29 April 2023

హైపోథైరాయిడిజం Hypothyroidism

 









హైపోథైరాయిడిజంథైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే వ్యాధి. ఈ వ్యాధి ప్రభావంతో చలిని తట్టుకోలేకపోవడంనీరసంమలబద్దకంహృదయ స్పందన రేటు తగ్గడం, నిరాశ, బరువు పెరగడం వంటి అనేక లక్షణాలలు కలుగుతాయి. కొన్నిసార్లు గ్రంథివాపు వ్యాధి కారణంగా మెడ ముందుభాగంలో వాపు ఏర్పడుతుంది. గర్భధారణ సమయంలో హైపోథైరాయిడిజం చికిత్స చేయకపోతే పుట్టిన శిశువులో పెరుగుదల, మేధోవికాసం తగ్గడంతోపాటు పుట్టుకతో వచ్చే అయోడిన్ లోపం సిండ్రోమ్‌కు దారితీస్తుంది.

 

 తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండడం హైపోథైరాయిడిజం రావడానికి అత్యంత ముఖ్య కారణం. థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టి.ఎస్.హెచ్), థైరాక్సిన్ స్థాయిలను కొలిచే రక్త పరీక్షలతో ఈ హైపోథైరాయిడిజం రోగ నిర్ధారణ చేయవచ్చు. ఉప్పులో అయోడిన్ శాతాన్ని పెంచడం ద్వారా అనేకమందిలో ఈ హైపోథైరాయిడిజం నిరోధించబడింది. లెవోథైరాక్సిన్‌తో థైరాయిడ్ హార్మోన్ ను పెంచడం ద్వారా ఈ హైపోథైరాయిడిజానికి చికిత్స చేయవచ్చు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ మందులు వాడడం శ్రేయస్కరం.

వ్యాధి లక్షణాలు

హైపోథైరాయిడిజం ఉన్నవారికి ప్రత్యేకంగా రోగ లక్షణాలు ఉండవు.. సాధారణంగా కనిపించే లక్షణాలు హైపోథైరాయిడిజంతో సంబంధాన్ని కలిగివుంటాయి.

 

హైపోథైరాయిడిజం వ్యాధి లక్షణాలు

లక్షణాలు

సంకేతాలు

అలసట

పొడి, ముతక చర్మం

చలి

చల్లని శరీరభాగాలు

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం

చర్మంలో మ్యూకోపాలిసాకరైడ్ నిక్షేపాలు

మలబద్దకం, అజీర్తి

జుట్టు రాలిపోవుట

బరువు పెరుగుతుంది

పల్స్ రేటు తగ్గడం

శ్వాస ఆడకపోవుట

అవయవాల వాపు

మొరటు గొంతు

స్నాయువు ప్రతిచర్యల తగ్గుదల

ఆడవారిలో అధిక ఋతుస్రావం

కార్పాల్ టన్నెల్ సిండ్రోమ్

అసాధారణ సంచలనం

ప్లూరల్ ఎఫ్యూషన్జలోదరం, పెరికార్డియల్ ఎఫ్యూషన్

వినికిడి తగ్గడం

 

గర్భదారణ సమయంలో

సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజం వల్ల సంతానలేమికి దారితీస్తుంది, కొన్నికొన్నిసార్లు గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది. గర్భధారణ ప్రారంభంలో హైపోథైరాయిడిజంప్రి-ఎక్లంప్సియా వల్ల తక్కువ తెలివితేటలతో ఉన్న సంతానం కలగడంకానీ, పుట్టిన సమయంలో శిశు మరణించే ప్రమాదంకానీ కలగవచ్చు. గర్భధారణలో 0.30.5% మహిళలు హైపోథైరాయిడిజం వ్యాధికి గురవుతున్నారు.

 

పిల్లలలో

హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న పసి పిల్లలు సాధారణ జనన బరువు, ఎత్తు కలిగి ఉంటారు. కొంతమందిలో మగత, కండరాల స్థాయి తగ్గడం, గట్టిగా ఏడవడం, తినడంలో ఇబ్బందులు, మలబద్దకం, నాలుక వెడల్పు అవడం, బొడ్డు హెర్నియా, పొడి చర్మం, శరీర ఉష్ణోగ్రత తగ్గడం, కామెర్లు వంటివి రావచ్చు. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయని థైరాయిడ్ గ్రంథి ఉన్న పిల్లలలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. అయోడిన్ లోపం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతున్న పిల్లలలో కూడా గ్రంథివాపు వ్యాధి సంక్రమిస్తుంది. దీనివల్ల పెరుగుదల ఆలస్యమవడం, శిశువులకు చికిత్స చేయకపోతే మేధో బలహీనత వంటి సమస్యలు వస్తాయి.

వ్యాధి కారణాలు

సమూహం

కారణాలు

ప్రాథమిక హైపోథైరాయిడిజం (థైరాయిడ్ గ్రంధి)

హషిమోతో'స్ థైరాయిడిటిస్, హైపర్ థైరాయిడిజం కొరకు రాడి అయోడిన్ చికిత్స ఉంది.

సెంట్రల్ హైపోథైరాయిడిజం (పీయూష గ్రంధి)

పీయూష గ్రంధి, థైరాయిడ్ గ్రంధిని తగినంత థైరాక్సిన్, ట్రైఅయిడోథైరోనిన్ లను ఉత్పత్తిని ప్రేరేపించడానికి తగినంత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయనపుడు ఇది సంభవిస్తుంది. ప్రతి ద్వితీయ హైపో థైరాయిడిజానికి నిర్దిష్ట కారణం లేకపోయినప్పటికీ, ఇది సాధారణంగా కణితి, రేడియేషన్ లేదా శస్త్రచికిత్సల వలన పిట్యుటరీ గ్రంధి దెబ్బతిన్నపుడు కలుగుతుంది.

పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం (హైపోథాల్మస్)

హైపోథాలమస్ తగినంత థైరోట్రోపిన్-రెలీసింగ్ హార్మోన్ ను ఉత్పత్తి చేసినపుడు సంభవిస్తుంది. థైరోట్రోపిన్-రెలీసింగ్ హార్మోన్, పిట్యుటరీ గ్రంధిని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ను ఉత్పత్తి చేసేందుకు పురికొల్పుతుంది. అందువలన దీనిని హైపోథాలమిక్-పిట్యుటరి-ఆక్సిస్ హైపో థైరాయిడిజం అని కూడా అనవచ్చు.

 

1811లో బెర్నార్డ్ కోర్టోయిస్ అనే శాస్త్రవేత్త సముద్రపు నాచులో అయోడిన్ ఉందని కనుగొన్నాడు. అయోడిన్ తీసుకోవడమనేది గ్రంథివ్యాధి పరిమాణంతో ముడిపడి ఉందని 1820లో జీన్-ఫ్రాంకోయిస్ కోయిండెట్ అనే శాస్త్రవేత్త తెలిపాడు. తగినంత అయోడిన్ తీసుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలను 1852లో గోయిటర్గ్యాస్‌పార్డ్ అడాల్ఫ్ చాటిన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించగా, 1896లో యూజెన్ బామన్ అనే శాస్త్రవేత్త థైరాయిడ్ కణజాలంలో అయోడిన్‌ను ప్రదర్శించాడు.

నిర్ధారణ పరీక్ష

ప్రాథమిక హైపో థైరాయిడిజం నిర్ధారణకు, అనేక మంది వైద్యులు పిట్యుటరీ గ్రంధి తయారుచేసే థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ పరిమాణాన్ని కొలుస్తారు. ఈ హార్మోన్ ఎక్కువ స్థాయిలో ఉంటే థైరాయిడ్ సరిపోయే స్థాయిలో థైరాయిడ్ హార్మోన్ (ముఖ్యంగా థైరాక్సిన్ (T4వంటిది), ట్రిఅయిడోథైరోనిన్ యొక్క స్వల్ప పరిమాణాలను (T3)) ఉత్పత్తి చేయడం లేదని సూచిస్తారు. అయితే, కేవలం ఈ హార్మోన్ ను కొలవడం వలన ద్వితీయ, తృతీయ హైపో థైరాయిడిజాన్ని నిర్ధారించలేము. కనుకీ హార్మోన్ సాధారణంగా ఉండి ఇంకా హైపోథైరాయిడిజం ఉన్నదనే అనుమానం ఉంటే ఇతర రక్త పరీక్షలు చేస్తారు.

 

చికిత్స

హైపోథైరాయిడిజానికి లెవోరొటేటరీ విధాలైన థైరాక్సిన్ (ఎల్-టి4), ట్రైఅయిడోథైరోనిన్ (ఎల్-టి3) లచే చికిత్స చేయబడుతుంది. అదనంగా థైరాయిడ్ హార్మోన్ అవసరమైన రోగులకు కృత్రిమ, జంతువుల నుండి తయారు చేసిన థైరాయిడ్ మాత్రలు లభ్యమవుతున్నాయి. థైరాయిడ్ హార్మోన్ ప్రతిరోజు తీసుకోవాలి. వైద్యులు రక్త స్థాయిలను పరీక్షించి సరైన మోతాదును నిర్ణయిస్తారు.

 

No comments:

Post a Comment