మదర్సా విద్య లో సoస్కరణాలు
ముస్లింల విద్యాభివృద్ధిలో మదర్సా కీలకపాత్ర పోషిస్తోంది. ఆధునిక కాల పరితీతులకు తగినట్లు గా మదర్సాలు తమ పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలి. మతాల తులనాత్మక అధ్యయనాన్ని మదరసా సిలబస్‌లో తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి. మతాల తులనాత్మక అధ్యయనo మతపరమైన హింస మరియు ద్వేషంతో సహా అనేక సమస్యలను పరిష్కరిస్తుంది మరియు ఒకరి మతం, నమ్మకాలు మరియు ఆలోచనల పట్ల గౌరవాన్ని పెంచుతుంది.
భారతదేశంలో విభిన్న మత మరియు జాతుల సమూహాలు శాంతి మరియు సామరస్యంతో సహజీవనం చేసే బహుళ సమాజంలో జీవిస్తున్నాయి. సుఖ దుఃఖాలు పంచుకుంటాం. ఇతర మతాలు, విశ్వాసాలు, ఆచారాలు మరియు ఆలోచనలను అధ్యయనం చేయకపోతే సామాజిక దూరాలు మరియు అపార్థాలు పెరుగుతాయి.
ఇతర మతాల తులనాత్మక అధ్యయనo వల్ల సమాజంలో సమతుల్య ఆలోచన మరియు అభిప్రాయాలు ఖచ్చితంగా పెరుగుతాయి. సానుకూల మరియు సమతుల్య ఆలోచన యొక్క ప్రభావం శాశ్వతమైనది.తోటి దేశస్థుల మతానికి సంబంధించి జ్ఞానం కూడా పెంచుకోవాలని మనం ఎప్పటికీ మరచిపోకూడదు.
విభిన్న
నాగరికతలు, మతాలు, ఆచారాలు మరియు సంప్రదాయాలను
అధ్యయనం చేయడం అవసరం. ఇతర మతాలకు చేరువ కావాలంటే మదరసాలు మతాల తులనాత్మక అధ్యయన సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలి. మదర్సాలు సామాజిక ఐక్యత మరియు మత సమగ్రతకు కృషి చేయాలి
No comments:
Post a Comment