6 February 2025

1942 కుంభమేళాలో యాత్రికుల కోసం ఆరోగ్య క్లినిక్‌ను ప్రారంభించిన VII నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ VII Nizam of Hyderabad Osman Ali Khan opened clinic at Kumbh in 1942

 


హైదరాబాద్‌కు చెందిన VII నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1942లో కుంభమేళా సమయంలో యాత్రికులకు ఆరోగ్య సేవలను అందించారు.

ఎ రేర్ రిపోర్ట్ ఆఫ్ నిజాం ఆయుర్వేద మొబైల్ క్లినిక్ప్రకారం, VII నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1942 కుంభమేళా లో క్లినిక్‌ను స్థాపించారు. ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడం మరియు యాత్రికుల శ్రేయస్సును నిర్ధారించడం క్లినిక్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (NIIMH) చెందిన  పరిశోధకులు, S.A. హుస్సేన్ మరియు వినోద్ కుమార్ భట్నాగర్ రిపోర్ట్ నిజాం ఆయుర్వేద సఫారీ దవాఖానా Report – Nizam Ayurvedic Safari Dawakhana.’అనే అరుదైన ఉర్దూ బుక్‌లెట్‌ను అన్వేషించారు. బుక్‌లెట్‌ కుంభమేళా, యాత్రికులు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలు మరియు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించినది.

 హైదరాబాద్‌కు చెందిన VII నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మొబైల్ హెల్త్ క్లినిక్‌కు ఆయుర్వేద సఫారీ దవాఖానా అని పేరు పెట్టారు. ఇది ప్రయాగ్‌లో జరిగిన కుంభమేళాలో భక్తులకు వైద్య సహాయం అందించింది. నిజాం క్లినిక్ కుంభమేళాలో ఏర్పాటు చేసిన 12 ఆరోగ్య కేంద్రాలలో ఒకటి.

మహంత్ సబా పురాన్ దాస్జీ సిఫార్సు ఆధారంగా ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్‌లో క్లినిక్ స్థాపనను ప్రారంభించారు. కుంభమేళా కోసం VII నిజాం క్లినిక్‌ను ప్రయాగ్‌కు పంపారు.

కుంభమేళా లోని క్లినిక్‌లో అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల బృందం ఉంది. డిసెంబర్ 26, 1941న అవసరమైన మందులు మరియు వైద్య పరికరాలతో డాక్టర్ల బృందం హైదరాబాద్ నుండి బయలుదేరింది. పండిట్ రాధా కృష్ణ మరియు ఎం.ఎ. రంగాచారి నేతృత్వంలోని వైద్య బృందం జనవరి 1, 1942న తన ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రారంభించింది. అయితే, నిజాం క్లినిక్ జనవరి 6న అధికారికంగా ప్రారంభించబడింది.

హైదరాబాద్‌కు చెందిన VII నిజాం ఆయుర్వేదానికి బలమైన ప్రతిపాదకులు. తన రాజ్యం లో అభివృద్ధిని ప్రోత్సహించడానికి VII నిజాం ఏటా రూ.35,000 కేటాయించారు.

ఆరోగ్య సంరక్షణకు VII నిజాం చేసిన కృషి ప్రజా సంక్షేమం పట్ల, సాంప్రదాయ భారతీయ వైద్య పరిరక్షణ పట్ల VII నిజాం కున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

No comments:

Post a Comment