17 April 2023

రంజాన్ సంప్రదాయాలు: ముస్లింలను మేల్కొలపడానికి ఫిరంగి కాల్చడం భారతదేశ నడిబొడ్డున సజీవంగా ఉంది Ramazan traditions: Cannonball firing to wake up Muslims is alive in the heart of India

 

రంజాన్ మాసం లో మద్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైసేన్ నగరంలోని కొండపై నుండి ఫిరంగి పేల్చడం వల్ల రైసేన్ నగరం మరియు దాని చుట్టుపక్కల గ్రామాలలో నివసించే ముస్లింలు తమ ఉపవాసాలను విరమించాల్సిన  సమయం ఆసన్నమైందని సూచించడo జరుగుతుంది. అదేవిధంగా ఫిరంగి పేల్చడం ద్వారా ఉపవాసం ప్రారంభ సమయం (ఉదయం) సూచించడo  కూడా జరుగుతుంది.

రంజాన్ మాసం లో ఫిరంగి పేల్చే సంప్రదాయం సుమారు 200 సంవత్సరాల నాటిది మరియు భారతీయు సంప్రదాయాలు మరియు బహుళ సాంస్కృతిక వ్యవస్థ లో భాగంగా సజీవంగా ఉంచబడింది. గతంలో గడియారం లేనప్పుడు ఉపవాసo విరమణ  చేయడానికి ఫిరంగిని కాల్చడం అరబ్ ప్రపంచంలో కూడా  ఒక అభ్యాసంగా భావించబడింది.

రంజాన్ మాసం లో ఈజిప్ట్ నుండి సౌదీ అరేబియా మరియు టర్కీ నుండి దుబాయ్ వరకు, ప్రతి దేశంలో  ఇఫ్తార్ మరియు సెహ్రీలలో ఫిరంగిని ఉపయోగించడం  జరుగుతుంది.

భారతదేశం నడిబొడ్డున ఉన్న మధ్యప్రదేశ్ రాజధాని భోఫాల్ సమీపాన గల రైసేన్  నగరo లో కూడా రంజాన్ లో ఫిరంగి పేల్చే సంప్రదాయం కలదు.

 18వ శతాబ్దంలో భోపాల్  బేగం (క్వీన్స్) పాలనలో 18వ శతాబ్దంలో సెహ్రీ మరియు ఇఫ్తారీ కోసం భక్తులైన ముస్లింలు నిద్రలేవడానికి ఫిరంగిని ఉపయోగించే సంప్రదాయం ప్రారంభమైంది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భోపాల్ రాచరిక రాజ్యం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చేర్చబడింది.

అరబ్ ప్రపంచంలో, ఈ ఆచారం దాదాపు అంతరించిపోయింది. అయినప్పటికీ, రైసెన్‌ నగరం లో, ప్రభుత్వ నియమాలు మరియు స్థానిక మసీదు కమిటీల ప్రయత్నాల కారణంగా ఇది సజీవంగా ఉంచబడింది

రంజాన్‌ మాసం ఆరంభానికి వారం రోజుల ముందు స్థానిక పట్టణ పాలకవర్గం నిర్వహించే 1.2 మీటర్ల ఫిరంగిని పట్టణంలోని మసీదు కమిటీకి అప్పగిస్తారు. ఒక నెలపాటు ఫైరింగ్ లైసెన్స్ జారీ చేయబడుతుంది.

కొండపై ఉన్న రైసెన్ కోటకు చేర్చడానికి ముందు ఫిరంగిని శుభ్రపరచడం, పెయింట్ చేయడం మరియు మరమ్మత్తు చేయడం జరుగుతుంది. ఫిరంగిని  రంజాన్ మాసం అంతటా ఉపయోగించబడుతుంది.

రైసేన్ నగరం మొత్తం సాయంత్రం మరియు తెల్లవారుజామున జరిగే ఫిరంగి పేల్చే దృశ్యo  గురించి ఉత్సుకతతో ఉంది, ఎందుకంటే ఇది వారికి గతాన్ని గుర్తు చేస్తుంది.

రైసేన్ పట్టణంలోని చారిత్రక కోటకు నష్టం జరగకుండా 1956లో ఫిరంగిని మార్చారు. ప్రతి ఫిరంగి గుండుకి దాదాపు 250 గ్రాముల గన్‌పౌడర్ అవసరమవుతుంది మరియు ఇది స్థానిక మసీదు కమిటీ సేకరించిన డబ్బు నుండి కొనుగోలు చేయబడుతుంది.

అప్పట్లో నగరంలో టీ అమ్మే గన్నర్ షఖావత్ ఉల్లాకు ఫిరంగిని కాల్చే పని అప్పగించారు. ప్రస్తుతం ఫిరంగిని కాల్చే బాధ్యత ఉల్లా కుటుంబంలో మూడవ తరం షాకత్ ఉల్లా ది.

షాకత్ ఉల్లా మరియు అతని స్నేహితులు సాయంత్రం ఫిరంగిని కాల్చడానికి కొండపైకి వస్తారు. అక్కడే ఉపవాస దీక్ష విరమిస్తారు.

ఉదయం 4 గంటలకు, షౌకత్ ఉల్లా ఉపవాసం ఉన్నవారికి సెహ్రీ సమయాన్ని సూచించడానికి ఫిరంగి గుండును కాల్చడానికి తిరిగి వచ్చాడు.

45 సంవత్సరాల వయస్సులో, తన తాత, తండ్రి మరియు మేనమామ తర్వాత చేసిన విధంగానే తన కుమారుడు తన తర్వాత కూడా ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుకుంటాడని ఆశిస్తున్నానని షోకత్ ఉల్లా చెప్పాడు.

No comments:

Post a Comment