మౌల్వీ సయ్యద్ ముంతాజ్
అలీ, “హకుక్ అన్-నిస్వాన్ (మహిళల హక్కులు)” అనే
పుస్తకాన్ని రచించినారు. “హకుక్ అన్-నిస్వాన్ (మహిళల హక్కులు)” ఇస్లామిక్ చట్టాల
ప్రకారం మహిళల హక్కులను సమర్ధించే గ్రంథం.
షేక్-ఉల్-హింద్ మహ్మద్
అల్-హసన్‌తో కలిసి దేవ్‌బంద్‌లో చదువుకున్న సయ్యద్ ముంతాజ్ అలీ, ఇస్లాంలో స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులు
ఉన్నాయని మరియు సమాజం లో ప్రబలిన తప్పుడు అవగాహనల కారణంగా వారు తక్కువ స్థితిలో
ఉన్నారని అభిప్రాయపడ్డారు.
ప్రామాణికమైన ఖురాన్ వివరణలు
మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో స్త్రీల చట్టపరమైన హక్కుల గురించి పురుషులు మరియు
స్త్రీలకు అవగాహన కల్పించడం అవసరం అని పేర్కొన్నాడు.
మౌల్వీ సయ్యద్ ముంతాజ్
అలీ, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్‌కు తాను
వ్రాసిన పుస్తకం యొక్క మాన్యుస్క్రిప్ట్‌ని చూపించడానికి అలీఘర్‌ని సందర్శించారు.
సర్ సయ్యద్ ఆ పుస్తకం లోని భావాల పట్ల ఏకిభవించలేదు. 1898లో సర్ సయ్యద్ మరణించిన కొన్ని నెలల తర్వాత మౌల్వీ
సయ్యద్ ముంతాజ్ అలీ తన పుస్తకం “హకుక్ అన్-నిస్వాన్ (మహిళల హక్కులు)” ప్రచురించారు.
మౌల్వీ సయ్యద్ ముంతాజ్
అలీ అభిప్రాయం లో ఖురాన్ మరియు హదీథ్‌లపై అవగాహన ఉన్నవారు మరియు ప్రవక్త (స)మరియు ప్రవక్త(స)
కుటుంబ సభ్యుల పట్ల గౌరవం ఉన్నవారు స్త్రీలపట్ల
గౌరవప్రదంగా వ్యవరిస్తారని అన్నాడు.
మౌల్వీ సయ్యద్ ముంతాజ్
అలీ పుస్తకం “హకుక్ అన్-నిస్వాన్ (మహిళల హక్కులు)” పుస్తకం విప్లవాత్మకమైనది.“హకుక్ అన్-నిస్వాన్
(మహిళల హక్కులు)” పుస్తకం స్థూలంగా ఐదు
భాగాలుగా విభజించబడింది; పురుషులు, స్త్రీల కంటే గొప్పవారని నమ్మే తప్పుడు సామాజిక
నిర్మాణం; మహిళల విద్య; పర్దా వ్యవస్థ
(ముసుగు); వివాహం; భర్త మరియు భార్య
యొక్క సంబంధం.
మౌల్వీ సయ్యద్ ముంతాజ్
అలీ మొదట సమాజంలో ప్రబలంగా ఉన్న వాదనలను జాబితా చేసి, ఆపై వాటిని దివ్య ఖురాన్ ఆయతులు, హదీసులు మరియు తార్కిక వివరణలతో ఖండించినాడు. మౌల్వీ
సయ్యద్ ముంతాజ్ అలీ పుస్తకం ఇస్లాంలోని హనాఫీ ఫికా ప్రకారం ఉంది.
మౌల్వీ సయ్యద్ ముంతాజ్
అలీ, అల్లా ద్వారా పురుషులకు ఎక్కువ శారీరక బలం ఇవ్వబడినందున, పురుషులు, స్త్రీల కంటే గొప్ప అనే వాదనను ప్రతిఘటిస్తూ, మనిషి కంటే గాడిదకు ఎక్కువ శారీరక బలం ఉంది కాబట్టి గాడిదను మనిషి కంటే గొప్ప అని అనలేమని పేర్కొన్నాడు. మానవులు జంతువుల కంటే
శ్రేష్ఠులు, జ్ఞానము వలనే గాని శారీరక బలం వల్ల కాదు. అల్లాహ్ స్త్రీలను వివేకంలో
ఏ మాత్రం తక్కువ చేయలేదు.
మహిళలు ఆధ్యాత్మికంగా
అధమస్థులని, ఏ స్త్రీని ప్రవక్తగా చేయలేదు అనే వాదనను మౌల్వి
ముంతాజ్ అలీ ప్రతిఘటించాడు. 1,25,000 మంది ప్రవక్తలలో కొందరి పేర్లు మాత్రమే
తెలుసునని, ఖచ్చితంగా తెలిసిన ప్రవక్తలలో ఎవరు స్త్రీ కాదు
మరియు ఖురాన్ లేదా
హదీథ్‌లలో తెలియని ప్రవక్తలు మహిళ కాదు అని ఎక్కడా పేర్కొనబడలేదు అని
అన్నాడు.పేర్లు తెలియని ప్రవక్తలలో స్త్రీలు ఉండే అవకాశం ఉంది.
ఇస్లాం ప్రకారం ఆధ్యాత్మిక
జ్ఞానం విషయం లో స్త్రీ పురుషుల మధ్య భేదం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నతంగా ఉన్న స్త్రీలు
గా ప్రవక్త ముహమ్మద్ కుమార్తె హజ్రత్ ఫాతిమా మరియు ఆధ్యాత్మిక కవి రబియా బస్రీ
యొక్క ఉదాహరణలను మౌల్వి ముంతాజ్ ఇచ్చాడు.
ఆదం తోడుగా ఉండేందుకు
అల్లా, హవా ను సృష్టించాడనే నమ్మకాన్ని మౌల్వి ముంతాజ్ పూర్తిగా తోసిపుచ్చారు. మౌల్వి
ముంతాజ్ అలీ దృష్టిలో, గతం, వర్తమానం మరియు
భవిష్యత్తు అన్నీ తెలిసిన అల్లాహ్‌కు తాను హవా ను తయారు చేయబోతున్నానని ఖచ్చితంగా తెలుసు, కాబట్టి హవాకు సహచరుడిగా ఉంచడానికి హవా కంటే
ముందు ఆదం ను ఏర్పాటు చేసాడు.
మౌల్వి ముంతాజ్ అలీ ప్రకారం
అల్లా ప్రతి ముస్లింపై జ్ఞానాన్ని పొందడం విధిగా విధించాడు కాబట్టి స్త్రీలు,
పురుషుల మాదిరిగానే విద్యావంతులుగా ఉండాలని వాదించారు
ఒక నిర్దిష్టమైన విద్య
లేదా పుస్తకాలు స్త్రీలకు సరిపోవు అని చెప్పే వ్యక్తులు, ఒక పుస్తకం సమాజానికి ప్రమాదకరమైతే అది
స్త్రీలకు మాత్రమే కాదు, రెండు లింగాలకు (స్త్రీ-పురుషులకు)
అని అర్థం చేసుకోవాలి.
మౌల్వి ముంతాజ్ అలీ దృష్టిలో, పురుషులకు ఎలా బోధిస్తున్నారో అదే పద్ధతిలో
స్త్రీలకు విద్యను అందించడం మతపరమైన విధి.
పర్దా మరియు నమ్రతపై:
మౌల్వి ముంతాజ్ అలీ ప్రకారం వినయం గురించిన ఖురాన్ ఆయత్ విశ్వాసులను
వారి కళ్ళు క్రిందికి దింపి, వారి ప్రైవేట్
భాగాలను కప్పి ఉంచమని అనేది పురుషులు
మరియు స్త్రీలకు సమానంగా వర్తిస్తుందని వాదించారు.
మరొక ఆయత్ స్త్రీలను రొమ్ములను కప్పి ఉంచమని
అడిగేది వారి నిరాడంబరమైన దుస్తులలో ఒక భాగం అని మరియు అది సామాజిక మరియు ఆర్థిక జీవితాలలో మహిళల
భాగస్వామ్యం తొలగించదు అని పేర్కొన్నాడు.
దివ్య ఖురాన్‌లో, ఎక్కడా స్త్రీలను ఇళ్లలోనే ఉండమని అనలేదు, మహిళలు
తమ ముఖాలు మరియు చేతులు తెరిచి ఉంచడానికి అనుమతించబడతారని మౌల్వి ముంతాజ్ అలీ అనేక హదీస్ మరియు ఖురాన్ ఆయతుల ద్వారా వాదించాడు.
అంతేకాకుండా మహిళలు ఇళ్ల నుండి బయటకి అడుగు పెట్టకూడదని ఇస్లామిక్ తీర్పు లేదు.
మౌల్వి ముంతాజ్ అలీ ప్రకారం
ఇస్లాం, ముందస్తు వివాహాన్ని(early
marriage) నిరుత్సాహపరిచింది. ఇస్లాం లో పురుషుడు మరియు స్త్రీ వివాహానికి తమ సమ్మతి
ఇవ్వాలి, అంటే వారు వివాహాన్ని అర్థం చేసుకునే వయస్సులో ఉండాలి. ప్రారంభ గర్భం early pregnancy కూడా ఇస్లామిక్
బోధనలకు అనుగుణంగా లేదు. తన పుస్తకంలో మౌల్వి ముంతాజ్ అలీ కట్నం మరియు విపరీత వివాహ వేడుకలకు వ్యతిరేకంగా
వాదించాడు.
మహిళల కోసం పాఠశాలలను
తెరవడం మరియు పత్రికలను ముద్రించడం అనేక సామాజిక రుగ్మతలకు పరిష్కారాలను
అందిస్తుంది అని మౌల్వి ముంతాజ్ అలీ తన పుస్తకంలో పేర్కొన్నారు.
భారతీయ ముస్లిం సమాజం యొక్క
ప్రస్తుత ప్రమాణాల ప్రకారం కూడా మౌల్వి ముంతాజ్
అలీ అభిప్రాయాలు విప్లవాత్మకంగా కనిపిస్తాయి
మరియు మౌల్వి ముంతాజ్ వీటిని సుమారు 125 సంవత్సరాల క్రితం
వెలుబుచ్చారు.
సమకాలీన ప్రజలు మౌల్వి ముంతాజ్ అలీ ను విమర్శించారు మరియు ప్రారంభ 1,000 కాపీలను ముద్రించిన తర్వాత ముంతాజ్ అలీ పుస్తకం మళ్లీ ముద్రణలోకి రాలేదు. చాలా మంది
వ్యక్తులకు మౌల్వి ముంతాజ్ అలీ తన పుస్తక కాపీలను ఉచితంగా పంపారు, కాని అవి నిందలతో నిండిన లేఖలతో తిరిగి వచ్చాయి.
మనం ప్రగతి పధం వైపు అడుగులు
వేస్తునప్పుడు, ప్రేరణ కోసం మౌల్వి ముంతాజ్ అలీ గుర్తుకు
వస్తారు.
No comments:
Post a Comment