8 September 2022

బీహార్ లోని ముజఫర్‌పూర్‌లో యూరోపియన్ క్లబ్‌కు పోటిగా ముస్లిం క్లబ్ ప్రారంభించిన జాతీయవాది ఖాన్ బహదూర్ మౌల్వీ సయ్యద్ అహ్మద్ హుస్సేన్

 

1885లో భారత దేశంలోని యూరోపియన్లు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో యూరోపియన్ క్లబ్‌ను స్థాపించారు. అందులో భారతీయులకు ప్రవేశం లేదు.  దీనికి ప్రతిగా 1912లో, బీహార్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత 1912 అక్టోబర్‌లో ఖాన్ బహదూర్ మౌల్వీ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ ముజఫర్‌పూర్ లో ముస్లిం క్లబ్  స్థాపించారు. మౌల్వీ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ వృత్తిరీత్యా న్యాయవాది.

మౌల్వీ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ తన రెండంతస్తుల ఇల్లు, ఫర్నీచర్, వేల రూపాయల విలువైన పుస్తకాలను విరాళంగా ఇవ్వడమే కాకుండా, ఈ క్లబ్ కోసం ప్రతి నెలా 51 రూపాయలు ఖర్చు చేశాడు. మౌల్వీ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ ఈ క్లబ్‌కు కార్యదర్శిగా ఉన్నాడు. ఈ క్లబ్‌లోని సభ్యులందరూ ముజఫర్‌పూర్‌లోని ముస్లిం న్యాయవాదులు, అధికారులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే ఇక్కడ మతపరంగా ఎలాంటి పరిమితి లేదు. అందుకే ముజఫర్‌పూర్‌లోని హిందూ ఉద్యోగులు కూడా ఇక్కడికి వచ్చి తమ విరామ సమయాన్ని గడిపేవారు. ఉర్దూ, ఇంగ్లీష్ వార్తాపత్రికలు మరియు జర్నల్స్ క్రమం తప్పకుండా వచ్చేయి మరియు  ప్రజలు కూడా క్లబ్‌కు పుస్తకాలు, వార్తాపత్రికలు, పత్రికలు మొదలైన వాటిని విరాళంగా ఇచ్చేవారు. ఇక్కడ వివిధ సామాజిక కార్యక్రమాలు, మరియు సమావేశాలు నిర్వహించేవారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో కూడా ఇక్కడ అనేక సమావేశాలు జరిగాయి. ఉర్దూను బీహార్ అధికార భాషగా మార్చేందుకు ఇక్కడ అనేక కార్యక్రమాలు జరిగాయి.

ఖాన్ బహదూర్ మౌల్వీ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ గతంలో ముంగేర్ జిల్లాలో భాగమైన భికాన్‌పూర్ నివాసి. ముజఫర్‌పూర్‌లో ఉంటూ న్యాయవాద వృత్తిని చేపట్టారు. సయ్యద్ అహ్మద్ హుస్సేన్ ప్రముఖ న్యాయవాది మరియు ఆనాటి  ముస్లిం న్యాయవాదులలో అత్యంత సీనియర్‌. మౌల్వీ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ రాజకీయాల్లోనూ పాల్గొన్నారు.

సయ్యద్ అహ్మద్ హుస్సేన్ ముజఫర్‌పూర్‌లో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసారు మరియు కొంతకాలం ముజఫర్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నాడు. సయ్యద్ అహ్మద్ హుస్సేన్ జిల్లా బోర్డు సభ్యులు కూడా.

సయ్యద్ అహ్మద్ హుస్సేన్ కృషిని చూసి అప్పటి ప్రభుత్వం 1916లో ఖాన్ బహదూర్ బిరుదు ఇచ్చింది. 1921లో, తిర్హట్ డివిజన్ మహమ్మదీయ స్థానం నుండి బీహార్ ఒరిస్సా కౌన్సిల్ సభ్యునిగా కూడా ఎన్నికైనాడు మరియు  వీరు ఇంతకు ముందు కూడా కౌన్సిల్ సభ్యుడు కాని అది   జిల్లా బోర్డు సభ్యుడిగా.

 


జోగిరా ఎస్టేట్‌కు చెందిన నవాబ్ సయ్యద్ తాకి నిర్మించిన ముజఫర్‌పూర్ జిల్లా పాఠశాల, అభ్యున్నతిలో మౌల్వీ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ పెద్ద పాత్ర పోషించారు.

సయ్యద్ అహ్మద్ హుస్సేన్ 1917-24 వరకు బీహార్ ఒరిస్సా కౌన్సిల్ సభ్యునిగా కౌన్సిల్ పనిలో చురుకుగా పాల్గొన్నాడు. ఆరోగ్యం, విద్య వంటి సమస్యలపై అనేక ప్రశ్నలు తలెత్తారు  మరియు మౌల్వీ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ కృషి వల్ల బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు మరియు డిస్పెన్సరీలు ప్రారంభించబడ్డాయి. సభలో, ఉర్దూ, పర్షియన్ మరియు అరబిక్ భాషలను కలపడం ద్వారా బీహార్‌లో ప్రత్యేక పరీక్షా బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేయబడింది, దీనికి సభలోని హిందూ సభ్యులు  కూడా మద్దతు ఇచ్చారు. బీహార్‌లో సంస్కృత కళాశాలను తెరవడానికి కూడా సయ్యద్ అహ్మద్ హుస్సేన్ చొరవ తీసుకున్నారు. అసెంబ్లీ సభ్యుడిగా ఉండగానే సయ్యద్ అహ్మద్ హుస్సేన్ మరణించారు.

 

No comments:

Post a Comment