24 September 2022

భారతదేశపు తొలి మహిళా వైద్యులు-ఆనంది గోపాల్ జోషి, కాదంబినీ గంగూలీ & రుఖ్మాబాయి.

 

ఆనందీబాయి గోపాలరావు జోషి (31 మార్చి 1865 - 26 ఫిబ్రవరి 1887):

ఆనందీబాయి మొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఆనందీబాయి భారతదేశంలోని పూర్వపు బొంబాయి ప్రెసిడెన్సీ నుండి యునైటెడ్ స్టేట్స్‌లో పాశ్చాత్య వైద్యంలో రెండేళ్ల డిగ్రీని అభ్యసించి పట్టభద్రులైన మొదటి మహిళ.

ఆనందీబాయి కోల్‌కతా (కలకత్తా) నుండి ఓడలో న్యూయార్క్‌ కు థోర్‌బోర్న్స్‌కు చెందిన ఇద్దరు మహిళా ఇంగ్లీషు మిషనరీల వెంట  ప్రయాణించారు. న్యూయార్క్‌ లో, థియోడిసియా కార్పెంటర్ జూన్ 1883లో ఆనందీబాయిను రిసీవ్ చేసుకొన్నారు. ఆనందీబాయి ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా లో ఎన్రోల్ అయ్యారు.

ఆనందీబాయి జోషీ 1886లో ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా (WMC) నుండి పట్టభద్రురాలైంది. ఆనందీబాయి భారత దేశం నుండి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి మహిళ.

ఆనందీబాయి 19సంవత్సరాల వయస్సులో తన వైద్య శిక్షణను ప్రారంభించింది. అమెరికాలో, చల్లని వాతావరణం మరియు సరిపడని ఆహారం కారణంగా ఆనందీబాయి ఆరోగ్యం క్షీణించింది. ఆనందీబాయికు క్షయవ్యాధి సోకింది, అయినప్పటికీ, ఆనందీబాయి మార్చి 1886లో MD పట్టభద్రురాలైంది;

ఆనందీబాయి థీసిస్ యొక్క అంశం "ఆర్యన్ హిందువులలో ప్రసూతి శాస్త్రం." థీసిస్ కు ఆయుర్వేద గ్రంథాలు మరియు అమెరికన్ వైద్య పాఠ్యపుస్తకాల నుండి రెఫెరెన్స్  గా ఉపయోగించుకుంది. ఆనందీబాయి గ్రాడ్యుయేషన్ సందర్భంగా, క్వీన్ విక్టోరియా శుభాకాంక్షలు పంపింది.

 

కాదంబినీ గంగూలీ (18 జూలై 1861 - 3 అక్టోబర్ 1923)

 కాదంబినీ గంగూలీ భారతదేశం నుండి మరియు మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యం నుండి రెండవ మహిళా వైద్యురాలు. దక్షిణాసియాలో పట్టభద్రులైన పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన మొదటి భారతీయ మరియు దక్షిణాసియా మహిళా వైద్యురాలు కూడా కాదంబిని గంగూలీ.

కలకత్తా మెడికల్ కాలేజీలో కాదంబినీ గంగూలీ మెడిసిన్ చదివింది. 1886లో, కాదంబినీ గంగూలీ కు బెంగాల్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా లభించింది. ఆనంది గోపాల్ జోషి తో పాటు పాశ్చాత్య వైద్యాన్ని అభ్యసించడానికి అర్హత సాధించిన మరొక భారతీయ మహిళా వైద్యురాలు కాదంబినీ గంగూలీ.


కాదంబినీ గంగూలీ మెడికల్ కాలేజి లోని ఉపాధ్యాయ సిబ్బంది మరియు సమాజంలోని సనాతన వర్గాల నుండి వచ్చిన కొంత వ్యతిరేకతను అధిగమించింది. కాదంబినీ గంగూలీ 1892లో యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లి LRCP (ఎడిన్‌బర్గ్), LRCS (గ్లాస్గో) మరియు GFPS (డబ్లిన్)గా అర్హత సాధించి భారతదేశానికి తిరిగి వచ్చింది. లేడీ డఫెరిన్ హాస్పిటల్‌లో కొద్దికాలం పనిచేసిన తర్వాత, కాదంబినీ గంగూలీ తన స్వంత ప్రైవేట్ ప్రాక్టీస్‌ను ప్రారంభించింది.

1883లో కాదంబినీ గంగూలీ బ్రహ్మ సమాజ సంస్కర్త మరియు మహిళా విముక్తి నాయకుడు ద్వారకానాథ్ గంగూలీని వివాహం చేసుకుంది. తూర్పు భారతదేశంలో మహిళా బొగ్గు గని కార్మికుల పని పరిస్థితులను మెరుగుపరచడానికి స్త్రీ విముక్తి మరియు సామాజిక ఉద్యమాలలో వారు చురుకుగా పాల్గొన్నారు.

1889లో భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ సమావేశానికి హాజరైన ఆరుగురు మహిళా ప్రతినిధులలో కాదంబినీ గంగూలీ ఒకరు. బెంగాల్ విభజన తర్వాత కాదంబినీ గంగూలీ 1906లో కలకత్తాలో మహిళా సదస్సును కూడా నిర్వహించారు. 1908లో, కాదంబినీ గంగూలీ దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్‌వాల్‌లోని భారతీయ కార్మికుల సత్యాగ్రహo పట్ల సానుభూతిని వ్యక్తం చేయడం కోసం కలకత్తా సమావేశాన్ని కూడా నిర్వహించింది మరియు అధ్యక్షత వహించింది. కార్మికులకు సహాయం చేయడానికి నిధుల సేకరణకు కాదంబినీ గంగూలీ  ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది.

 

రుఖ్మాబాయి (22 నవంబర్ 1864 - 25 సెప్టెంబర్ 1955):

 రుఖ్మాబాయి ఒక భారతీయ వైద్యురాలు మరియు స్త్రీవాది. 1884 మరియు 1888 మధ్య కాలంలో బాల్య వధువుగా తన వివాహానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్ లీగల్ కేసులో ప్రమేయంతో పాటు వలస భారతదేశంలో ప్రాక్టీస్ చేస్తున్న మహిళా వైద్యుల్లో ఒకరిగా రుఖ్మాబాయి బాగా పేరు పొందింది.

రుఖ్మాబాయి లీగల్ కేస్ బ్రిటీష్ పాలనలో ఉన్న భారతదేశం మరియు ఇంగ్లండ్ రెండింటిలోనూ ఉత్సుకత రేపింది. రుఖ్మాబాయి లీగల్ కేస్ లో చట్టం వర్సెస్ సంప్రదాయం, సాంఘిక సంస్కరణ వర్సెస్ సంప్రదాయవాదం మరియు స్త్రీవాదం వంటి అంశాలు  ప్రముఖంగా ఉన్నాయి. రుఖ్మాబాయి లీగల్ కేసు చివరికి 1891లో సమ్మతి వయస్సు చట్టానికి దోహదపడింది.

No comments:

Post a Comment