29 April 2023

మే డే

 



చాలా దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు.

కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు.

ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి.

1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్.

ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది.

మొదటగా ఈ ఉద్యమం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు‌ కోసం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని కార్మికులు ఉదృతం చేసి పరిశ్రమలను స్తంభింపచేసి కార్మిక ప్రభంజనాన్ని అదుపు చేయలేక 1837 లో రోజుకు 10 గంట‌ల‌ పనిదినాన్ని అమెరికా ప్రభుత్వం శాసనబద్దం చేసింది

మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం ప్రజా సెలవు దినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఎకీభవిస్తాయి. ఇవి అన్ని కూడా కార్మికుల పోరాటంకార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి.

1923లో మొదటిసారి భారతదేశంలో మే డేను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి మే డేను పాటించడం జరుగుతుంది.

 

No comments:

Post a Comment