ఉత్తరప్రదేశ్ లోని లక్నోకి మొదటిసారి పెరియార్ వచ్చినప్పుడు, 12-13 అక్టోబర్ 1968న, బరాదరి, లక్నో ఉత్తర ప్రదేశ్ లో "ది ఫెడరేషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్
క్లాసెస్, షెడ్యూల్డ్ కులాలు మరియు ఇతర మైనారిటీలు"అద్వర్యం లో జరిగిన
రెండురోజుల “ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు మరియు ఇతర మైనారిటీల సదస్సు లో జరిగిన "భారతీయ అల్పసంఖ్యాకుల/ మైనారిటీల సమస్యలు" అనే కార్యక్రమానికి పెరియార్ ఇ వి రామసామి అధ్యక్షత
వహించారు. సదస్సు లో ముఖ్య వక్తలుగా : భంతే భదత్ ఆనంద్ కౌసల్యాయన్ బి. శ్యామ్
సుందర్ (ఆంధ్రప్రదేశ్) ఛేదిలాల్ సాథీ, కర్పూరి ఠాకూర్, BN మండల్ మరియు హిందీ ప్రాంతానికి చెందిన ముఖ్యమైన బహుజన నాయకులు
పాల్గొన్నారు. సదస్సు నిర్వాహకులుగా డా.ఎ.జె.ఫరిది, బి.శ్యామ్ సుందర్ వ్యవరించారు.
60వ దశకం నాటి యు.పి. బడుగు బలహీన వర్గాలు మరియు సోషలిస్టుల చరిత్ర పేజీలను తిరగేస్తే, డా.ఎ.జె.ఫరీది పేరు ప్రస్పుటంగా కన్పిస్తుంది. డాక్టర్ అబ్దుల్ జలీల్ ఫరిది
1913 డిసెంబర్ లో లక్నో లోని ఒక సంపన్న కుటుంబం లో జన్మించారు. డాక్టర్ అబ్దుల్
జలీల్ ఫరీది విజయవంతమైన వైద్య నిపుణుడు మరియు దేశంలోని ఆనాటి ప్రముఖ TB నిపుణులలో ఒకరు.
పీఎస్పీ నుంచి ఎమ్మెల్సీగా, విపక్ష నేతగా, శాసన మండలి నాయకుడిగా మరియు అప్పటి UP ఐరన్ మ్యాన్ సీఎం సీబీ గుప్తా ను రెండు సార్లు ఎన్నికల్లో పరాజయం పొందేటట్లు
చేసిన ఘనత డాక్టర్ ఎ.జె ఫరీదీ కి దక్కింది. డాక్టర్ ఎ.జె ఫరీదీ SC ST OBC మరియు ముస్లింలలో అత్యంత బలహీన విభాగాలను ఏకం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా
సామాజిక న్యాయ సాధనకు కృషి చేసారు.
సామాజిక న్యాయం కోసం దృఢమైన ఉద్దేశాలు కలిగి ఉండి, సోషలిస్టులు తమ వాగ్దానాలను నిజాయితిగా నెరవేర్చనందుకు నిరసనగా డా.ఎ.జె.ఫరీది PSP నుండి వైదొలిగి, 85% వర్సెస్ 15 అనే నినాదం ఆధారంగా, సామాజిక న్యాయం-కేంద్రీకృత రాజకీయ పార్టీ "ముస్లిం మజ్లిస్"ను స్థాపించారు. అది యు.పి. లోని కొన్ని జిల్లాలలో ప్రధానంగా కేంద్రీకృతం అయినది. “ముస్లిం మజ్లిస్” కాంగ్రెస్ నుండి ముస్లింలను దూరం చేసి వారిని సోషలిస్టులతో అనుసంధానించడానికి కృషి చేసింది. ఆ తర్వాత యు.పి.లో కాంగ్రెసేతర ప్రభుత్వాల శకం మొదలైంది!
డాక్టర్ ఫరీదీ ఏర్పాటు చేసిన “ముస్లిం మజ్లిస్” రాజకీయ కార్యక్రమం, 85% బహుజనులలో అనగా దోపిడీకి గురవుతున్న వెనుకబడిన, ముస్లింలు మరియు షెడ్యూల్డ్ కులాల్లో తమను దోపిడీ చేసే వారిపై ప్రతిగా రాజకీయ చైతన్యం పెంపొందించే దిశగా ఉండేటట్లు నిర్ణయించారు. కాంగ్రెస్ లోని అణగారిన బాధితులను సంఘటితం చేయడం, ముస్లింల జీవితం, ఆత్మగౌరవం, సంస్కృతి, భాష, మత విశ్వాసాల రక్షణ కోసం పోరాటం చేయడం, ముస్లింల రాజకీయ, సామాజిక, విద్యా, ఆర్థిక, వెనుకబాటుతనాన్ని తొలగించడం, మరియు అన్యాయం, అసమానత, ఇమ్తియాజ్, అవగాహన ఆధారంగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, బడుగు, బలహీన వర్గాలపై సంపన్న వర్గాల వారు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పడం, బడుగు, బలహీన వర్గాల వారిపైనే కేంద్రీకృతమైన రాజకీయాలు చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాలందరూ ఆత్మసమానంగా జీవించేలా నిర్మించడం మొదలగు 8 పాయింట్ల ఆధారంగా రాజకీయ పోరాటం చేయడం మొదట యు.పి. లోనే ప్రారంభం అయినది. 15% సవర్ణ హిందువులచే 85% అణగారిన బలహీన వర్గాలకు అన్యాయం మరియు దోపిడీ జరుతుతుందని డాక్టర్ ఫరీదీ 85-15 నినాదాన్ని ఇచ్చారు.
ఈ ఆలోచన దేశంలోని ప్రముఖ సామాజిక వేత్తల దృష్టిని ఆకర్షించింది మరియు బహుజన ఉద్యమానికి పునాది ఉత్తరప్రదేశ్‌లో పడటం ప్రారంభమైంది మరియు డా. శ్యామ్ సుందర్, చెదిలాల్ సాథీతో కలిసి డాక్టర్ ఫరీదీ అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు మరియు ఇతర మైనారిటీల సదస్సును 12-13 అక్టోబర్ 1968న లక్నోలోని బర్దారీలో "భారతీయ ముస్లింల సమస్యలు" అనే శీర్షికపై నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించడానికి దక్షిణాది ద్రావిడ విప్లవ నాయకుడు పెరియార్ EV రామసామి తన మోటారు కారులో బరాదరి, లక్నోకు రెండు రోజుల ప్రయాణo చేసారు..
కుల వ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా పెరియార్ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భంతే భదత్ ఆనంద్ కౌసల్యాయన్ బి. శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. డాక్టర్ ఫరీది, పెరియార్ రెండు రోజుల కార్యక్రమంలో తీర్మానం చేస్తూ “అక్లియతోo కా నారా హిందుస్థాన్ హమారా अकलियतो का नारा हिंदुस्तान हमारा" అనే నినాదాన్ని ఇచ్చారు. "ది ఫెడరేషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ కులాలు మరియు ఇతర మైనారిటీలు" ఏర్పాటు చేయబడినది మరియు బహుజన ఉద్యమ భవిష్యత్తు కోసం 11 పాయింట్ల కార్యక్రమం నిర్ణయించబడింది.
విద్యా వ్యవస్థలో మార్పు, ఎన్నికల సంస్కరణ, సంక్షేమ రాజ్య ఏర్పాటు, ముస్లిం వ్యక్తిగత చట్టాల రక్షణ, మాతృభాష రక్షణ, వెనుకబడిన, దళిత, మైనారిటీ సమాజాల అభ్యున్నతికి మంత్రిత్వ శాఖ ఏర్పాటు, మత విశ్వాసంతో సామాజిక మార్పు, పారా మిలటరీ బలగాల పునర్వ్యవస్థీకరణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలను విభజించాలి, మైనారిటీసంస్థలను కార్పొరేట్ సంస్థలుగా పరిగణించాలి మరియు కేసులను ఎదుర్కోవటానికి వారికి స్వయంప్రతిపత్తి ఇవ్వాలి, పారామిలటరీ బలగాల పునర్నిర్మాణం మరియు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్ర మరియు బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలను రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. మైనారిటీలను కార్పొరేట్ సంస్థలుగా పరిగణించాలని, వారి వ్యవహారాలను నిర్వహించడానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేసారు.
అద్భుతమైన ఉమ్మడి హిందుస్థానీ సంస్కృతికి పేరుగాంచిన లక్నోలో జరిగిన ఈ సదస్సు వేదికపై నుండి “అక్లియతోo కా నారా హిందుస్థాన్ హమారా” నినాదం ఒకే స్వరంలో ప్రకటించబడింది.
పెరియార్ మాట్లాడుతూ దోపిడీకి గురవుతున్న మైనారిటీలు మేల్కొని ఐక్యం కావాలని నేను పిలుపునిస్తున్నాను; అలా చేయకుంటే సమాజం లో సామూహికంగా,వ్యక్తిగతం గా ఒక్కొక్కరుగా వారందరూ నాశనం చేయబడతారని హెచ్చరిస్తున్నాను. షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడినవారు, ముస్లింలు ఏకమై మెజారిటీగా మారాలని, ఈ మాతృభూమి భవిష్యత్తును నిర్దేశించడంలో సమర్థవంతమైన పాత్ర పోషించడం వారి సహజ హక్కు అని తెలియజేస్తూ నా తరపున ఇలాంటి మరిన్ని సమావేశాలు జరగాలని కోరుకుంటున్నాను. మాతృభూమి పట్ల ప్రగాఢ విశ్వాసం మరియు అంకితభావంతో నేను “అక్లియతోo కా నారా హిందుస్థాన్ హమారా'”అని ముగిస్తాను అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ మాజీ ఎంపీ, మాన్యవర్ కాశీరాం సన్నిహితుల్లో ఒకరైన ఇలియాస్ అజ్మీ మాట్లాడుతూ “ తాను అప్పట్లో పనిచేసే పంజాబ్ ఫ్యాక్టరీలోని తన సహచరులు కొందరు ఇందులో పాల్గొనేందుకు వచ్చారని” కాన్షీరామ్ తెలిపారు అన్నారు. వారి ద్వారా కాన్ఫరెన్స్ యొక్క సారాంశం మరియు భవిష్యత్తు కోసం ఫరీదీ-పెరియార్ యొక్క 8-అంశాల కార్యక్రమం యొక్క రూపురేఖలు కాన్షిరాంకి చేరువయ్యాయి, వాస్తవానికి లక్నోలో జరిగిన ఈ రెండు రోజుల కార్యక్రమం శ్రీ కాన్షీరామ్ ప్రారంభించిన బహుజన ఉద్యమానికి నాంది పలికింది.
1974లో మరణించే వరకు, ఫరీది తన లక్ష్యాలను సాధించడానికి వివిధ పొత్తులను ప్రయత్నించాడు. 1974 యుపి అసెంబ్లీ ఎన్నికల్లో లో ముస్లిం మజ్లిస్ భారతీయ క్రాంతి దళ్‌తో పొత్తు పెట్టుకుని దాని చిహ్నం తో దాదాపు డజను శాసనసభ స్థానాలను గెలుచుకోవడం జరిగింది.1977 ఇద్దరు ముస్లిం ముజ్లిస్ అబ్యర్ధులు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో జనత పార్టీ చిహ్నం పై ఎన్నికైనారు. ముస్లిం మజ్లిస్ దాని గణనీయమైన ఓటుబ్యాంకుతో అది ప్రభుత్వ విధానాలను మరియు పార్టీల మెనిఫెస్టోలను ప్రభావితం చేసింది.
1974 మే లో ఫరీదీ మరణించిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత కాన్షీరామ్ BSP కోసం సమీకరణ ప్రారంభించినప్పుడు, అతను భారతదేశంలోని వెనుకబడిన మరియు అణగారిన వర్గాల కోసం విముక్తి రాజకీయాల మార్గదర్శకులలో భీమ్ రావ్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే మరియు సాహూజీ మహారాజ్‌లతో పాటు ఫరీదీని కీర్తించాడు.
మూలం: ఈ వ్యాసం అమిక్ జమీ యొక్క రాబోయే పుస్తకం "డాక్టర్ AJ ఫరిదీ యొక్క వ్యక్తిత్వం మరియు శాసన మండలిలో అతని ఎంపిక ప్రసంగాలు" నుండి సంగ్రహించబడింది
No comments:
Post a Comment