ఉర్దూ, అరబిక్ మరియు పర్షియన్
గ్రంథాల యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడానికి 1914లో మౌలానా షిబ్లీ నోమానిచే ‘దారుల్
ముసన్నెఫిన్’ సంస్థ స్థాపించబడింది. దారుల్
ముసన్నెఫిన్ లేదా షిబ్లీ అకాడమీ, రాంపూర్‌లోని రాంపూర్ రజా
లైబ్రరీ లేదా పాట్నాలోని ఖుదా బక్ష్ లైబ్రరీ లాగా విస్తారమైన పుస్తకాల సేకరణ కలిగి ఉంది.
దారుల్ ముసన్నెఫిన్ లేదా షిబ్లీ అకాడమీ
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో ఉన్న ఒక పరిశోధనా అకాడమీ. ఉర్దూలో ప్రామాణికమైన
చారిత్రక సాహిత్యాన్ని సేకరించడం దీని లక్ష్యం, ఇది మొదట్లో దారుల్ ముసన్నెఫిన్‌గా
ప్రారంభించబడింది, కానీ
తరువాత దాని వ్యవస్థాపకుడు షిబ్లీ నోమాని పేరు పెట్టారు.
మౌలానా షిబ్లీ నోమాని, ఒక సున్నీ ముస్లిం పండితుడు
ఫిబ్రవరి 1914లో
అజంగఢ్‌లో ‘దారుల్ ముసన్నెఫిన్’ స్థాపించాడు; అజంగఢ్‌లో నోమాని మామిడి
తోటలో ‘దారుల్ ముసన్నెఫిన్’ స్థాపించబడింది. ఇది మౌలానా హమీదుద్దీన్ ఫరాహీ
మార్గదర్శకత్వంలో 21
నవంబర్ 1914న
పని చేయడం ప్రారంభించింది. దారుల్ ముసన్నెఫిన్ ఇతర వ్యవస్థాపకులు మౌలానా సయ్యద్
సులైమాన్ నద్వీ, మౌలానా
అబ్దుస్ సలామ్ నద్వీ మరియు మౌలానా మసూద్ అలీ నద్వీ. మౌలానా షిబ్లీ జూలై 1916లో మారిఫ్ అనే మాసపత్రిక కూడా స్థాపించినారు.
1914లో
షిబ్లీ అజంగఢ్ లో స్థాపించిన దారుల్ ముసన్నెఫిన్ అకాడమీ
ఓరియంటల్, ఇస్లామిక్
మరియు మధ్యయుగ భారతీయ అధ్యయనాలకు గర్వకారణమైన ప్రముఖ సంస్థ. దారుల్ ముసన్నెఫిన్ అకాడమీ
తొమ్మిది ఎకరాల విస్తీర్ణం లో ఉన్నది. దారుల్ ముసన్నెఫిన్ అకాడమీ 1.5 లక్షలకు పైగా పుస్తకాలు
మరియు సుమారు 700 అరుదైన
మాన్యుస్క్రిప్ట్‌లతో కూడిన భారీ లైబ్రరీని కలిగి ఉన్న అందమైన తెల్లని భవనం. దారుల్ ముసన్నెఫిన్ అకాడమీ
లో కార్యాలయం, సిబ్బంది నివాసాలు, మసీదు మరియు సమావేశ మందిరం
వేరుగా ఉన్నాయి.
మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మరియు అనేకమంది ఇతర భారతీయ మరియు
విదేశీ ప్రముఖులు షిబ్లీ అకాడమీ లైబ్రరీ దర్శించారు. షిబ్లీ అకాడమీ రామాయణం మరియు మహాభారతం యొక్క పర్షియన్
అనువాదాలతో సహా అరుదైన పుస్తకాలు మరియు మాన్యుస్క్రిప్ట్‌లను కలిగి ఉంది. మొఘల్ యువరాజు దారా షికో ద్వారా ఉపనిషత్తుల
పర్షియన్ అనువాదం ‘సిర్-ఎ-అక్బర్’, కలిగి ఉంది. ఈ అరుదైన పుస్తకాలు బంగారు
అంచుతో అలంకరించబడిన శీర్షికలు మరియు పేజీలు కలిగి ఇప్పటికీ వాటి మెరుపును నిలుపుకున్నాయి.
దారా సోదరి జహనారా రచించిన సూఫీ సన్యాసి ఖ్వాజా
మొయినుద్దీన్ చిష్తీపై ‘మోనిసుల్ అర్వా’ అనే పుస్తకం షిబ్లీ అకాడమీ లైబ్రరీ కలిగి ఉంది. అత్యంత విలువైన ‘మోనిసుల్ అర్వా’ పారిస్‌లోని అరుదైన
మాన్యుస్క్రిప్ట్‌ల అంతర్జాతీయ ప్రదర్శనకు వెళ్లింది".
షిబ్లీ అకాడమీ లైబ్రరీ లో మహాత్మా గాంధీ, మదన్ మోహన్ మాలవ్య మరియు
మౌలానా ఆజాద్‌లతో సహా అనేక మంది ప్రసిద్ధ సందర్శకుల సాక్ష్యాల testimonies నమోదు విభాగం ఉంది. మోతీలాల్ నెహ్రూ మరియు జవహర్‌లాల్
నెహ్రూ, అజంగఢ్
సందర్శనల సమయంలో అనేక సార్లు షిబ్లీ అకాడమీ లో బస చేశారు.
షిబ్లీ అకాడమీ లైబ్రరీ మరొక ప్రసిద్ధ సందర్శకురాలు
స్వాతంత్ర్య సమరయోధులు ముహమ్మద్ అలీ జౌహర్ మరియు షౌకత్ అలీల తల్లి, బి అమ్మ, ముహమ్మద్ అలీ జౌహర్ మరియు షౌకత్ అలీ, అలీ
సోదరులుగా ప్రసిద్ధి చెందిన ఖిలాఫత్ ఉద్యమ నాయకులు.
“దారుల్ ముసన్నెఫిన్ లేదా షిబ్లీ అకాడమీ” అరబిక్, పర్షియన్ మరియు ఉర్దూ నుండి
ఇతర భారతీయ భాషలు మరియు ఆంగ్లంలోకి టైటిళ్ల అనువాదం మరియు డిజిటలైజేషన్ ప్రక్రియను ను వేగవంతం చేస్తుంది.
“దారుల్
ముసన్నెఫిన్ లేదా
షిబ్లీ
అకాడమీ” యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఇస్లాం యొక్క శాస్త్రీయ, ప్రామాణికమైన చరిత్ర మరియు
హేతుబద్ధమైన వివరణలను రక్షించడం మరియు ప్రచారం చేయడం. ఇది హిందూ-ముస్లిం
సామరస్యాన్ని, లేదా
గంగా-జమునీ తెహజీబ్ ను సమర్థిస్తుంది
స్వాతంత్ర్యానికి ముందు, “దారుల్ ముసన్నెఫిన్ లేదా షిబ్లీ అకాడమీ” హైదరాబాద్
నిజాం, భోపాల్
నవాబ్ మరియు ఇతరుల నుండి గ్రాంట్లు పొందింది.
No comments:
Post a Comment