యూదులు మరియు క్రైస్తవులు వరుసగా మోసెస్ మరియు క్రీస్తు అనుచరులు అయితే, ప్రపంచంలోని అన్ని మతాల ప్రవక్తలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండటం ఇస్లాం బోధనలలో అంతర్భాగము మరియు ముస్లింలు ప్రవక్తలందరికీ గౌరవం ఇస్తారు.
ఇశ్రాయెల్ అనేది ముస్లింలలో ఇది చాలా సాధారణ పేరు, ఈ ఆరు అక్షరాల పదానికి అధిక గౌరవం ఉంది. ఇది యాకూబ్ (జాకబ్) యొక్క మరొక పేరు.ఇది మూడు అబ్రహమిక్ మతాలు, జుడాయిజం, క్రిస్టియానిటీ మరియు ఇస్లాం ద్వారా గౌరవించబడే ప్రవక్త పేరు..
యూదులు, యాకూబ్ (జాకబ్) 12 మంది కుమారుల వారసులు కాబట్టి వారిని బని (బెనే) ఇశ్రాయెల్ అని కూడా పిలుస్తారు.
అదేవిధంగా, మూసా (మోసెస్) యూదులకు చెందిన గొప్ప ప్రవక్త. ఇంకా అతనిని మౌసా (మూసా అని కూడా పిలుస్తారు). అదే విధంగా, ఈసా (యేసు క్రీస్తు) అనేది ముస్లిం సమాజంలో చాలా సాధారణమైన పేరు.
ఆడవారిలో, మరియం లేదా మరియా (మేరీ లాగానే) ముస్లిములలో సాధారణ పేర్లు.
ముస్లింలు తమ పిల్లలకు పేరు పెట్టడంలో ఎంత ఉదారవాదంగా ఉంటారో పై పేర్లు సూచిస్తున్నాయి.
ప్రపంచంలోని అన్ని మతాల ప్రవక్తలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండటం ఇస్లాం బోధనలలో అంతర్భాగం. కాబట్టి, ముస్లింలు ప్రవక్తలందరికీ గౌరవం ఇవ్వాలి.
దివ్య ఖురాన్ దాదాపు అన్ని బైబిల్ ప్రవక్తల జీవితం మరియు బోధనలు మరియు బోధన సమయంలో వారు ఎదుర్కొన్న అడ్డంకులను చాలా వివరంగా చర్చించింది.
దివ్య ఖురాన్ యూదులను, క్రైస్తవులను గౌరవంగా గ్రంధ ప్రజలుగా సంభోధించినది.
క్రైస్తవులు మరియు యూదులు తమ పిల్లలకు అహ్మద్ లేదా మహమ్మద్ అని పేరు పెట్టరు, ఎందుకంటే వారు ముహమ్మద్ ను ప్రవక్తగా పరిగణించరు.
ఈ రోజు ఇజ్రాయెల్ పాలకులు అల్-అక్సా మస్జిద్ కాంప్లెక్స్‌పై అధికారం తమదని వాదిస్తున్నారు. కాని రోమన్లు మరియు తరువాత క్రైస్తవుల పాలనలో (క్రీ.శ. 324 మరియు 638 మధ్య) యూదులకు జెరూసలేం సమీపంలోకి రానివ్వలేదని వారికి బాగా తెలుసు. .
ఖలీఫ్ ఉమర్ పాలనలో ముస్లింలు, జెరూసలెంనగరాన్ని
స్వాధీనం చేసుకున్న తర్వాత మాత్రమే యూదులు జెరూసలెంలో తిరిగి స్థిరపడేందుకు
అనుమతించబడ్డారు. వారు పూర్తి స్వాతంత్ర్యం పొందారు మరియు ఉమయ్యద్, అబ్బాసిద్, ఫాతిమిడ్, అయ్యూబిద్, మమ్లుక్ మరియు
ఒట్టోమన్ రాజవంశాల కాలంలో యూదులు ఉన్నత పదవులను నిర్వహించారు. ముస్లిం పాలకులు
సైద్ధాంతికంగా భిన్నమైనప్పటికీ దాతృత్వాన్ని ప్రదర్శించారు.
No comments:
Post a Comment