9 September 2022

అజ్మీర్: ఆధ్యాత్మికంలోకి ప్రయాణం Ajmer: Travelling into Spirituality

 

 

అజ్మీర్ ఉత్తర భారత దేశం లో చుట్టూ పచ్చని కొండలతో కప్పబడిన నగరం. ప్రపంచవ్యాప్తంగా విభిన్న మతాలకు చెందిన ప్రజలకు ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.

అజ్మీర్ ముఖ్యంగా సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి యొక్క దర్గా కి ప్రసిద్ధి చెందింది. అజ్మీర్ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మికంగా  మిమ్మల్ని మీ అంతరంగానికి కనెక్ట్ చేస్తుంది. అజ్మీర్ లోకి మీరు అడుగుపెట్టిన తర్వాత, స్థిరమైన ఉపశమనం మరియు దైవత్వం అనుభూతి కలుగుతుంది. ఈ పవిత్ర స్థలం యొక్క జియారత్ (తీర్థయాత్ర) కోసం అసంఖ్యాకమైన ప్రజలు ఇక్కడికి వస్తారు.  ప్రజలకు ఇక్కడ కోరుకున్న వారి కోరికలు తీరుతాయి అనే నమ్మకం ఉంది. దీనికి స్పష్టమైన రుజువులు ఉన్నాయి.

అజ్మీర్ దర్గా షరీఫ్‌ను మొఘలులు నిర్మించారు.  ఇది అద్భుతమైన మొఘల్ వాస్తుశిల్పాన్ని కలిగి ఉంటుంది. హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో వివిధ భవనాలు, సమాధులు, ప్రాంగణాలు మరియు దాలాన్‌లు ఉన్నాయి. బులంద్ దర్వాజా, నిజాం గేట్, డెగ్స్, బేగామి దాలాన్, దర్గా పుణ్యక్షేత్రం, మెహఫిల్ ఖానా, ఔలియా మసీదు, జామా మసీదు, లంగర్ ఖానా, విక్టోరియా హౌజ్,  అహ్తా-ఎ-నూర్ కాంతి ప్రాంగణం వంటి నిర్మాణాలు కలవు..

దర్గా వద్ద ఖవ్వాలి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలు అక్కడ కూర్చుని, విశ్రాంతి తీసుకుంటారు, శాంతిని కోరుకుంటారు మరియు ఆధ్యాత్మిక బంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు.

ప్రజలు సాధారణంగా గులాబీలు, పువ్వులు మరియు సాంప్రదాయ చాదర్‌లను (అలంకరణ షీట్‌లు) కొంటారు. వీటిని పవిత్ర సమాధి పైన  కప్పుతారు మరియు వారు చేయవలసిన దువాలతో దారం/థ్రెడ్‌ను కడతారు. అజ్మీర్ దర్గా దగ్గర రంగు, కులం, మతం, లింగం మరియు సామాజిక ప్రమాణాలతో సంబంధం లేకుండా సమానత్వం మరియు నిష్పాక్షికమైన వాతావరణాన్ని చూడటం అత్యంత అద్భుతమైన దృశ్యం.

 

అజ్మీర్ లో ప్రసిద్ధి చెందిన మరొక ప్రదేశం తారాఘర్ కోట, ఇది దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్న కొండ శిఖరం వద్ద ఉంది. కోట ఇప్పుడు లేదు కానీ ఇది మీరాన్ సయ్యద్ హుస్సేన్ ఖిగ్‌సవార్ యొక్క దర్గాను కలిగి ఉంది మరియు ఇది అజ్మీర్‌లో రెండవ అత్యంత పవిత్రమైన దర్గా. తీర్థయాత్రకు వీలుగా రహదారిని బాగా అభివృద్ధి చేశారు.

 



తారాగఢ్ కోట

ఖవాజా మొయినుద్దీన్ చిస్తీ మాటలలో వ్యాసం ముగిస్తాను:

అవ్వల్ సఖావత్-ఎ-చున్ సఖావత్-ఎ-దరియా, దోమ్ షఫ్కత్-ఎ-చున్ షఫ్కత్-ఎ-అఫ్తాబ్, శివమ్ తవాజో-ఇ-చున్ తవాజో-ఎ-జమీన్

(మొదటది, నది వంటి దాతృత్వం; రెండవది, సూర్యుని  ఆప్యాయత మరియు మూడవది, భూమి వంటి ఆతిథ్యం.)

No comments:

Post a Comment