15 September 2022

భారతదేశపు తొలి మహిళా దంతవైద్యులు

 


డెంటిస్ట్రీ రంగంలో మహిళలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. బద్రీ టెమూర్తాష్ ఇరానియన్ మొదటి మహిళా దంతవైద్యురాలు. జోసెఫ్రిన్ సెర్రే 1814 సంవత్సరంలో టార్టు విశ్వవిద్యాలయం నుండి డెంటిస్ట్రీ డిగ్రీని పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. 1859లో, యునైటెడ్ స్టేట్స్‌లో రెగ్యులర్ డెంటల్ ప్రాక్టీస్‌ను స్థాపించిన మొదటి మహిళ ఎమెక్లైన్ రాబర్ట్ జోన్స్. 

యునైటెడ్ స్టేట్స్‌లో డెంటిస్ట్‌ గా మారిన మొదటి చైనీస్-అమెరికన్ మహిళ సాయి సో యోంగ్. 1904లో కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ (ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ ది పసిఫిక్ ఆర్థర్ A. డుగోని స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీ) నుండి సాయి సో యోంగ్ పట్టభద్రురాలైంది.

 అదేవిధంగా, భారతదేశం లోని  మహిళా దంతవైద్యులు  గొప్ప చరిత్రను కలిగి ఉన్నారు.

 హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ప్రకారం డాక్టర్ విమ్లా సూద్ భారతదేశపు మొదటి మహిళా దంతవైద్యురాలు. లాహోర్‌లోని డిమాంట్‌మోరెన్సీ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్రీ డాక్టర్  విమ్లా సూద్ నుండి 1944 సంవత్సరంలో పట్టభద్రురాలైంది.

 



 

డాక్టర్ విమ్లా సూద్

డాక్టర్ విమ్లా సూద్,  న్యూయార్క్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి, తర్వాత 1955లో మిన్నెసోటా విశ్వవిద్యాలయం నుండి పీడియాట్రిక్ డెంటిస్ట్రీలో మాస్టర్ డిగ్రీని పొందింది, ఆ తర్వాత డాక్టర్ విమ్లా సూద్ భారతదేశానికి తిరిగి వచ్చి ఢిల్లీలోని వెల్లింగ్‌డన్ హాస్పిటల్‌లో చేరింది, ఇప్పుడు దానిని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ అని పిలుస్తారు.

 

కానీ వాస్తవం ఏమిటంటే డాక్టర్ విమ్లా సూద్ కంటే ముందు పట్టభద్రులైన మహిళా దంతవైద్యులు ఇద్దరు ఉన్నారు. వారు-డాక్టర్ ఫాతిమా అలీ జిన్నా మరియు డాక్టర్ తబితా సోలమన్

 



 

డాక్టర్ ఫాతిమా జిన్నా

ఫాతిమా అలీ జిన్నా 1923లో అవిభక్త భారతదేశంలోని కలకత్తాలో ఉన్న డాక్టర్ ఆర్ అహ్మద్ డెంటల్ కాలేజ్ (గతంలో దీనిని  కలకత్తా డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అని పిలిచేవారు) నుండి సర్టిఫైడ్/ధృవీకరించబడిన దంతవైద్యురాలు అయ్యారు. ఫాతిమా అలీ జిన్నా 1929 వరకు బొంబాయిలోని ఒక క్లినిక్ లో స్వతంత్రంగా పనిచేసింది. ఫాతిమా అలీ జిన్నా, తన సోదరుడు  ముహమ్మద్ అలీ జిన్నా భార్య (రుత్తన్‌బాయి) మరణo  తర్వాత తన సోదరుడు ముహమ్మద్ అలీ జిన్నా కు మద్దతుగా మరియు అతనితో ఉండడానికి తన మెడికల్ ప్రాక్టిస్ ను విడిచింది.

 

 


డాక్టర్ తబితా సోలమన్

 

మరొక మహిళా దంతవైద్యురాలు డాక్టర్ తబితా సోలమన్, కూడా కలకత్తాలో ఉన్న డాక్టర్ ఆర్ అహ్మద్ డెంటల్ కాలేజ్ (గతంలో దీనిని  కలకత్తా డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అని పిలిచేవారు) నుండి 1928లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. డాక్టర్ రఫీయుద్దీన్ అహ్మద్‌కు,  "ఇండియన్ డెంటల్ జర్నల్" ప్రచురణలో   డాక్టర్ తబితా సోలమన్ సహకరించేది. యూదు కమ్యూనిటీకి చెందిన డాక్టర్ తబితా సోలమన్, చిత్తరంజన్ సేవా సదన్ హాస్పిటల్‌లో తన స్వంత క్లినిక్‌ని ప్రారంభించింది మరియు డఫెరిన్ హాస్పిటల్‌లో కూడా సేవలందించింది.

 

ఫాతిమా అలీ జిన్నా 1923 సంవత్సరంలో పట్టభద్రురాలయ్యారనే కాదనలేని వాస్తవం.  ఫాతిమా అలీ జిన్నా అవిభాజ్య భారతదేశపు మొదటి మహిళా మరియు ముస్లిం దంతవైద్యురాలు.  తబితా సోలమన్ ఐదు సంవత్సరాల తర్వాత1928లో  పట్టభద్రురాలైంది.

No comments:

Post a Comment