4 September 2022

భారత జాతీయ సైన్యం (INA)లోని ముస్లిం వీరులు Muslim Heroes Of Indian National Army

 

1942లో, రాష్ బిహారీ బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా పిలువబడే ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)ని స్థాపించారు, దానిని రాష్ బిహారీ బోస్,  సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించాడు. రాష్ బిహారీ బోస్,  సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) యొక్క సుప్రీం సలహాదారుగా కొనసాగారు.

ముస్లింలు, ముఖ్యంగా రంగూన్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో స్థిరపడిన వారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్/INAకి తమ జీవితాలను మరియు సంపదను ఇచ్చారు. ముస్లిం సైనికులు మరియు వ్యాపార వర్గాలు చేసిన త్యాగాలను సుభాష్ చంద్రబోస్ అమితంగా ప్రశంసించారు.. అనేక మంది ముస్లిం సైనికులు  మరియు అధికారులు నేతాజీ నుండి తమ్‌ఘా-ఎ-సర్దార్-ఎ-జాంగ్, తమ్‌ఘా-ఇ-వీర్-ఎ-హింద్, తమ్‌ఘా-ఎ-బహదూరి, తమ్‌ఘా-ఇ- శత్రు నాష్, సేనాద్-ఎ-బహదూరి వంటి అలంకరణలను అందుకున్నారు.

ఆజాద్ హింద్ ఫౌజ్/INAలో తమ సహకారం మరియు పోరాటం కారణంగా ప్రసిద్దులుగా /లెజెండ్‌లుగా మారిన 12 మంది వ్యక్తుల జాబితా: 

1.కెప్టెన్ అబ్బాస్ అలీ:

స్వాతంత్ర్య సమరయోధుడు కెప్టెన్ అబ్బాస్ అలీ జనవరి 3, 1920న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో జన్మించాడు. అబ్బాస్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో కెప్టెన్‌గా భారత  దేశ విముక్తి కోసం పోరాడాడు. కెప్టెన్ అబ్బాస్ 1943లో సుభాస్ చంద్రబోస్ చేసిన ప్రసంగం నుండి ప్రేరణ పొంది భారత దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అబ్బాస్‌ను బ్రిటిష్ సైన్యం నిర్బంధించి జీవిత ఖైదు విధించింది. కానీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, మరణశిక్ష రద్దు చేయబడింది. కెప్టెన్ అబ్బాస్ అలీ 11 అక్టోబర్ 2014న అలీఘర్‌లో తుది శ్వాస విడిచారు.

2.అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ:

మెమన్ అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ గుజరాత్‌లోని సౌరాష్ట్రలోని ధోరాజీ పట్టణానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు మరియు వ్యాపారవేత్త. జూలై 9, 1944న రంగూన్‌లో సుభాస్ చంద్రబోస్ INAని స్థాపించినప్పుడు, ఆజాద్ హింద్ బ్యాంక్‌కు ఆర్థికంగా విరాళాలు ఇవ్వడానికి మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి మార్ఫానీ. రంగూన్ మరియు సింగపూర్‌లోని భారతీయ నిర్వాసితులు  కూడా విరాళాలు అందించారు. 1944లో నేతాజీకి, యూసుఫ్ మర్ఫానీ  రూ. కోటి నగదు, రూ. 3 లక్షల ఆభరణాలు విరాళంగా  ఇచ్చారు, దాని విలువ నేడు దాదాపు రూ. 800 కోట్లు ఉంటుంది.

3.అబిద్ హసన్ సఫ్రాని:

జైన్ అల్-అబ్దిన్ హసన్ 1911 ఏప్రిల్ 11న హైదరాబాద్‌లో జన్మించాడు. జర్మనీలో భారత యుద్ధ ఖైదీల సమావేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగిస్తున్నప్పుడు నేతాజీ తో పరిచయం ఏర్పడింది. అబిద్ హసన్ సఫ్రానీ, సుభాష్ చంద్రబోస్ యొక్క సన్నిహితుడు అయ్యాడు మరియు INAలో మేజర్ అయ్యాడు.. అబిద్ హసన్ సఫ్రానీ సూచన మేరకు, INA తన నినాదంగా "జై హింద్"ని స్వీకరించింది. స్వాతంత్ర్యం తర్వాత, అబిద్ హసన్ సఫ్రానీ 1948లో సివిల్ సర్వీస్‌లో చేరాడు మరియు 1969లో డెన్మార్క్‌ లో రాయబారిగా పదవీ విరమణ చేశాడు. 73 సంవత్సరాల వయస్సులో, అతను 1984లో తన స్వగ్రామంలో మరణించాడు.

4.M.K.M అమీర్ హంజా:

ఎం.కె.ఎం. హంజా "భాయ్" అని పిలువబడే అమీర్ హంజా 22 జనవరి 1918న తమిళనాడులోని రామనాథపురంలో జన్మించాడు. అమీర్ హంజా సుభాస్ చంద్రబోస్ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యుడు మరియు తమిళనాడు నుండి భారత విముక్తి పోరాట యోధుడు. యుక్తవయసులో, హంజా  వ్యాపారం  కోసం బర్మాకు వెళ్లాడు మరియు అక్కడ అమీర్ హంజా INAకి లక్షలాది రూపాయలను విరాళంగా అందించాడు. నేతాజీ సైన్యానికి మద్దతిచ్చినందుకు బ్రిటిష్ ప్రభుత్వం అమీర్ హంజాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. తన చివరి సంవత్సరాల్లో, అమీర్ హంజా పేదరికంతో బాధపడ్డాడు. జనవరి 1, 2016న అమీర్ హంజా కన్నుమూశారు.

5.జనరల్ షా నవాజ్ ఖాన్:

ఆజాద్ హింద్ ఫౌజ్ అధికారి షా నవాజ్ ఖాన్ బ్రిటిష్ ఇండియాలోని రావల్పిండిలో జన్మించారు. ఆగ్నేయాసియాలో సుభాష్ చంద్రబోస్ వచ్చిన తర్వాత షా నవాజ్ ఖాన్ INAలో చేరారు. షా నవాజ్ ఖాన్  INA దళాలను ఈశాన్య భారతదేశంలోకి విజయవంతంగా నడిపించాడు, కొహిమా మరియు ఇంఫాల్‌లను స్వాధీనం చేసుకున్నాడు, ఆ తర్వాత అవి INA ఆధీనంలో జపాన్ అధికారంలో ఉన్నవి.. బ్రిటీష్ సామ్రాజ్యం యొక్క జెండాను తొలగించిన తర్వాత ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మొదటి భారతీయుడిగా షా నవాజ్ ఖాన్  చరిత్ర సృష్టించాడు. స్వాతంత్య్రానంతరం షా నవాజ్ ఖాన్  రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు, మీరట్ నుండి నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

6.మేజర్ జనరల్ మహమ్మద్ జమాన్ కియాని:

మేజర్ జనరల్ మొహమ్మద్ జమాన్ కియాని సుభాస్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) లో బదలీకాక  ముందు  బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు, అక్కడ కియాని 1వ విభాగాన్ని పర్యవేక్షించాడు. స్వోర్డ్ ఆఫ్ ఆనర్‌తో ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి గ్రాడ్యుఎట్    అయిన తరువాత, కియాని పంజాబ్ రెజిమెంట్‌లో చేరాడు. ఆజాద్ హింద్ కోసం కియాని చేసిన కృషికి గుర్తింపుగా  భారత ప్రభుత్వం మరణానంతరం కియానికి  నేతాజీ పతకాన్ని అందించింది. అతను జూన్ 4, 1981 న మరణించాడు. 

7.కల్నల్ నిజాముద్దీన్:

1901లో ధాక్వాన్ గ్రామంలో జన్మించిన (ప్రస్తుత ఉత్తరప్రదేశ్ జిల్లా అజంగఢ్‌లో ఉంది) నిజాముద్దీన్, అసలు పేరు సైఫుద్దీన్.  నిజాముద్దీన్ బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్నప్పుడు, ఒక బ్రిటిష్ ఆర్మీ జనరల్  భారతీయ సిపాయిలను చనిపోనివ్వమని, కానీ మిగిలిన దళానికి ఆహారం తీసుకువెళ్లడానికి గాడిదలను రక్షించమని తెల్ల సైనికులను కోరడం విన్నాడు. నిజాముద్దీన్, ఆవేశం  ఆ అధికారిని కాల్చి చంపాడు మరియు సింగపూర్‌కు పారిపోయాడు.నిజాముద్దీన్,  సుభాష్ బోస్ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు.నిజాముద్దీన్,  నేతాజీతో పాటు 1943 మరియు 1944 మధ్య బర్మా అడవుల్లో బ్రిటిష్ సైన్యంకి వ్యతిరేకంగా పోరాడాడు. 1943లో నేతాజీ ప్రాణాలను కాపాడటానికి నిజాముద్దీన్, నేతాజీకి అడ్డుగా వెళ్లి  మూడు తుపాకి గుళ్ళను తిన్నాడు. నిజాముద్దీన్ కి   నేతాజీ స్వయంగా ప్రేమతో కల్నల్అనే ముద్దుపేరు ను పెట్టారు..

8.కల్నల్ హబీబ్ ఉర్ రెహమాన్:

జనరల్ మోహన్ సింగ్‌తో కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించిన కల్నల్ హబీబ్ ఉర్ రెహమాన్, సంస్థ ప్రధాన కార్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ శాఖకు కమాండ్‌గా నియమించబడ్డారు. కల్నల్ హబీబ్ ఉర్ రెహమాన్ బర్మాకు ఒక మిషన్‌ను పర్యవేక్షించాడు. నేతాజీ, అతనిని  ఆజాద్ హింద్ ఫౌజ్ కమాండ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శిక్షణా పాఠశాలకు అధికారిగా బాధ్యతలు అప్పగించారు. అక్టోబరు 21, 1943న ఆజాద్ హింద్ సర్కార్ స్థాపించిన రోజున హబీబ్ ఉర్ రెహమాన్ మంత్రిగా ప్రమాణం కూడా చేశారు. తరువాత, హబీబ్ ఉర్ రెహమాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కూడా నియమించబడ్డాడు మరియు ఆగస్టు 18, 1945న నేతాజీ తన చివరి విమాన ప్రయాణంలో నేతాజీ తో పాటు కలసి హబీబ్ ఉర్ రెహమాన్ ఉన్నారు

9.కల్నల్ ఇనాయతుల్లా హసన్:

జనరల్ మోహన్ సింగ్, ఇనాయతుల్లా హసన్‌ను ఆజాద్ హింద్ రేడియో డైరెక్టర్‌గా నియమించారు. ఇనాయతుల్లా హసన్‌ ప్రసిద్ధ జాతీయవాద రేడియో నాటకాలను సృష్టించాడు. తరువాత, నేతాజీ అతన్ని శిక్షణ విభాగానికి అధిపతిగా నియమించారు, అక్కడ ఇనాయతుల్లా హసన్‌ ఆయుధాల ఉపయోగంలో మహిళలు మరియు పిల్లలతో సహా పౌరులకు శిక్షణ ఇచ్చేవారు.

10.కల్నల్ షౌకత్ అలీ మాలిక్:

కల్నల్ షౌకత్ అలీ మాలిక్,  మొట్టమొదటి జాతీయ జెండాను స్వేచ్ఛా భారత భూమి free Indian land పై ఎగురవేయడం జరిగింది. ఏప్రిల్ 14, 1944న మణిపూర్‌లోని మొయిరాంగ్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్‌కి చెందిన బహదూర్ గ్రూప్ కమాండర్ మాలిక్ జాతీయ జెండాను ఎగురవేశాడు. మోయిరాంగ్ భారతదేశంలో INA చేత స్వాధీనం చేసుకున్న మొదటి ప్రాంతం మరియు ఆజాద్ హింద్ ప్రభుత్వం నియంత్రించిన భారత ఉపఖండంలో మొదటి ప్రదేశం. ఈ స్వాధీనం లో తన సైనికులకు నాయకత్వం వహించినందుకు “సర్దార్-ఎ-జంగ్‌” ను మాలిక్ అందుకున్నాడు. పౌర పరిపాలనను స్థాపించిన తర్వాత, ఇంటెలిజెన్స్ ఏజెంట్లు శత్రు భూభాగంలోకి పంపబడ్డారు. ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క అత్యున్నత సైనిక గౌరవాలలో ఒకటైన తమ్ఘా-ఎ-సర్దార్-ఎ-జంగ్, నేతాజీచే షౌకత్ అలీ మాలిక్ కి అందించబడింది.

11.కల్నల్ మెహబూబ్ అహ్మద్:

ఆజాద్ హింద్ సర్కార్ మరియు ఆజాద్ హింద్ ఫౌజ్ మధ్య సమన్వయ   కర్త  కల్నల్ మెహబూబ్ అహ్మద్. ఆయన నేతాజీ సైనిక కార్యదర్శి కూడా.కల్నల్ మెహబూబ్ అహ్మద్, అరకాన్ మరియు ఇంఫాల్‌లలో జరిగిన ప్రచారాలలో మేజర్ జనరల్ షా నవాజ్  ఖాన్ యొక్క సలహాదారుగా పనిచేశాడు.

12.కరీం ఘనీ:

నేతాజీ జర్మనీ నుండి రాకముందు, బర్మాలో నివసించిన తమిళ జర్నలిస్టు కరీం ఘనీ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నాయకుడిగా పనిచేశాడు. ఆజాద్ హింద్ సర్కార్ స్థాపించినప్పుడు ఆరుగురు సలహాదారులలో ఒకరిగా పనిచేస్తానని ప్రమాణం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బర్మాలో కరీం ఘనీ,  డాక్టర్ బా మా పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు. అతను "ది ముస్లిం పబ్లిషింగ్ హౌస్" మేనేజర్‌గా, మలయాళ దినపత్రిక “మలయన్ నన్బన్” ఎడిటర్‌గా మరియు ఆల్ మలయా ముస్లిం మిషనరీ సొసైటీ (AMMMS) అధ్యక్షుడిగా సినారన్ పేరుతో “డాన్” యొక్క మలయ్ ఎడిషన్ సంపాదకుడిగా మరియు అనేక ఇతర సంస్థలలో ప్రతినిధిగా ఉన్నారు. ఘనీ ముస్లిం లీగ్‌లో కూడా చురుకుగా ఉన్నారు.

 

 

No comments:

Post a Comment