24 February 2025

భారతదేశ ముస్లిం జనాభా హిందువుల జనాభాను ఎప్పటికీ అధిగమించదు: నిపుణుడు India’s Muslim population will never surpass that of Hindus: Expert

 

భారతదేశంలో ముస్లిం జనాభా తగ్గుతోంది, పెరుగుతోంది అని  కాదు. జనాభా, జనాభా లెక్కలు మరియు సంతానోత్పత్తి ధోరణులపై ఉన్న అపోహలను నిపుణురాలు పూనమ్ ముట్రేజా త్రోసిపుచ్చింది.

దశాబ్దాలుగా, జనాభాలో ముస్లింలు హిందువులను అధిగమిస్తారనే వాదనలు వినిపిస్తున్నవి.. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముట్రేజా జనాభా డేటాను ఉపయోగించి  జనాభాలో ముస్లింలు హిందువులను అధిగమిస్తారనే వాదనను త్రోసిపుచ్చారు.

ముస్లిం జనాభా పెరుగుదల చారిత్రాత్మకంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్లు, పెరుగుతున్న విద్యా స్థాయిలు మరియు ఆర్థిక అంశాలు ముస్లిం జనాభా ను గణనీయంగా తగ్గించినవి అని పూనమ్ ముట్రేజా వివరించారు.


·       మతం ద్వారా నిర్ణయించబడని సంతానోత్పత్తి రేట్లు:

గతంలో అధిక ముస్లిం జనన రేట్ల ధోరణులు తక్కువ విద్యా స్థాయిలు మరియు అధిక పేదరికం ద్వారా నిర్ణయింపపబడుతున్నాయని ముట్రేజా అన్నారు.అయితే, ఇటీవలి డేటా ఈ అంతరాన్ని తగ్గిస్తున్నట్లు సూచిస్తుంది. "మీరు కేరళను చూస్తే, హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ మెరుగైన విద్య మరియు ఆదాయ స్థాయిలను కలిగి వారి సంతానోత్పత్తి రేట్లు దాదాపు ఒకేలా ఉనాయి." అని ముట్రేజా పేర్కొన్నారు


·       సంతానోత్పత్తిలో తగ్గుదల ఒక సమాజానికి ప్రత్యేకమైనది కాదు.

"బీహార్‌లో కూడా, పేదరికం మరియు విద్య లేకపోవడం వల్ల హిందూ జనన రేట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయి, సంఖ్యలు క్రమంగా తగ్గుతున్నాయి" అని ముట్రేజా అన్నారు.. సంతానోత్పత్తి రేటును నిర్ణయించడంలో మతం ప్రాథమిక అంశం కాదని ఆర్థిక మరియు విద్యా అవకాశాలు ముఖ్యమైనవి అని ముట్రేజా అన్నారు


·       ముస్లింలు ఎప్పుడూ హిందువుల కంటే ఎక్కువగా ఉండరు

జనాభా ధోరణుల ప్రకారం, భారతదేశంలో గరిష్ట ముస్లిం జనాభా వచ్చే శతాబ్దం నాటికి 18 శాతానికి చేరుకుంటుందని అంచనా వేయబడింది, ఇది ముస్లిములు హిందువులను అధిగమిస్తారనే వాదనను వాస్తవంగా తప్పు అని రుజువు చేస్తుంది. సంతానోత్పత్తి ధోరణులు ఎల్లప్పుడూ ఒక దిశలో - క్రిందికి కదులుతాయని ముట్రేజా వివరించారు.

"ఒకసారి సంతానోత్పత్తి రేట్లు తగ్గిన తర్వాత, ప్రభుత్వాలు ఏ విధానాలను ప్రవేశపెట్టినా సంతానోత్పత్తి రేట్లు మళ్లీ పెరగవు" అని జపాన్, రష్యా మరియు చైనా వంటి ప్రపంచ ఉదాహరణలను ఉటంకిస్తూ ముట్రేజా అన్నారు.


·       జనాభా తగ్గుదలలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది.

"ముస్లిం బాలికలు చదువుకుంటున్నారు మరియు విద్యావంతులైన మహిళలు తక్కువ మంది పిల్లలను కలిగి ఉంటారు" అని ముట్రేజా అన్నారు..ఈ ధోరణి అన్ని వర్గాలలో స్థిరంగా ఉంది మరియు ముస్లిం జనాభా ఎప్పటికీ హిందువులను అధిగమించకపోవడానికి ఇది ఒక ముఖ్య కారణం.

·       భయాన్ని రేకెత్తించే రాజకీయాలు

రాజకీయ నాయకులు తప్పుదారి పట్టించే కథనాలను ముందుకు తీసుకురావడానికి పాత జనాభా లెక్కల డేటాను ఉపయోగించుకుంటున్నారని ముట్రేజా ఆందోళన వ్యక్తం చేశారు. ముట్రేజా ప్రకారం, జనాభా పెరుగుదల  వాస్తవికత కంటే రాజకీయ సాధనంగా అయ్యింది.."విస్తృతమైన జనాభా డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, రాజకీయ చర్చలో జనాభా పెరుగుదల గురించి తప్పుదారి పట్టించే వాదనలు కొనసాగుతున్నాయి" అని ముట్రేజా వ్యాఖ్యానించింది.

·       భారతదేశానికి నవీకరించబడిన జనాభా గణన డేటా ఎందుకు అవసరం

భారతదేశం యొక్క చివరి జనాభా గణన 2011లో నిర్వహించబడింది మరియు 2021 జనాభా గణన పదేపదే ఆలస్యం అవుతోంది. నవీకరించబడిన జనాభా గణాంకాలు లేకుండా, విధాన రూపకల్పన లోపభూయిష్టంగా ఉంది. నిజమైన డేటా లేనప్పుడు తప్పుడు సమాచారం ప్రమాదం అని  ఇది వలస, పట్టణీకరణ మరియు ఉపాధి గురించి ప్రజలలో అపోహలకు దారితీస్తుందని ముట్రేజా హెచ్చరించారు. సీట్ల పంపిణీ, ఎన్నికల ప్రాతినిధ్యం మరియు వనరుల కేటాయింపుకు జనాభా గణన డేటా చాలా కీలకం. అని ముట్రేజా అన్నారు..


·       బలవంతపు విధానాలు పనిచేయవు

ప్రోత్సహకాలు మరియు ప్రోత్సాహకాల ఆధారంగా జనాభా నియంత్రణ చర్యలను ముట్రేజా గట్టిగా వ్యతిరేకించారు, అటువంటి విధానాలు మహిళలపై అసమానంగా భారం పడుతున్నాయని వాదించారు.

"చరిత్ర ప్రకారం, తక్కువ మంది పిల్లలను కనమని బలవంతం చేయడం పనిచేయదు. మహిళల పునరుత్పత్తి హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలి" అని ముట్రేజా నొక్కి చెప్పింది.

జనాభా విధానాలకు భారతదేశం మానవ కేంద్రీకృత విధానానికి కట్టుబడి ఉన్న 1994 కైరో ప్రకటనను ముట్రేజా ఉదహరించారు. అయితే, స్టెరిలైజేషన్‌కు ప్రోత్సాహకాలు వంటి బలవంతపు పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

"స్టెరిలైజేషన్ చేయించుకునే భారతీయ మహిళల్లో 77 శాతం మంది ఎప్పుడూ తాత్కాలిక గర్భనిరోధకాలను ఉపయోగించలేదు. ఇది ఎంపిక ద్వారా కాదు, మెరుగైన ఎంపికలకు ప్రాప్యత లేకపోవడం వల్ల" అని ముట్రేజా వెల్లడించింది.


·       విద్య మరియు ఆర్థిక సాధికారత పాత్ర

విద్య మరియు ఆర్థిక భాగస్వామ్యం తక్కువ సంతానోత్పత్తి రేటుకు నిజమైన కారకాలు. మతంతో సంబంధం లేకుండా, 12వ తరగతి పూర్తి చేసిన మహిళలు ఇద్దరు లేదా అంతకంటే తక్కువ మంది పిల్లలను కలిగి ఉండే అవకాశం ఉందని ముట్రేజా అన్నారు..

"మరోవైపు, పురుషులు ఎక్కువగా బాధ్యతారహితంగా మరియు కుటుంబ నియంత్రణలో పాల్గొనకుండా ఉన్నారు" అని ముట్రేజా పేర్కొంది. పితృస్వామ్య విధానం గర్భనిరోధకం, పిల్లల సంరక్షణ మరియు కుటుంబ నియంత్రణ భారాన్ని పూర్తిగా మహిళలపైనే వదిలివేస్తుంది.

భారతదేశం నిజంగా వికసిత్ భారత్‌గా మారాలంటే, విద్య, ఉద్యోగాలు మరియు ఆర్థిక స్వాతంత్ర్యం ద్వారా మహిళలు సాధికారత పొందాలని ముత్రేజా వాదించారు.

"మహిళలు శ్రామిక శక్తిలో చురుకుగా పాల్గొనకుండా ఏ దేశం ఆర్థిక విజయాన్ని సాధించలేదు" అని ముత్రేజా అన్నారు..

·       భయం కంటే వాస్తవాలు

ముస్లింలు హిందువులను అధిగమిస్తారనే అపోహను పూనమ్ ముత్రేజా త్రోసిపుచ్చారు. విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్థిక వృద్ధి - మతపరమైన భయాన్ని పెంచకపోవడం అనే అంశాల ఆధారంగా  భారతదేశ జనాభా విధానాలను రూపొందించాలని ముత్రేజా అన్నారు..

సమాజాలను విభజించే తప్పుదారి పట్టించే కథనాలను ముందుకు తీసుకురావడం కంటే, జనాభా లెక్కల డేటాను మెరుగుపరచడం, విద్యలో పెట్టుబడి పెట్టడం మరియు మహిళల పునరుత్పత్తి హక్కులను నిర్ధారించడంపై దృష్టి పెట్టాలని ముత్రేజా విధాన నిర్ణేతలను కోరారు.


మూలం:ది ఫెడరల్ న్యూస్, 19,Feb2025

రచయిత పూనం ముఖర్జీ,

తెలుగు సేత: సల్మాన్ హైదర్ 

No comments:

Post a Comment