న్యూఢిల్లీ -
ఒడిషా, భౌగోళికంగా భారత దేశంలో ఎనిమిదవ-అతిపెద్ద రాష్ట్రం మరియు జనాభా
ప్రకారం 11వ-అతిపెద్ద రాష్ట్రం. ఓడిషా లో ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పరిపాలనా రంగాలలో/డొమైన్‌లలో
ముస్లింలు అత్యంత అల్ప స్థాయిలో ఉన్నారు,
ముస్లిం జనాభా ఒడిషా
(గతంలో ఒరిస్సా) కటక్, జగత్‌సింగ్‌పూర్ మరియు పూరీ
జిల్లాలలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నది. 2011 సెన్సెస్ ప్రకారం ఒడిషా ముస్లిం జనాభా 9,11,670గా ఉంది.
ఓడిషా రాష్ట్రంలో
ముస్లిములు 2.17 శాతం లేదా 9.12 లక్షలు జనాభాపరంగా ఉన్నారు. ముస్లింలు ఇన్ ఇండియా -
గ్రౌండ్ రియాలిటీస్ వర్సెస్ ఫేక్ నేరేటివ్స్ Muslims
in India – Ground Realities versus Fake Narratives అనే కొత్త పుస్తకం ప్రకారం, స్వాతంత్ర్యం వచ్చిన ఏడున్నర దశాబ్దాలుగా, ఒడిషాలోని ముస్లింలు అనేక సవాళ్ళను ఎదుర్కొ౦టున్నారు..
నేడు, ఒడిషాలో70 శాతం మంది ముస్లింలు జీవనాధార స్థాయికి దిగువన
జీవిస్తున్నారు మరియు వారిలో ఎక్కువ మంది పేద రైతులు మరియు రోజువారీ వేతనాలు పొందేవారు.
వారు సామాజికంగా మరియు రాజకీయంగా అసంఘటితంగా మరియు విభజించబడ్డారు. కొద్దిమంది ముస్లింలు మాత్రమే వాణిజ్యంలో ఉన్నారు మరియు
వారి వెనుకబాటుకు ప్రధాన కారణం వారి స్వంతంగా వ్యాపార౦ చేపట్టే జ్ఞానం మరియు
నైపుణ్యాలు లేకపోవడమే.
శాసన సభలో – ప్రాతినిద్యం:
·
ఒడిశా చరిత్రలో 26 మంది గవర్నర్లలో ఏడుగురు ముస్లింలు ఉన్నారు.
·
శాసనసభ స్పీకర్‌లు మరియు డిప్యూటీ స్పీకర్‌లు ముస్లింలు వరుసగా 24 మరియు 20 మంది ఉన్నారు.
·
1952లో ఒడిశా డిప్యూటీ స్పీకర్ మౌల్వీ
మహమ్మద్ హనీఫ్ ఒక్కరే ఉన్నారు.
·
ఒడిశాలో ఉన్న 170 మంది లోక్‌సభ ఎంపీల్లో ఇప్పటి వరకు ముస్లింలు లేరు, రాజ్‌సభ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే ముస్లిం - కాంగ్రెస్‌కు
చెందిన మహమ్మద్ హనీఫ్,
· 1966 నుండి 1972 వరకు. 2,464 మంది ఎమ్మెల్యేలలో ఒక మహిళ సోఫియా ఫిర్దౌస్ తో సహా 23 మంది ముస్లింలు ఉన్నారు.
న్యాయశాఖ లో
ప్రాతినిద్యం:
·
1947 మరియు 2022 మధ్య, ఒడిశాలో మొత్తం 31 మంది ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు, వీరిలో ముగ్గురు ముస్లింలు
·
82 మంది హైకోర్టు న్యాయమూర్తులలో
ముస్లింలులేరు.
·
ఒడిశా చరిత్రలో ఏ ఒక్క ముస్లిం కూడా ప్రాసిక్యూషన్ చీఫ్ లేదా
అడ్వకేట్ జనరల్ కాలేదు.
·
58 అదనపు AGలు, ప్రభుత్వ ప్లీడర్లు మరియు స్టాండింగ్ కౌన్సెల్‌లలో ఒకరు మాత్రమే
ముస్లిం.
·
65 మంది జిల్లా ప్రాసిక్యూటింగ్
అధికారుల (డిపిఓలు)లో ముస్లింలు ఎవరూ లేరు. ఒరిస్సా రాష్ట్ర చరిత్రలో ఏ ముస్లిం కూడా
లోక్ అయుక్త పదవిని చేపట్టలేదు.
·
లోక్ అయుక్తలోని 49 మంది సీనియర్ సిబ్బందిలో ఎవరూ ముస్లిం కాదు.
·
స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఒక ముస్లిం సహా మొత్తం 16 మంది సీనియర్ అధికారులు ఉన్నారు. స్టేట్ లీగల్
సర్వీసెస్ అథారిటీ ప్యానెల్‌లోని 2,809 మంది న్యాయవాదులలో ఇరవై నాలుగు మంది ముస్లింలు.
· 549 జిల్లా మరియు సెషన్ జడ్జిలలో ఐదుగురు ముస్లింలు, చివరిది 2020లో.
ఒరిస్సా పరిపాలన:
·
42 మంది ఒరిస్సా ప్రధాన
కార్యదర్శులలో ఒక ముస్లిం మాత్రమే - SMH బర్నీ 1979లో ఒక సంవత్సరం పాటు ఉన్నారు.
·
31 మంది ఎస్పీల మాదిరిగానే
ప్రస్తుతం 31 మంది కలెక్టర్లలో ఎవరూ ముస్లింలు
లేరు.
·
ఒడిశాలో మొత్తం చరిత్రలో 624 మందిలో 11 మంది ముస్లింలు జిల్లా కలెక్టర్లుగా ఉన్నారు.
·
IAS మరియు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్
సర్వీస్ డొమైన్‌లలో ముస్లింలు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు; 185 మంది ఐఏఎస్ అధికారుల్లో ఇద్దరు ముస్లింలు.
·
స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో 698 మంది అధికారులు ఉన్నారు వారిలో ఐదుగురు ముస్లిములు.
పోలిస్
సర్వీసెస్:
ప్రభుత్వ శాఖల్లోనూ ముస్లిం అధికారుల సంఖ్య తక్కువ. పోలీసు బలగాలలో ముస్లింల ఉనికి చాలా తక్కువ.
·
ప్రస్తుతం ఉన్న 55 మంది ఎస్పీలు, ఏఎస్పీల్లో ముస్లింలు లేరు.
·
101 మంది SDPOలు మరియు DSPల విషయంలో కూడా ముస్లింలు లేరు.
·
937 మంది ఇన్‌స్పెక్టర్లు మరియు లా
అండ్ ఆర్డర్ మరియు క్రైమ్స్ ఎస్‌ఐలలో ముగ్గురు మాత్రమే ముస్లింలు.
·
120 మంది ఐపీఎస్ అధికారుల్లో ఒక్కరు
మాత్రమే ముస్లిం.
·
43 లా అండ్ ఆర్డర్ (L&O) పోలీస్ స్టేషన్‌లతో 2007లో ఏర్పాటైన రాష్ట్రంలోని ఏకైక పోలీస్ కమిషనరేట్‌లో
ఏడుగురు పోలీసు కమీషనర్‌లు ఉన్నారు, వీరిలో ఎవరూ ముస్లింలు కాదు.
·
ఒరిస్సా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న 451 మంది ఎస్పీలలో 12 మంది మాత్రమే ముస్లింలు.
·
ఒరిస్సా రాష్ట్ర పోలీసు సర్వీస్‌లో ప్రస్తుతం మొత్తం 493 మంది అధికారులలో ఏ ఒక్క ముస్లింలేరు.
· 95 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల్లో ఒక ముస్లిం కూడా ఉన్నాడు
ఇతర శాఖలు:
·
ఒడిశా టూరిజంలోని 13 మంది మేనేజ్‌మెంట్ టీమ్ సభ్యులలో ఒక్క ముస్లిం కూడా లేరు.
·
డ్రగ్ కంట్రోల్ మరియు ఇన్‌స్పెక్షన్ టీమ్‌లో 40 మంది సభ్యులతో ముస్లిం అధికారులు లేరు.
·
ఒడిశా రెవెన్యూ శాఖలో కల 101 మంది అధికారుల్లో ముస్లింలు లేరు.
·
వాణిజ్య పన్నుల శాఖ నిర్వహణ బృందంలో 498 మంది సభ్యులుండగా ఒక్కరు మాత్రమే ముస్లిం.
·
37 మంది అధికారులతో కూడిన అవినీతి
నిరోధక శాఖ (ఏసీబీ)లో ముస్లింల ఉనికి శూన్యం.
·
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD)లో మొత్తం 378 మందిలో ముగ్గురు ముస్లిం అధికారులు ఉన్నారు.
·
అటవీ శాఖలో ఐదుగురు ముస్లింలతో సహా 822 మంది అధికారులు ఉన్నారు.
·
732 మంది అధికారులు ఉన్న ఎక్సైజ్/ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్
మరియు ఇన్‌స్పెక్షన్ టీమ్‌లలో ముస్లింలు లేరు.
· 45 మంది రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ) అధికారుల్లో ఏ ముస్లిం కూడా లేడు.
ఒరిస్సా రాష్ట్ర
మహిళా కమిషన్:
·
1993లో ఏర్పాటైన ఒరిస్సా రాష్ట్ర
మహిళా కమిషన్‌కు ఏ ముస్లిం మహిళ నేతృత్వం వహించలేదు.
· ఒరిస్సా రాష్ట్ర మహిళా కమిషన్ 47 మంది సభ్యులలో ఇద్దరు ముస్లింలు.
ఒడిశా ఉర్దూ
అకాడమీ:
· ఒడిశా ఉర్దూ అకాడమీ 1987లో స్థాపించబడినప్పటి నుండి మొత్తం ఎనిమిది మంది అధ్యక్షులు మరియు 10 మంది సెక్రటరీలు/రిజిస్ట్రార్‌లలో తొమ్మిది మంది ముస్లింలు.
ఒడిశా వక్ఫ్ బోర్డ్:
·
ఒడిశా వక్ఫ్ బోర్డ్ యొక్క మొత్తం 14 మంది అధ్యక్షులు మరియు కార్యదర్శులు/CEOలు ముస్లింలు.
· ఫిబ్రవరి 2022 నాటికి, ఒడిశాలో 8,510 స్థిరమైన వక్ఫ్ ఆస్తులు WAMSI రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌లో నమోదు చేయబడ్డాయి.
ఒరిస్సా రాష్ట్ర
పబ్లిక్ సర్వీస్ కమీషన్:
·
ఒరిస్సా
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్‌గా ఇంతవరకు ముస్లిం కాలేదు.
· మొత్తం 58 మంది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సబ్యులలో ఒకరు మాత్రమే ముస్లిం(1993లో మహమ్మద్ ఫిదా రసూల్).
వైద్యులు:
·
ఒరిస్సా రాష్ట్రంలో మొత్తం 24,337 MBBS వైద్యులలో 415 మంది ముస్లింలు.ఇది దేశంలోనే
అత్యల్పంగా ఉంది.
·
4765 మంది ఆయుర్వేద వైద్యుల్లో పదిహేను
మంది ముస్లింలు
·
మొత్తం 13 మంది యునాని అభ్యాసకులు ముస్లింలు.
·
మొత్తం 2980 మంది హోమియోపతి వైద్యులలో నలభై నాలుగు
మంది ముస్లింలు.
· 2004 డెంటల్ డాక్టర్లలో నలభై మంది ముస్లింలు.
వైస్ ఛాన్సలర్స్:
·
ఒడిశాలోని
ఏకైక సెంట్రల్ యూనివర్శిటీకి ఇప్పటి వరకు ఏ ముస్లిం కూడా వైస్ ఛాన్సలర్‌గా పని
చేయలేదు.
·
పంతొమ్మిది
రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు మొత్తం 209
వైస్-ఛాన్సలర్‌లు కలరు అందులో ముగ్గురు
మాత్రమే ముస్లింలు.
నగర మేయర్‌లు:
·
ఐదు నగరాలు - బెర్హంపూర్, భువనేశ్వర్,
కటక్, రూర్కెలా మరియు సంబల్పూర్ - మొత్తం 26 మంది మేయర్‌లను కలిగి ఉన్నారు, అందులో 12 మంది ముస్లింలు,
మూలం: క్లారియన్ ఇండియా, తేదీ:నవంబర్ 30, 2024