18 November 2023

మహిమల్ ముస్లింలు Mahimal Muslims

 


ప్రధానంగా బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ప్రాంతం మరియు అస్సాంలోని బరాక్ వ్యాలీ పరిసర ప్రాంతాలలో స్థిరపడిన లోతట్టు ముస్లిం మత్స్యకార కులాన్ని మహిమల్ (స్థానిక బెంగాలీ మాండలికంలో మైమల్) అని పిలుస్తారు. మహిమల్ అనే పదం రెండు పెర్షియన్ పదముల  కలయిక- మహి అంటే చేప మరియు మల్లా అంటే పడవ మనిషి. మహిమల్లా లేదా మహిమల్ అనగా మత్స్యకారుడు మరియు పడవ నడిపేవాడు అని అర్ధం.

పర్యావరణపరంగా, సిల్హెట్-కాచార్ ప్రాంతం సంవత్సరంలో 7-8 నెలల పాటు నీటిలో మునిగిఉంటుంది.. అలాంటి పరిస్థితుల్లో పడవ మాత్రమే రవాణా సాధనం. ఇక్కడి మత్స్యకారులు అద్భుతమైన పడవ నడిపేవారు మరియు వ్యవసాయదారులు. చేపలు పట్టడం మరియు సాగు చేయడం ఇక్కడి ప్రజల రెండు ముఖ్యమైన వృత్తులు.

మధ్యయుగాలలో సిల్హెట్-కాచార్ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ఇస్లాంను స్వీకరించారు. ప్రసిద్ధ సూఫీ సెయింట్ షేక్ షా జలాల్ యామెని (1346) మరియు అతని 360 మంది శిష్యులు సిల్హెట్ మరియు దాని పరిసర ప్రాంతంలో ఇస్లాం వ్యాప్తిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తూర్పు బెంగాల్ మరియు ముఖ్యంగా సిల్హెట్ ప్రాంత ప్రజలు  భారతదేశంలో అత్యధికంగా ఇస్లాం మతంలోకి మారారు.

ఇస్లాం మతంలోకి మారిన స్థానిక మత్స్యకారులు  మహిమల్ అని పిలువబడ్డారు. బియ్యం మరియు చేపలు మహిమల్ ప్రజల రెండు ప్రధాన ఆహారాలు. ఇక్కడి ముస్లిం సమాజం రెండుగా విభజించబడింది- మహిమల్ అని పిలువబడే మత్స్యకారుడు (జాలియా) మరియు బంగల్ అనే పిలువబడే రైతు (హలియా).

మత్స్యకారుడు (జాలియా) ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం. muslim ముస్లిం మతమార్పిడి జరిగి మహిమల్ గా పిలువబడిన తరువాత కూడా వీరు వారు తమ పూర్వీకుల వృత్తితో ముడిపడి ఉన్నారు. మహిమల్ (మత్స్యకారులు)ముస్లిములు మత్స్యకార వృత్తి తో పాటు  బోటింగ్‌లోనూ రాణించారు. సిల్హెట్‌లో అద్భుతమైన పడవ నిర్మాణం మరియు బోటింగ్ జరిగేది..

మహిమల్లు సున్నీ ముస్లింలు. మహిమల్లు పెద్ద సంఖ్యలో ఇస్లామిక్ సెమినరీలు, విద్యాసంస్థలు మరియు మదర్సాలను స్థాపించారు. అదేవిధంగా, మహిమల్లు అనేక మదర్సాల స్థాపనకు ఉదారంగా సహకరించారు. సిల్హెట్ నగరంలో ఉన్న ప్రసిద్ధ సిల్హెట్ అలియా మదర్సా, రాయ్‌పూర్ మదర్సాతో సహా అనేక మసీదులను మహిమల్లు నిర్మించారు.

మహిమల్  ముస్లి౦ సమాజం అనేక మంది ఉలేమాలను, ధర్మబద్ధమైన వ్యక్తులను, ముస్లింపండితులు, రాజనీతిజ్ఞులను తయారుచేసింది

ప్రఖ్యాతి గాంచిన సిల్హెట్ అలియాహ్ మదర్సా, నిర్మాణానికి మహిమల్  ముస్లిం సమాజం విశేషంగా సహకరించినది.  నుండి వచ్చింది. సిల్హెత్ అలియాహ్ మదర్సా ఇస్లామిక్ లెర్నింగ్ యొక్క ప్రముఖ సంస్థగా మారింది మరియు అనేక మంది ప్రసిద్ధ ఉలేమాలు మరియు మహ్మద్ తాహిర్., రచయిత మరియు ప్రిన్సిపాల్, అలియా మదర్సా, కోల్‌కతా, అబ్దుల్ జలీల్ చౌదరి, అమీర్-ఎ-షరియత్ మరియు ఎమ్మెల్యే, అస్సాం, తఫజ్జుల్ హుస్సేన్, రచయిత, మొహద్. హెలాల్ ఉద్దీన్, ప్రొఫెసర్, సుహ్రావర్ది కాలేజ్, ఢాకా, వంటి అనేక మంది. పండితులను ఉత్పత్తి చేసింది

సిల్హెట్ కు చెందిన మహిమల్స్  సహకారం తో జాకీగంజ్‌లో లామర్గోవన్ మదర్సా మరియు ఫతేపూర్ టైటిల్ మద్రాసా (సైన్స్ లాబొరేటరీతో) కూడా స్థాపించబడింది. ఆ కాలంలో, మొత్తం బెంగాల్ మరియు అస్సాంలో బాలికల పాఠశాల లేదు. 1936లో, మహిమల్‌ షేక్ సికందర్ అలీ తన దివంగత తల్లి జ్ఞాపకార్థం సిల్హెట్‌లో 'మొయినునెస్సా బాలికల ఉన్నత పాఠశాల'ని స్థాపించారు. మహిమల్స్  ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువ సహకారం అందించేవారు.

అస్సాం లోని  ముస్లిం సమాజం లో మహిమల్ ముస్లిముల పట్ల వివక్షత ఉండేది. దానికి ప్రధాన కారణం మహిమల్స్ మత్యకారులు కావటం.  

సిల్హెట్‌లోని మహిమల్ నాయకులు 1930లలో హిందూ మత్స్యకారులతో సమన్వయంతో 'అస్సాం-బెంగాల్ మత్స్యకారుల సదస్సు Assam-Bengal Fisherman Conference’ ' పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. సదస్సు తన మొదటి సమావేశాన్ని నిర్వహించి, అప్పటి యుపి ప్రభుత్వం 'మోమెన్'ని వెనుకబడిన తరగతిగా చేర్చాలని నిర్ణయించింది కావున  అస్సాంలోని వెనుకబడిన ముస్లింలకు కూడా అదే హక్కు కల్పించాలి. అని తీర్మానించినది.

మహిమల్ మేధావులు మరియు ఉలేమాలు మొదటి నుండి లౌకిక రాజకీయాలను ప్రోత్సహించారు మరియు ముస్లిం లీగ్ యొక్క రెండు-దేశాల సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

సిల్హెట్ లో  ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో, మహిమల్ భారతదేశానికి అనుకూలంగా ఓటు వేశారు. హుస్సేన్ అహ్మద్ మదానీ సిల్హెట్‌లో చాలా ప్రభావం చూపారు. ప్రస్తుతం కరీంగంజ్ అని పిలువబడే సిల్హెట్ యొక్క కొంత భాగం అస్సాం-భారత భూభాగంలో విలీనం చేయబడింది. 

No comments:

Post a Comment