అక్టోబరు 4,
1957న,
USSR తన
మొదటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కు చెందిన హషిమా హసన్ అనే ఒక బాలిక రష్యన్ శాటిలైట్
అంతరిక్షంలోకి వెళుతున్న దృశ్యాన్ని TVలో చూచి ప్రభావితురాలు అయ్యింది. స్పేస్ గురించి మరింత
తెలుసుకోని లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకుంది.
డిసెంబర్ 2022నాటికి
హషిమా హసన్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్
స్పేస్ అడ్మినిస్ట్రేషన్NASA శాస్త్రవేత్తలలో
ఒకరిగా మారింది.
డాక్టర్ హషిమా హసన్,
NASA యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
యొక్క డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్. జేమ్స్ వెబ్ స్పేస్
టెలిస్కోప్, ఎక్స్‌పో-స్టార్‌లు మరియు గెలాక్సీల సమూహాల
expo-stars
and clusters of galaxies యొక్క చిత్రాలను ప్రపంచానికి
అందించింది.
డిసెంబర్ 2022లో
నాసా విడుదల చేసిన సుదూర గెలాక్సీల సమూహం యొక్క మొదటి నాలుగు చిత్రాలు 13
బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలోని భాగాలను చూపించాయి. ఈ ఆవిష్కరణ విశ్వం మరియు
దాని మూలాల గురించి అవగాహనను మార్చింది.
లక్నోలో జన్మించిన హషిమా హసన్ 1994లో నాసా ప్రధాన కార్యాలయంలో చేరింది. డాక్టర్ హషిమా హసన్ యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, U.K. నుండి థియరిటికల్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో డాక్టరేట్ అందుకున్నారు. డాక్టర్ హషిమా హసన్ పోస్ట్-డాక్టోరల్ పరిశోధన చేసింది మరియు వివిధ విశ్వవిద్యాలయాలలో థియరిటికల్ న్యూక్లియర్ ఫిజిక్స్ మరియు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ బోధించింది.
డాక్టర్ హషిమా హసన్ బాగా చదువుకున్న
కుటుంబం నుండి వచ్చింది. డాక్టర్ హషిమా హసన్ మేనమామ డాక్టర్ హుస్సేన్ జహీర్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)
డైరెక్టర్
జనరల్‌గా పనిచేశారు.డాక్టర్ హషిమా హసన్ అత్త డాక్టర్ నజామా జహీర్ జీవశాస్త్రవేత్త.
వీరిద్దరి ప్రభావం డాక్టర్ హషిమా హసన్ పై కలదు. అలాగే డాక్టర్
హషిమా హసన్ పై తల్లి ప్రభావం కూడా కలదు. రష్యా స్పుత్నిక్-1 రాకెట్
ప్రభావం కూడా డాక్టర్ హషిమా హసన్ పై కలదు.
డాక్టర్ హషిమా హసన్ అణు భౌతిక
శాస్త్రంపై తన పరిశోధనను భాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో
ప్రారంభించారు. డాక్టర్ హషిమా హసన్ USకు తిరిగి వచ్చిన
తర్వాత,
త్వరలో
ప్రారంభించబోయే హబుల్ స్పేస్ టెలిస్కోప్ యొక్క ఆప్టిక్స్ కోసం అనుకరణ సాఫ్ట్‌వేర్‌ను
వ్రాయడానికి కొత్తగా స్థాపించబడిన స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ లో నియమించబడినది..
డాక్టర్ హషిమా హసన్ ఆప్టిక్స్ మరియు ఖగోళ శాస్త్ర పనిని కూడా చేపట్టింది.
స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో
పని చేయడం, ఆప్టిక్స్ మరియు ఖగోళ శాస్త్రంలో కూడా పని చేయడం
మరియు
హబుల్ టెలిస్కోప్‌లోని సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసిన ఆప్టికల్ లోపాన్ని
సరిదిద్దడానికి అవకాశం లభించడం డాక్టర్ హషిమా హసన్ నాసా ప్రయాణానికి మార్గం సుగమం
చేసింది.
డాక్టర్ హషిమా హసన్ లక్నో
విశ్వవిద్యాలయం నుండి BSc డిగ్రీ మరియు అలీఘర్
ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) నుండి భౌతిక
శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీతో పట్టభద్రురాలైంది. AMUలో
అకడమిక్స్‌లో డాక్టర్ హషిమా హసన్ గోల్డ్ మెడల్ పొందినది.
NASA వెబ్‌సైట్
ప్రకారం,
డాక్టర్
హషిమా హసన్ ఆస్ట్రోఫిజికల్ జర్నల్, Icarus, పసిఫిక్
ఆస్ట్రోనామికల్ సొసైటీ ప్రచురణలు వంటి వివిధ పీర్-రివ్యూడ్ జర్నల్‌లలో ఆర్టికల్స్ ప్రచురించారు.
2008లో
NASA
HQ ఎక్సెప్షనల్
పెర్ఫార్మెన్స్ అవార్డు, 1981-1983 వరకు నేషనల్
రీసెర్చ్ కౌన్సిల్ రెసిడెంట్ రీసెర్చ్ అసోసియేట్, 1973-1976
వరకు కామన్వెల్త్ ఫెలోషిప్, మరియు ఫిజిక్స్ విద్యార్థిగా బంగారు
పతకాన్ని అందుకోవడంతో బాటు విద్యార్ధిగా మెరిట్ అవార్డు పొందారు. డాక్టర్ హషిమా హసన్ తన అత్యుత్తమ
అకాడెమిక్ కెరీర్‌లో అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు మరియు ఫెలోషిప్‌లతో
సత్కరించబడింది..
No comments:
Post a Comment