29 April 2023

విశాఖపట్నంలో 1780 సంవత్సరం లో జరిగిన సిపాయిల తిరుగుబాటు In The Year1780 Sepoy Mutiny in Visakhapatnam

 

బ్రిటీష్ ఇండియా మొత్తంలో (ప్రస్తుత పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌తో సహా) జరిగిన మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు విశాఖపట్నంలో జరిగింది. ఈ వాస్తవం విశాఖ పట్టణంలో అంతగా తెలియదు మరియు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు దాదాపుగా తెలియదు.

భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు అనే పదం ప్రస్తావించబడినప్పుడల్లా, 1857లో ఉత్తర మరియు మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన భారతీయ సిపాయిల తిరుగుబాటును సూచిస్తుంది. వివిధ సిపాయిల తిరుగుబాట్ల గురించి చాలా తక్కువగా తెలియడమే దీనికి కారణమని చెప్పవచ్చు. బ్రిటీష్ ఇండియాలో సిపాయిల తిరుగుబాట్లు  వివిధ సమయాలలో వివిధ ప్రదేశాలలో జరిగింది.

1857 తిరుగుబాటుకు కారణం ఆవు లేదా పంది కొవ్వుతో కాట్రిడ్జ్‌లను గ్రీజు చేయడం. అయితే ఇది ఈస్టిండియా కంపెనీకి మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కే పెరిగిన అసంతృప్తికి ఒక నిప్పు రవ్వ గా పనిచేసింది.

1857కి ముందు జరిగిన వివిధ సైనిక తిరుగుబాట్లకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. వీటన్నింటికీ మూలకారణo  అసంతృప్తి మరియు బ్రిటిష్ వ్యతిరేక భావాలు.

1780 అక్టోబరు 3న విశాఖపట్నంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు లో స్థానిక సైనికులు బ్రిటీష్ అధికారులపై వ్యతేరేకంగా ఆయుధాలను చేపట్టి వారిని హతమార్చారు. ఈ తిరుగుబాటులో, బ్రిటిష్ రికార్డుల ప్రకారం ముగ్గురు బ్రిటీష్ అధికారులు చంపబడ్డారు, సెటిల్మెంట్ చీఫ్ ఖైదు చేయబడ్డారు, ఖజానా మరియు ఆయుధశాలను దోచుకున్నారు మరియు కంటోన్మెంట్ దోచుకున్నారు. స్థానిక సైనికులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి కర్నాటిక్ ప్రాంతంలో హైదర్ అలీ యొక్క దళాలలో చేరడానికి దక్షిణం వైపు మార్చ్/కవాతు ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత, బ్రిటిష్ అధికారులు 8 అక్టోబర్, 1780న జమీందార్లు మరియు వారి బలగాల సహాయంతో, తిరుగుబాటుదారులను పట్టుకుని తిరిగి విశాఖపట్నం తీసుకువచ్చారు. తిరుగుబాటు మరియు దోపిడీ నేరం పై తిరుగుబాటుదారులను  బ్రిటిష్ వారు విచారించారు. రింగ్ లీడర్లను తుపాకులకు కట్టేసి పేల్చారు.

ముగ్గురు బ్రిటీష్ అధికారులను విశాఖపట్నంలోని ఓల్డ్ యూరోపియన్ స్మశానవాటికలో ఖననం చేసి ఉండవచ్చు, కానీ నేడు, కింగ్స్‌ఫోర్డ్ వెన్నెర్ Kingsford Venner అనే యువ అధికారి సమాధి మాత్రమే చెక్కుచెదరకుండా ఉంది. తిరుగుబాటును ప్రస్తావిస్తూ ఈ సమాధిపై ఉన్న శాసనం ఈ చారిత్రాత్మక సంఘటనకు సాక్ష్యంగా నిలుస్తోంది.

విశాఖపట్నంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు చరిత్రలో మొదటిది.నిజానికి భారత స్వాతంత్య్ర పోరాటంలో తొలి నిప్పురవ్వ విశాఖపట్నంలో వెలుగుచూసింది. విశాఖపట్నంలో జరిగిన తిరుగుబాటు బ్రిటిష్ ఇండియా మొత్తంలో జరిగిన మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు. విశాఖపట్నంలో స్థానిక సిపాయిలు, బ్రిటీష్ అధికారులను చంపారు. ఇప్పుడు, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) - విశాఖపట్నం మొదటి తిరుగుబాటును గుర్తుచేసే తగిన స్మారక చిహ్నం నిర్మించాలి అంటుంది. తద్వారా స్వాతంత్య్ర పోరాటానికి చేసిన కృషికి విశాఖపట్నం నగరానికి దేశ చరిత్రలో కీర్తి స్థానం లభిస్తుంది మరియు పర్యాటక ఆకర్షణగా కూడా మారనుంది.

1780 సిపాయిల తిరుగుబాటు గురించి పైన పేర్కొన్న వాస్తవాలను నగరానికి చెందిన చరిత్ర పరిశోధకుడు విజ్జేశ్వరపు ఎడ్వర్డ్ పాల్ అందించారు. విజ్జేశ్వరపు ఎడ్వర్డ్ పాల్ వృత్తి రీత్యా రిటైర్డ్ షిప్పింగ్ మేనేజర్. వైజాగ్‌ కు సంభందించిన డేటా బ్రిటిష్ లైబ్రరీ, లండన్, తమిళనాడు ప్రభుత్వం ఆర్కైవ్స్, బెంగుళూరు మరియు హైదరాబాద్‌లోని క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ ఆర్కైవ్స్ మరియు ఇతర పబ్లిక్ లైబ్రరీలు నుండి సేకరిoచారు..

 

No comments:

Post a Comment