ఈశాన్య భారత దేశం లో
సర్ సయ్యద్ గా పిలువబడే మహబుబుల్ హోక్ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన కథ. భారత దేశం లోని ఈశాన్య ప్రాంతంలో
ఆధునిక విద్యను అభివృద్ధి చేయడంలో తన మార్గదర్శక ప్రయత్నాలకు గాను మహబుబుల్ హోక్ "సర్ సయ్యద్ ఆఫ్ నార్త్
ఈస్ట్" గా కీర్తించబడినాడు.
నేడు విద్య అనేది ఒక
పెద్ద వ్యాపారంగా మారింది. సమాజంలోని మధ్య మరియు వెనుకబడిన
వర్గాలకు అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితిలలో పేదరికం కారణంగా ఎవరూ విద్యను
కోల్పోకుండా చూసేందుకు మహబుబుల్ హోక్ వంటి వ్యక్తులు ముందుకు వచ్చారు..
మహబూబుల్ హక్ వినయపూర్వకమైన, సంస్కారవంతమైన మరియు మర్యాదగల వ్యక్తి.
యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మేఘాలయతో సహా అనేక సంస్థల స్థాపకుడు మరియు
గౌహతిలోని ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఛైర్మన్ గా మహబుబుల్
హోక్ పనిచేస్తున్నారు..
మహబూబ్‌బుల్ హోక్
అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలోని పథర్‌కండిలోని పుర్బోగూల్ అనే మారుమూల గ్రామంలో ఒక
పేద కుటుంబం లో జన్మించాడు. బాల్యం లోనే
తండ్రి-తల్లిని
కోల్పోయాడు. అన్నయ్య ఖుమ్రుల్ హోక్ తన తమ్ముడు మహబుబుల్ హోక్ చదువుకు ఆర్థిక సహాయం
చేశాడు. మహబూబ్‌బుల్ హోక్ కరీంగంజ్‌లో మెట్రిక్యులేషన్‌ను పూర్తి చేసి, G.C కళాశాల, సిల్చార్ లో ఇంటర్మీడియట్ (సైన్స్)
పూర్తి చేసాడు.
తరువాత అలీఘర్
ముస్లిం విశ్వవిద్యాలయం నుండి BSc (కెమిస్ట్రీ)లో ఫస్ట్-క్లాస్
డిస్టింక్షన్ సంపాదించాడు మరియు PGDCA & MCA (కంప్యూటర్ సైన్సెస్‌లో మాస్టర్స్)లో
రెండవ-అత్యున్నత ర్యాంక్ సాధించాడు.
AMU నుండి పట్టభద్రుడయ్యాక, మహబుబుల్ హోక్ అనేక భారతీయ మరియు అంతర్జాతీయ బహుళజాతి
కంపెనీల నుండి వచ్చిన ఉద్యోగ ఆఫర్‌లను తిరస్కరించాడు మరియు గౌహతికి తిరిగి వచ్చి సమాజానికి
తోడ్పడాలని నిర్ణయి౦చుకోన్నాడు.
2001లో మహబుబుల్ హోక్, 84 రూపాయల మొత్తంతో, నలుగురు IGNOUలో చేరిన విద్యార్థులు మరియు అలీఘర్‌లోని తన పాత కంప్యూటర్‌తో తన విద్యారంగ
ప్రయత్నాన్ని ప్రారంభించాడు. తరువాత క్రమంగా గౌహతిలో 5-కంప్యూటర్ ల్యాబ్‌ను స్థాపించాడు మరియు భారతదేశం
అంతటా దూరవిద్యను అందించే ప్రతిష్టాత్మక ప్రైవేట్ విశ్వవిద్యాలయం సిక్కిం మణిపాల్
విశ్వవిద్యాలయం (SMU) యొక్క ఫ్రాంచైజీని
పొందాడు. ప్రారంభ బ్యాచ్‌లో కేవలం 26 మంది విద్యార్థులను చేర్చుకున్న ఈ అధ్యయన
కేంద్రం, 2006 నాటికి 35,000కి చేరుకుంది, భారతదేశంలో రెండవ
అతిపెద్ద SMU కేంద్రంగా
గుర్తింపు పొందింది.
సిక్కిం మణిపాల్ యూనివర్శిటీకి
బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన భారత ప్రఖ్యాత బౌలర్ అనిల్ కుంబ్లేచే అందించబడిన
ఐదు వరుస ఎక్సలెన్స్ అవార్డులతో మహబుబుల్ హోక్ అద్వర్యం లోని సిక్కిం మణిపాల్
విశ్వవిద్యాలయం (SMU) యొక్క ఫ్రాంచైజీ గౌరవించబడినది.
మణిపాల్ స్టడీ సెంటర్ తరువాత మహబుబుల్ హోక్ మేఘాలయలోని రి-భోయ్ జిల్లాలోని 9వ మైలులోని
బరిదువా ప్రాంతంలో పచ్చదనం మధ్య సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని కలిగి ఉన్న 400 ఎకరాల కొండ
ప్రాంతం లో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్
టెక్నాలజీ మేఘాలయ (USTM) స్థాపించాడు. USTM ఈశాన్య ప్రాంతంలో
మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం మరియు అత్యుత్తమమైనది. USTM,
NAAC గుర్తింపుపొందిన "A" గ్రేడెడ్
విశ్వవిద్యాలయం.
సైన్స్ & టెక్నాలజీ
విశ్వవిద్యాలయం, మేఘాలయ (USTM)లో 9000 మంది విద్యార్థులు కలరు. అందులో 57% మంది బాలికలు, 80% మంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మరియు 20% మంది ఉచిత లేదా
రాయితీ విద్య ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుండి వివిధ మతాలకు
చెందిన 30 మందికి
పైగా కమ్యూనిటీ మరియు తెగ విద్యార్థులు మరియు 1000+ సిబ్బందితో USTM భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తుంది.
USTM సంస్థ NET, GATE, SLET మరియు సివిల్ సర్వీసెస్ వంటి జాతీయ మరియు
రాష్ట్ర-స్థాయి పరీక్షలను క్లియర్ చేసిన విద్యార్థులకు ఫీజ్ వారి కోర్సు ఫీజు యొక్క పూర్తి వాపసు ఇస్తుంది. .
USTM,
30 కి.మీ పరిధిలోని పిల్లలకు ఉచిత విద్యను అందిస్తుంది.
ప్రతి భోదనా శాఖ క్యాంపస్ సమీపంలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటుంది.
మహబుబుల్ హోక్ ద్వారా స్థాపించబడిన కరీంగంజ్ జిల్లాలోని రెండు
సెంట్రల్ పబ్లిక్ స్కూల్‌లు ఈ ప్రాంతంలో ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య
అభివృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయి.
మహబుబుల్ హోక్ తన తల్లి పేరు మీద, 2015లో ఖైరున్ నెస్సా
బేగం మహిళా కళాశాల, బదర్‌పూర్‌లో
స్థాపించినాడు.
USTM జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలు, NGOలు మరియు R&D సంస్థలతో 250కి పైగా
భాగస్వామ్యాలను ఏర్పరచుకుంది.
USTM జూన్ 30, 2022న యాంటీ-గ్లోబల్ వార్మింగ్ సొసైటీ మొరిగావ్ నుండి
"గ్రీన్ అస్సాం అవార్డు" పొందినది.
ఎడ్యుకేషన్ ఎమినెన్స్ 2022 అవార్డులో
"బెస్ట్ ప్రైవేట్ యూనివర్శిటీ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా" టైటిల్‌తో సహా
ప్రతిష్టాత్మకమైన అవార్డులను సంపాదించింది.
ఇటీవల, ఆగస్టు 21న, USTM ఈశాన్య
ప్రాంతంలోని స్వదేశీ వర్గాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం మరియు సమగ్రతను పెంపొందించడంలో విస్తరణ
సేవలు మరియు నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య ద్వారా UNESCO యొక్క
"కమ్యూనిటీ ఎక్సలెన్స్ అవార్డు" అందుకుంది.
మహబుబుల్ హోక్ అనేక సంస్థలను
నిర్మించారు మరియు కొనసాగిస్తున్నారు. ఈశాన్య
ప్రాంతములోని పేదలు మరియు అట్టడుగువర్గాలకు
విద్యాపరంగా సేవ చేయాలనే అపరిమితమైన కోరిక
కలిగి ఉన్నారు. .
No comments:
Post a Comment