ప్రముఖ భారతీయ హిందూ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్ 1925లో ‘ఇస్లామిక్ నాగరికత’ అనే చిన్న వ్యాసం ఉర్దూ మరియు హిందీ రెండూ భాషలలో రాసారు. మున్షీ ప్రేమ్‌చంద్ రచనలో ఇస్లాం పట్ల ప్రేమ మరియు గౌరవం మనం చూడవచ్చు. ఈ చిన్న వ్యాసం యొక్క ఇతివృత్తం ‘ఇస్లాంలో సమానత్వం’. దీనిని ప్రేమ్‌చంద్ మూడు సంబంధిత ఉదాహరణలతో వివరించడానికి ప్రయత్నించాడు.
ప్రేమ్‌చంద్ మొదట అరాఫత్ వద్ద ప్రవక్త(స) యొక్క చివరి ఉపన్యాసంలో సమానత్వం గురించి ప్రస్తావించాడు. పిదప 'ముస్లిం పాలకులుగా మారిన బానిసలు' (భారతదేశ బానిస రాజవంశం) గురించి వ్రాసాడు మరియు ఇస్లాం మరియు బోల్షివిక్ కమ్యూనిస్ట్ విప్లవాన్ని సరి పోల్చాడు. (బోల్షివిక్ విప్లవం ప్రేమ్‌చంద్ కాలంలో చాలా ఆకర్షణీయమైన రాజకీయ ఉద్యమం). చివరికి ప్రేమ్‌చంద్ 'వడ్డీ' గురించి ప్రస్తావించాడు. వడ్డీ చరిత్రలో అనేక చెడులకు కారణం మరియు ఇస్లాంలో నిషేధించబడింది.
మున్షీ ప్రేమ్‌చంద్ రాసిన ఈ అరుదైన రచనను చదవమని మరియు పంచుకోవాలని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాను. భారతదేశంలో శతాబ్దాలుగా హిందూ-ముస్లిం వర్గాలు శాంతి మరియు సౌహార్ద సహజీవనాన్ని గడుపుతున్నారు.
ఈ వ్యాసం మొదట హిందీ ‘ప్రతాప్’ పత్రికలో (1925)
ప్రచురించబడింది. 1995లో, ఈ వ్యాసాన్ని తన ప్రత్యేక సాహిత్య సంచికలో “ఇండియా టుడే హిందీ ఎడిషన్”, పునర్ముద్రించింది. తర్వాత 90వ దశకం చివరిలో 'రేడియన్స్' ప్రచురించింది.
"ఇస్లామిక్ నాగరికత"-ప్రేమ్‌చంద్
“Islamic Civilization” By Premchand
భారతదేశంలో హిందువులు మరియు ముస్లింలు వెయ్యి సంవత్సరాలు సహజీవనం చేసినప్పటికీ, వారు ఒకరినొకరు సరిగ్గాఅర్థం చేసుకోలేదు. వారు ఒకవిధమైన భావన an enigma తో ఒకరినొకరు పోరాడుతారు. హిందువులు- ముస్లింలు ఇద్దరు దయ, విశ్వాసం, సహనం మరియు సద్గుణం మొదలగు మంచి లక్షణాలను కలిగి ఉన్నారు అదేవిదంగా ఇద్దరు కొంత అసహనం కలిగి ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు ఆకారణంగా ద్వేషించు కొoటారు.
అరాఫత్ పర్వతంపై ప్రవక్త(స) యొక్క ఉపన్యాసం ఇస్లామిక్ జీవితాన్ని ఎల్లప్పుడూ ఉత్తేజపరిచే సందేశం. ఈ ఉపన్యాసం న్యాయం పట్ల లోతైన భావనను వివరిస్తుంది. రాజు అయినా, పౌరుడైనా, ధనవంతులైనా, పేదవారైనా అందరికీ న్యాయం సమానంగా వర్తిస్తుంది. ముస్లిం పాలకులు సహనం మరియు విశాల దృక్పథాన్ని ప్రదర్శించిన సందర్భాలు చరిత్రలో అపూర్వమైనవి. ముస్లిం పాలకులు కేవలం ప్రతిభ/మెరిట్ ఆధారంగా ముస్లిమేతరులను ఉన్నత పదవులలో నియమిoచారు.
కార్ల్ మార్క్స్ మరియు రష్యన్‌లు సమానత్వ సూత్రానికి ఘనత వహించారు. కాని చరిత్రలో సమానత్వoను మొదటగా బోధించి ఆచరించినది మహమ్మద్ ప్రవక్త(స). ఎప్పుడూ ప్రవక్త(స)ప్రత్యేక హోదా కోరలేదు.
ప్రవక్త(స) సంపూర్ణ మానవ సమానత్వాన్ని ప్రకటించాడు మరియు ఆచరించాడు. బానిసల పట్ల ఇస్లాం న్యాయంగా ప్రవర్తిస్తుంది. ఒక బానిస ఇస్లాం స్వీకరించిన వెంటనే, అతను స్వేచ్ఛా వ్యక్తి అయ్యాడు మరియు ముస్లిం చరిత్రలో చాలా మంది బానిస పాలకులు ఉన్నారు.
మానవ చరిత్రలో ఇస్లాం మొదటిసారి స్త్రీలకు ఆస్తిపై హక్కును మంజూరు చేసింది.
సమాన అవకాశాలను ఇస్లాం దృఢంగా
విశ్వసిస్తుంది. ఇస్లాం సౌభ్రాతృత్వ సూత్రానికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది.
వడ్డీని నిషేధించిన ఏకైక విశ్వాసం ఇస్లాం. వడ్డీవ్యాపారం సమాజంలో అనేక దురాచారాలకు, సమస్యలకు దారితీసిందని చెప్పకతప్పదు.
జ్ఞానాన్ని అందించే విషయం లో కొద్దిమంది మాత్రమే ముస్లింలతో పోటీ పడగలరు. ఇస్లాం ప్రకారం జ్ఞానార్జన ప్రతి ముస్లిం విధి. ముస్లింలు స్వేచ్ఛ యొక్క ఆదర్శాల నుండి ప్రేరణ పొందారు. సమానత్వం మరియు సౌభ్రాతృత్వం యొక్క బోధనల కారణంగా ఇస్లాం అద్భుతమైన విజయాన్ని సాధించింది.
No comments:
Post a Comment