తాష్కెంట్‌లోని లే గ్రాండే హోటల్‌లో ఉన్న రాజ్ కపూర్ రెస్టారెంట్ భారతదేశం నుండి వచ్చే పర్యాటకులకు మరియు అది నిర్వహించే బాలీవుడ్ రాత్రులకు ప్రసిద్ధి చెందింది.
తాష్కెంట్ నగరం నడిబొడ్డున, బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ పేరుమీద ఒక భారతీయ రెస్టారెంట్ ఉంది.తాష్కెంట్‌లోని మూడు ప్రధాన భారతీయ రెస్టారెంట్లలో ఒకటైన 'రాజ్ కపూర్' రెస్టారెంట్ 16 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది మరియు దాని వంటకాలు భారతీయ పర్యాటకులకే కాకుండా స్థానికులలో బాగా ప్రసిద్ది గాంచినవి.....
కపూర్ కుటుంబానికి చెందిన ముగ్గురు సూపర్ స్టార్లు - రణధీర్ కపూర్, రిషి కపూర్ మరియు శశి కపూర్ - వేర్వేరు సందర్భాలలో రెస్టారెంట్‌లో భోజనం చేశారు.
ఉజ్బెకిస్తాన్‌లోని ప్రజలకు బాలీవుడ్ సినిమాలు అంటే క్రేజీ. ఉజ్బెకిస్తాన్‌లోని తరతరాల ప్రజలకు రాజ్ కపూర్ మరియు అతని సినిమాలు ఇష్టం. ఉజ్బెకిస్తాన్ ప్రజల దృష్టిలో రాజ్ కపూర్ బాలీవుడ్ యొక్క నంబర్ వన్ హీరో. రాజ్ కపూర్ పేరు మీద గల భారతీయ రెస్టారెంట్ ఎక్కువ మంది ఉజ్బెక్ ప్రజలను, పర్యాటకులను ఆకర్షిస్తుంది మరియు భారతీయ ఆహారం కోసం చాలా మంది సందర్శకులు అక్కడికి వస్తారు. స్థానిక ఉజ్బెక్‌లు రెస్టారెంట్ లో 90ల హిందీ సినిమా టాప్ చార్ట్‌బస్టర్ విని ఆనందిస్తూ ఉంటారు. .
తాష్కెంట్‌లోని లే గ్రాండే హోటల్‌లో ఉన్న రాజ్ కపూర్ రెస్టారెంట్ ను ముంబైకి చెందిన ఖాన్ నిర్వహిస్తున్నాడు. రష్యా మరియు ఉజ్బెకిస్తాన్‌లో రాజ్ కపూర్ కు ఉన్న క్రేజ్ ఆధారంగా రెస్టారెంట్ ప్రారంభించాలనే యొక్క ఆలోచన మొదట ఇండోనేషియాకు చెందిన జే అల్ అటాస్ కు వచ్చింది. ఉజ్బెక్ పర్యటనలో స్థానిక ఉజ్బెకులకు భారతీయ వంటకాలు మరియు రాజ్ పట్ల ఉన్న ప్రేమ.అతన్ని విశేషంగా ఆకర్షించినవి. .
చాలా మంది భారతీయ పర్యాటక బృందాలు మరియు స్థానిక ఉజ్బెక్‌లు రాజ్ కపూర్ రెస్టారెంట్ బారతీయ ఆహారాన్ని ఆస్వాదిస్తారు. భారతదేశం నుండి ఒక బాలీవుడ్ సెలబ్రిటీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా రాజ్ కపూర్ రెస్టారెంట్ సందడిగా ఉంటుంది..
బాలీవుడ్ ప్రముఖులు దలేర్ మెహందీ మరియు రవి కిషన్‌ల ప్రదర్శనలు వంటి అనేక భారతీయ ఈవెంట్‌లకు తాష్కెంట్ లోని రాజ్ కపూర్ రెస్టారెంట్ అధికారిక క్యాటరర్.
భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు చెఫ్‌లు రాజ్ కపూర్ రెస్టారెంట్‌లో పని చేస్తున్నారు. భారతీయ వంటకాలు అయిన బటర్ చికెన్, బిర్యానీ, చీజ్ నాన్ మరియు దోస ఇక్కడ లబిస్తాయి.
సుష్మా స్వరాజ్ మరియు రాజ్‌నాథ్
సింగ్ వంటి రాజకీయ నాయకులు, మిథున్ చక్రవర్తి, షిబానీ కశ్యప్, దలేర్ మెహందీ, గుల్షన్ గ్రోవర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు రెస్టారెంట్‌ను
సందర్శించిన ప్రఖ్యాత వ్యక్తులు.
No comments:
Post a Comment