28 April 2023

రాజస్థాన్‌లోని ముస్లింలపై నివేదిక-పేదరికం, లేమి & అభద్రతను ఎదుర్కొంటున్నారు. Report On Muslims In Rajasthan Highlights Poverty, Deprivation & Insecurity

 

జైపూర్:

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) వారు స్పాన్సర్ చేసిన మరియు హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ పాలసీ అండ్ ప్రాక్టీస్, రూపొందించిన  రాజస్థాన్‌లోని ముస్లింలుఅనే 335 పేజీల సమగ్ర నివేదిక రాజస్తాన్ లోని ముస్లిం సమాజం అధిక స్థాయిలో  పేదరికం, లేమి మరియు అభద్రతను ఎదుర్కొంటున్నదని చెప్పింది.  

నివేదిక సంపాదకులుగా అబ్దుల్ షాబాన్, అమీర్ ఉల్లా ఖాన్, అమితాబ్ కుందు మరియు వెంకటనారాయణ మోత్కూరి ఉన్నారు.

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ పాలసీ అండ్ ప్రాక్టీస్, హైదరాబాద్‌లోని నిపుణులచే రూపొందించిన నివేదిక ముస్లింలలో పెరుగుతున్న అభద్రత, శక్తివంతమైన వైవిధ్యం మరియు తీవ్రమైన పేదరికాన్ని పరిశీలిస్తూ, నివేదిక యొక్క అధ్యాయాలు-ముస్లింల జనాభా, ఉన్నత విద్య, నిరంతర ఆరోగ్య అసమానతలు, మతపరమైన మైనారిటీలపై వివక్ష మరియు పక్షపాతం, ఆర్థిక సమస్యలు, గృహాలు, ప్రాథమిక సౌకర్యాలు లింగ విశ్లేషణ, మైనారిటీలకు ప్రభుత్వ బడ్జెట్, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు, సృజనాత్మక పరిశ్రమలు మరియు సామాజిక-మతపరమైన సందర్భంలో భూ యాజమాన్యం లో  అసమానతలు వంటి అంశాలకు అంకితం చేయబడ్డాయి.

ముస్లింల స్థితి అనేది ఒక సంక్లిష్టమైన మరియు బహుముఖ సమస్య, దానిని ఒకే ప్రతిస్పందనలో ఖచ్చితంగా లేదా పూర్తిగా పరిష్కరించలేము.

 

·        2011 జనాభా లెక్కల ప్రకారం, రాజస్థాన్ జనాభాలో ముస్లింలు దాదాపు 12.4% ఉన్నారు.

·        ముస్లిం జనాభా రాష్ట్రవ్యాప్తంగా ఉండి,  భరత్‌పూర్, అల్వార్ మరియు టోంక్ జిల్లాల్లో ప్రధానం గా కేంద్రికరించబడింది..

·        రాజస్థాన్‌లోని మైనారిటీ అధిక జనాభా ప్రాంతాలు రాష్ట్రంలోని పరిధీయ భాగంలో peripheral part ఎక్కువగా ఉన్నాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు:

·        నివేదిక  ప్రకారం రాజస్థాన్‌లోని ఇతర మత సమూహాల కంటే ఎక్కువ మంది ముస్లిం పిల్లలు రక్తహీనత మరియు మాంద్యం  కలిగిఉన్నారు. 60% మంది ముస్లిం పిల్లలు రక్తహీనతతో ఉన్నారు మరియు 17% మంది మాంద్యం తో కుంగిపోతున్నారు మరియు ఈ రెండు గణాంకాలు రాజస్థాన్‌లోని అన్ని మత సమూహాలలో కన్నా ముస్లిములలో  అత్యధికంగా ఉన్నాయి.

·        విద్యాభ్యాసం ప్రారంభించేటప్పుడు, ముస్లిం పిల్లల రేట్  ఇతర వర్గాల మాదిరిగానే ఉంటాయి, కానీ వారు ఉన్నత తరగతులకు వెళ్ళేటప్పుడు ఆర్థిక శక్తీ లేకపోవడం వల్ల వారు చదువు మానేస్తున్నారు.

·        దళితులు, ముస్లింలు, గిరిజనుల పిల్లలు చదువు మానేయడానికి ఆర్థిక శక్తీ లేకపోవడం ప్రధాన కారణమని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు.

·        హయ్యర్ సెకండరీ స్కూళ్లలో భాగస్వామ్య రేటు participation rate 6.55% తగ్గిందని, కేవలం 2% ముస్లిం యువకులు మాత్రమే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని నివేదిక తెల్పుతుంది.

·        ఆయుర్దాయం విషయం లో  life expectancy ముస్లింలు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల తర్వాత మాత్రమే ఉన్నారు.

·        ముస్లిములు, ఎస్సీలు లేదా ఎస్టీల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారు. అంతేకాకుండా, నివేదిక ప్రకారం, ముస్లింలలో 85 సంఘాలు ఉన్నాయి, వాటికి రిజర్వేషన్లు ఇవ్వాలి, కానీ అలా లేదు.

·        ముస్లింలలో సామాజిక మరియు ఆర్థిక ప్రాధాన్యత కలిగిన వారు వెనుకబడిన వారికి సహాయపడుత లేదని నివేదిక చెప్పింది.

·        సచార్ కమిటీ సిఫార్సులు మల్టీసెక్టోరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (MSDP)గా రూపాంతరం చెందిన తర్వాత మాత్రమే ముస్లిముల అభివృద్ధి దీర్ఘకాల కార్యక్రమ కార్యక్రమాలు అమలులోకి వస్తాయి

·        రాష్ట్రంలో మైనార్టీల బడ్జెట్‌ రూ. 99 కోట్ల నుండి  రూ. 290 కోట్లుకు పెంచబడినది అయిన అది మైనార్టిల స్థితిగతులు మార్చడానికి సరిపోదు.

హైదరాబాద్ కు చెందిన AIMIM అధినేత ఒవైసీ నివేదిక పై స్పందిస్తు  న్యాయం చేయాలంటే బడ్జెట్ పెంచి కొత్త పథకాలు ప్రవేశపెట్టి ముస్లింల రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించాలి. అప్పుడే సామాజిక న్యాయం సాధిస్తారు' అని అన్నారు.

నాలుగుసార్లు హైదరాబాద్ ఎంపీగా గెలిచిన ఒవైసీ. రాజస్థాన్‌లో ముస్లింల పరిస్థితి విధాన నిర్ణేతలకు మరియు అధికారంలో ఉన్న మరియు అధికారంలో లేని రాజకీయ పార్టీలకు వివరించడానికి నివేదిక తయారు చేయబడింది. మరియు వారు కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి, ”అని అన్నారు..

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ మరియు బిజెపి సీనియర్ నాయకురాలు వసుంధర రాజేకు నివేదికను అందజేస్తామని ఒవైసీ చెప్పారు.

 

 

No comments:

Post a Comment