23 November 2023

పస్మాండ ముస్లింలు- చేరువ అవుతున్న బీజేపీ Pasmanda Muslims-BJP an opportunity to make inroads in the community

 


భారతదేశం లో ప్రతిపక్షం పస్మండ ముస్లింలకు సంబంధించిన సమస్యలతో అనుసంధానించబడటంలో విఫలమైంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ, పస్మండ ముస్లిం క‌మ్యూనిటీకి  చేరువ కావడంపై తొందర పడుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు భారతీయ జనతా పార్టీ పస్మాండ ముస్లింలకు చేరువ కావడంపై భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (ఇండియా) యొక్క ప్రతిపక్ష పార్టీలు మౌనం వహించాయి. ఒడిశా (2017), హైదరాబాద్ (2022), న్యూఢిల్లీ (2023) మరియు ఇటీవల భోపాల్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో - పస్మందాస్‌పై పిఎం మోడీ చేసిన ప్రస్తావనలపై చాలా వ్రాయబడినప్పటికీ ప్రతిపక్షo౦  ప్రతిస్పందన లేదా తగిన ప్రతిస్పందన లేకపోవడం, ఇంతవరకు విశ్లేషించబడలేదు

బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన కులాల సర్వే ఫలితముతో  పస్మందాస్‌తో సహా వెనుకబడిన వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. సర్వే నివేదికలో షేఖోరా, ఠాకురాయ్ మరియు కులయ్య Shekhora, Thakurai and Kulaiya వంటి ముస్లిం గ్రూపులు  అత్యంత వెనుకబడిన తరగతి (EBC) కేటగిరీలో చేర్చబడ్డాయి. కులయ్య ముస్లింలు మొఘలులతో కలిసి భారతదేశానికి వచ్చిన వలస ముస్లింల వారసులు. వారిని అత్యంత వెనుకబడిన తరగతి (EBC) లో చేర్చడం అణగారిన పస్మాండ సమూహాలను మాత్రమే కాకుండా అనేక హిందూ EBCలను కూడా EBC వర్గం కింద ప్రయోజనం పొందకుండా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

విస్మయకరమైన ఈ విషయం మరియు పస్మాండ సమస్య ను ప్రతిపక్షం పట్టించుకోపోవటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఇది అనేక కారణాలకు  పర్యవసానం అవుతుంది.

మొదటిది, ప్రతిపక్షాల ముస్లిం రాజకీయాలు బిజెపిని "ముస్లిం వ్యతిరేక" అని లేబుల్ చేయడం చుట్టూ తిరుగుతున్నాయి. రెండవది, ప్రతిపక్ష పార్టీలు తమ ఎన్నికల విజయాలలో ముస్లిం ఓట్ల లబ్ధిదారులు. మూడవది, ముస్లిం సమాజంలో సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పస్మాండ సమస్య కీలకం. నాల్గవది, ఇది ముస్లిం సమాజం యొక్క రాజకీయ ప్రవర్తనలో మార్పును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఐదవది, ఇది బిజెపి, ముస్లింలతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న అవకాశాన్ని సూచిస్తుంది. ఆరవది, ముస్లిం రాజకీయాలలో మొత్తం ముస్లింలు కాకుండా  ఒక muslim ఉప-సమూహం చర్చనీయాంశం కావడం ఒక  అరుదైన సంఘటనను సూచిస్తుంది.

భారతదేశంలోని ముస్లింలు అష్రాఫ్‌లు, అజ్లాఫ్‌లు మరియు అర్జల్‌లు అనగా  ముందడుగు, వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన అనే మూడు తరగతుల క్రింద వర్గీకరించబడ్డారు. పస్మండ అనేది చివరి రెండు (వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన) muslim అట్టడుగు వర్గాలకు ఒక పర్యాయ పదం. 40 కంటే ఎక్కువ కులాలు ఉన్నపస్మండ ముస్లిములు   భారతదేశంలోని ముస్లిం జనాభాలో 80% ఉన్నారు. భారతదేశంలోని ముస్లిం జనాభాలో అష్రాఫ్‌లు కేవలం 20% మాత్రమే కలిగి ఉన్నారు..

ప్రతిపక్ష పార్టీలు ముస్లిం కుల వ్యవస్థను అర్థం చేసుకోవడంలో ఉదాసీనతను ప్రదర్శించాయి. మైనారిటీ అష్రాఫ్‌లకు అసమానమైన అధిక రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది.. లోక్‌సభలో ఉన్న 25 మంది ముస్లిం ఎంపీలలో 18 మంది అష్రాఫ్‌లు, ఏడుగురు పస్మందాలు కలరు..

ఉత్తరప్రదేశ్‌ ముస్లిం జనాభాలో 65-70 శాతం వరకు ఉన్న పస్మండాలు, మునుపటి లోక్‌సభ ఎన్నికలలో, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముస్లిం అభ్యర్థుల్లో 1/4వంతు మరియు కాంగ్రెస్ నుండి 1/9 వంతు మంది మాత్రమే ఉన్నారు.

పస్మండ జనాభా అత్యధికంగా ఉన్న బీహార్‌లో, మహాగత్‌బంధన్‌లో అత్యధిక ముస్లిం శాసనసభ్యులు అష్రాఫ్‌లు. అంతేకాకుండా, ఎన్నికల ప్రసంగాలలో లేదా ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలలో పస్మందాస్ ఎన్నడూ కనిపించలేదు.

దీనికి విరుద్ధంగా, బిజెపి, ఇటీవల, పస్మందాస్‌తో మరింత కలుపుగోలుతనాన్ని ప్రదర్శించింది. యుపిలో 2023 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో, బిజెపి కేటాయించిన మొత్తం 395 మంది ముస్లింలలో 299 మంది పాస్మందాస్ ఉన్నారు. గెలిచిన 61 మంది ముస్లిం అభ్యర్థులలో 51 మంది పస్మండ వర్గానికి చెందినవారు. యుపి లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో, ప్రభుత్వం యొక్క తాజా నామినీలు ఇద్దరు పస్మందాస్.

ప్రతిపక్ష పార్టీలలోని అష్రాఫ్ ఆధిపత్యం ఆ రాజకీయ పార్టీలు తమ రాజకీయ ఎజెండాలలో పొందుపరిచిన అంశాలలో కూడా ప్రతిధ్వనిస్తుంది. అష్రాఫ్‌లు, పస్మందాస్‌తో పోలిస్తే ఎక్కువ ప్రయోజనం పొందారు, పస్మందాల సామాజిక-ఆర్థిక వైకల్యాల సమస్యలు కాకుండా  మతపరమైన మరియు సాంస్కృతిక స్వచ్ఛత మొదలగు సమస్యలపై దృష్టి పెట్టారు. 

."వివక్ష లేకుండా అభివృద్ధి" అనే నినాదం తో  ముస్లింలతో సన్నిహితంగా ఉండటాన్ని ఎంచుకున్నందున BJP విధానం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద, UPలో ముస్లింజనాభా 18 శాతం ఉన్నా ముస్లిం లబ్ధిదారులు 22 శాతం మంది ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన గణాంకాలలో  ముస్లిం లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే పస్మండా ముస్లింలు, అట్టడుగు వర్గంగా, దీనికి అర్హులు.

ఇంకా, అనేక పస్మాండ కులాలు నేత కార్మికులు (అన్సారీ), ప్రింటర్లు (దర్జి చిపి), దూది ఏకే వారు (మన్సూరి) మొదలైన తక్కువ-వేతన వృత్తులలో నిమగ్నమై ఉన్నందున, వారు ఇటీవల ప్రారంభించిన చిన్న కళాకారులకు ఆర్థిక సహాయం చేసే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన యొక్క లబ్ధిదారులుగా నిలిచారు..

పస్మండ ముస్లింల సమస్యలపై ప్రతిపక్షాల మౌనం వలన . పస్మందాస్ ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పస్మందాస్ క‌మ్యూనిటీతో  చేరువ అయ్యే అవ‌కాశ౦ కోసం  బీజేపీ చూస్తుంది.. 2024 సార్వత్రిక ఎన్నికలు ఈరెండు (పస్మండా-బిజెపి) కలుస్తాయో లేదో వెల్లడిస్తాయి.

 

 

No comments:

Post a Comment