళి చేస్తారు మరియు ఆ భూభాగాలను పాలస్తీనియన్లు స్వాధీనం చేసుకుంటారు అని నమ్మటం జరిగింది. . పాలస్తీనియన్లు మరియు దాని స్వాతంత్ర్య మద్దతుదారులు పాలస్తీనా భూభాగం యొక్క సంపూర్ణ "విముక్తి" కోరుకున్నారు.
1974లో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (PLO) చైర్మన్ యాసర్ అరాఫత్ చేసిన UN ప్రసంగ౦ లో -. "రేపటి పాలస్తీనా పట్ల మా ఉమ్మడి ఆశల గురించి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు పాలస్తీనాలో నివసిస్తున్న యూదులందరినీ మాతో చేర్చుకుంటాము, వారు శాంతితో మరియు వివక్ష లేకుండా మాతో కలిసి జీవించడానికి ఎంచుకున్నారు," అని పేర్కొన్నాడు..
1980లు మరియు 90లలో, ఫతా మరియు PLO వంటి పాలస్తీనియన్ గ్రూపులు "ఒకే రాజ్యం నుండి రెండు-రాజ్యాల పరిష్కారానికి మద్దతు ఇచ్చేలా తమ అధికారిక వైఖరిని మార్చుకున్నాయి" ఇది చాలా మందికి రాయితీగా భావించబడింది
1987లో హమాస్-ఇస్లామిస్ట్, మిలిటెంట్ భావజాలం పెరగడంజరిగింది.. యూదులపై కఠిన వైఖరి-నది నుండి సముద్రం వరకు" - మొత్తం నియంత్రణ ఆలోచన హమాస్ చార్టర్‌లో కనిపించసాగింది.
కానీ 2017 నాటి హమాస్ కొత్త చార్టర్ "జాత్యహంకార, దూకుడు, వలసవాద మరియు విస్తరణ" లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉందని, కానీ జుడాయిజం లేదా యూదులకు వ్యతిరేకంగా కాదని పేర్కొంది.: “నది నుండి సముద్రం వరకు పూర్తి నియంత్రణ” కు బిన్న ప్రత్యామ్నాయాన్ని హమాస్ తిరస్కరిస్తుంది అని కూడా పేర్కొన్నది.
పాలస్తీనా వాదుల “నది నుండి సముద్రం వరకు పూర్తి నియంత్రణ” నినాదం పై విమర్శ –వ్యతిరేకుల అభిప్రాయలు:
గత వారం, US డెమొక్రాట్ మరియు పాలస్తీనియన్-అమెరికన్ రాజకీయవేత్త రషీదా త్లైబ్ ప్రజలు నినాదాలు చేస్తున్న వీడియోను షేర్ చేసినది. "నది నుండి సముద్రం వరకు అనేది స్వేచ్ఛ, మానవ హక్కులు మరియు శాంతియుత సహజీవనం కోసం ఒక ఆకాంక్ష, పిలుపు. మరణం, విధ్వంసం లేదా ద్వేషం కాదు" అని త్లైబ్ ట్వీట్ చేశారు
దీని తరువాత, ప్రతినిధుల సభ రషీదా త్లైబ్ కు వ్యతిరేకంగా ఒక నిందారోపణ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానం ప్రకారం ""నది నుండి సముద్రం వరకు అనేది ఇజ్రాయెల్ రాజ్యాన్ని నాశనం చేయడానికి మరియు హింసతో కూడిన ఒక జాతి విధ్వంసకర పిలుపు" అని పేర్కొంది.
"నది నుండి సముద్రం వరకు" అనే నినాదం “విభజించదగినది, బాధించేది, మరియు చాలా మంది దీనిని అంటి-సెమిటిక్‌గా భావిస్తారు" అని వైట్ హౌస్ ప్రతినిధి కరీన్ జీన్-పియర్ అన్నారు. "వివాదానికి ఆ నినాదం వర్తింపజేయడాన్ని మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తాము." అని పేర్కొన్నారు.
UKలో, ఇటీవల తొలగించబడిన అంతర్గత మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్ కూడా "నది నుండి సముద్రం వరకు" అనే నినాదం "యాంటిసెమిటిక్ ప్రసంగంలో ప్రధానమైనది" అని నమ్మారు.
ఇజ్రాయెల్ యొక్క అధికారిక X ఖాతా, 2021లో, నది నుండి సముద్రం వరకు నినాదం యొక్క వీడియోకు ప్రతిస్పందనగా, "ఇజ్రాయెల్ నిర్మూలన కోసం పిలుపునిచ్చేదానిగా వారు దీనిని ఉపయోగించారు" అని పేర్కొన్నది. .
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పార్టీ, లికుడ్, పార్టీ వేదికలో భాగంగా “నది నుండి సముద్రం వరకు నినాదం యొక్క సంస్కరణను పేర్కొన్నారు. సముద్రం మరియు జోర్డాన్ నది మధ్య, "ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం మాత్రమే ఉంటుంది" అని పేర్కొన్నారు..
"జోర్డాన్ నది
మరియు మధ్యధరా సముద్రం మధ్య ఇజ్రాయెల్ అనే ఒకే ఒక రాజ్యం మాత్రమే ఉంటుంది"
అని 2014లో
రిలిజియస్ జియోనిస్ట్ రాజకీయవేత్త యురి ఏరియల్ చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్
పేర్కొంది.
Indian
Express సౌజన్యం తో
No comments:
Post a Comment