భారతదేశ పట్టణ భౌగోళిక ముఖ్య లక్షణం ముస్లిం ఘెట్టో. దశాబ్దాలుగా, హింస కు గురిఅవుతున్న భారతీయ పట్టణ ముస్లిములు ఘెట్టోలలో
నివసిస్తున్నారు. ఇక్కడ చెత్తతో నిండి దట్టంగా రద్దీగా ఉండే ఆవాసాలు, గుంతలు పడిన ఇరుకైన దారులు మరియు బహిరంగ మురుగునీటి
కాలువలు మరియు పాఠశాలలు, ఆసుపత్రులు, మురుగునీటి పారుదల, నీరు మరియు విద్యుత్ సరఫరా వంటి ప్రజా సేవలు అల్పంగా,
నామమాత్రంగా ఉండును. మతపరమైన
అల్లర్లు, సామాజిక తరగతి, విద్య మరియు హోదాతో సంబంధం లేకుండా
నగరాల్లో ముస్లింలలో ఘెట్టోయిజేషన్‌కు
దారితీశాయి
చాలా కాలంగా పట్టణ జీవనంలో
సాధారణీకరించబడిన లక్షణంగా ఉంది. ముస్లింలు సాధారణంగా పట్టణ ప్రాంతాలలో పేద ప్రదేశాలలో
నివసిస్తున్నారు.
శ్రామిక పేదలు మాత్రమే కాదు, ధనిక మరియు మధ్యతరగతి ముస్లింలు కూడా వేరు చేయబడిన ఘెట్టోలలో ఎందుకు
నివసిస్తున్నారు?
చాలా మంది ముస్లింలు తమ మతం మరియు సాంస్కృతిక ఆచారాలను పంచుకునే వ్యక్తులతో
మాత్రమే జీవించడానికి అలవాటుపడ్డారని కొందరు భావిస్తున్నారు. అనేక అధ్యయనాలు
ముస్లింలు మిశ్రమ పొరుగు ప్రాంతాల నుండి మినహాయించబడ్డారు, బహిష్కరించబడ్డారు అని రుజువు చేసాయి. మత హింస దీనికి
కారణం కావచ్చు. లేదా ముస్లిం గుర్తింపు ఉన్న వ్యక్తులకు ఇళ్లను విక్రయించడానికి
లేదా అద్దెకు ఇవ్వడానికి ముస్లిమేతరులు తరచూ ఇష్టపడకపోవడం వల్ల కావచ్చు, అనేక రాష్ట్రాల్లో మినహాయింపు చట్టాలు మరియు ప్రభుత్వ
విధానాలు exclusionary laws and state policies దీనికి మరింత సహాయపడింది.
ఆక్స్‌ఫర్డ్‌లో సమానత్వ చట్ట పండితుడు ఫైజాన్ అహ్మద్, "ముస్లింలు ఘెట్టోలో నివసించడానికి ఎంచుకోరు, బదులుగా 'ఘెట్టో' చారిత్రక బహిష్కరణ exclusion ఫలితంగా సృష్టించబడింది అని పేర్కొన్నాడు.
అహ్మదాబాద్, హైదరాబాద్ తరువాత ఢిల్లీలలో ముస్లింల విభజనsegregation of Muslims ఎక్కువగా ఉందని మానవ శాస్త్రవేత్త Anthropologist రాఫెల్ సుసేవిండ్ కనుగొన్నారు.
పట్టణ ప్రాంతాలలోని ‘ఘెట్టో'లలో నివసించడం ముస్లింలకు భద్రత కోసం తప్పనిసరి
అయింది". ముస్లిములు నివసించే ప్రదేశాలు
"సామూహిక సున్నితమైనవి" మరియు "సమస్యల మండలాలు" అనే కళంకాన్ని
పొందాయి.
భారతదేశములో మత హింస యొక్క ప్రతి ఎపిసోడ్ ముస్లింలను ఘెట్టో యొక్క భద్రతను
కోరుకునేలా చేస్తుంది. జస్టిస్
సచార్ నేతృత్వంలోని ముస్లింల పరిస్థితిని విచారించడానికి ప్రధానమంత్రి మన్మోహన్
సింగ్ నియమించిన కమిటీ 2006 నాటి తన నివేదికలో "వారి భద్రత కోసం భయపడి, ముస్లింలు దేశవ్యాప్తంగా ఘెట్టోలలో నివసించడానికి
ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మతపరంగా సున్నితమైన పట్టణాలు మరియు నగరాల్లో ఇది మరింత
స్పష్టంగా కనిపిస్తుంది" అని పేర్కొంది.
మతపరమైన అల్లర్లలో ప్రాణాలతో బయటపడిన వారు నగరంలోని రద్దీగా ఉండే నివాసాలకు
లేదా “సరైన మౌలిక సదుపాయాలు లేని నగరాల శివార్లకు” తరలివెళతారు, ఇవి “సరిపోని గృహాలు, పేలవమైన పారిశుధ్యం మరియు పరిశుభ్రమైన నీటికి పరిమిత ప్రాప్యత” కలిగి విద్య మరియు అరుదైన ఆరోగ్య సంరక్షణ మరియు దెబ్బతిన్న జీవనోపాధిని మరింత దెబ్బతీస్తాయి.
ఆధునిక ముస్లిం ఘెట్టోల
యొక్క ప్రముఖ లక్షణం ముస్లిం మధ్యతరగతి ఉనికి అని సారా అథర్ పేర్కొన్నారు.
ఘెట్టోలు సాధారణంగా ఆర్థిక వైవిధ్యతను జాతి సజాతీయతతో combine economic heterogeneity with ethnic homogeneityమిళితం చేస్తాయి.
కొన్నిసార్లు భవిష్యత్తులో జరగబోయే హింస భయం ప్రజలను ఘెట్టోకు వెళ్లడానికి
ప్రేరేపిస్తుంది. నగరాల్లోని మిశ్రమ పరిసరాల్లో గదులు మరియు అపార్ట్‌మెంట్‌లను
అద్దెకు తీసుకోవడానికి ముస్లిములు చేసిన ప్రయత్నాలు ఎంత కష్టతరమైనవి, బాధాకరమైనవి, అవమానకరమైనవి మరియు తరచుగా విచారకరంగా ఉన్నాయో మనలో చాలా మందికి తెలుసు. .
చాలా మంది పట్టణ ముస్లిం నివాసితులను ఘెట్టోలుగా సమూహపరచడానికి ఇది మరొక ప్రధాన
కారణం.
న్యాయ పండితుడు మొహ్సిన్ ఆలం భట్ నేతృత్వంలోని హౌసింగ్ డిస్క్రిమినేషన్
ప్రాజెక్ట్ అనే అధ్యయనం గృహ వివక్షతను అధ్యయనం చేసింది. అధ్యయనం ప్రకారం "భారతదేశంలోని నగరాల్లో, పొరుగు ప్రాంతాలు neighbourhoods ముస్లింలు మరియు దళితులను దూరంగా ఉంచుతూనే ఉన్నాయి.
గృహ యజమానులు మరియు సహకార గృహ సంఘాలు వారికి అపార్ట్‌మెంట్‌లను అద్దెకు ఇవ్వడానికి
నిరాకరిస్తాయి. గృహనిర్మాణంలో వివక్షత చాలా సాధారణమైంది”.
ముస్లిం నివాసితులను మంచి ప్రజా సేవలు మరియు సామాజిక సమైక్యతను పొందకుండా ఘెట్టోలలో నివసించమని బలవంతం చేయడం
వినాశకరమైనది. "చారిత్రక కారణాల వల్ల మరియు పెరుగుతున్న అభద్రతా భావం కారణంగా
కేంద్రీకృతమై ఉన్న ప్రాంతాలలో కలిసి నివసిస్తున్న ముస్లింలు మునిసిపల్ మరియు
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంకు సులభంగా గురయ్యారు" అని సచార్ కమిటీ నివేదించింది.
ఈ ప్రాంతంలో నీరు, పారిశుధ్యం, విద్యుత్, పాఠశాలలు, ప్రజారోగ్య సౌకర్యాలు, బ్యాంకింగ్
సౌకర్యాలు, అంగన్‌వాడీలు, రేషన్ దుకాణాలు, రోడ్లు మరియు రవాణా సౌకర్యాలు అన్నీ కొరతగా
ఉన్నాయి".
ఫర్జానా
అఫ్రిది ప్రకారం, “విభజన Segregation మత హింస సమయంలో
మైనారిటీ వర్గాలను సులభంగా లక్ష్యంగా చేసుకోడమే కాకుండా, ప్రజా వస్తువులు మరియు సేవలను పొందడంపై
బలమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
సామ్ ఆషర్ (ఇంపీరియల్ కాలేజ్, లండన్), కృతార్థ్ ఝా (డెవలప్‌మెంట్ డేటా ల్యాబ్), అంజలి అదుకియా (చికాగో విశ్వవిద్యాలయం), పాల్ నోవోసాద్ (డార్ట్‌మౌత్ కాలేజ్) మరియు బ్రాండన్ టాన్ (అంతర్జాతీయ
ద్రవ్య నిధి) రాసిన "భారతదేశంలో నివాస విభజన మరియు అసమాన స్థానిక ప్రజా
సేవలకు అసమాన ప్రాప్యత Residential Segregation and Unequal Access to Local Public Services in
India" అనే
పత్రంలో ప్రజా సేవా కేటాయింపులో అసమానత క్రమబద్ధంగా ఉందని కనుగొంది..
భారతదేశంలోని ముస్లింలు మరియు దళితుల విషయంలో కూడా తిరస్కరణ denial ఒకేలా ఉందని అధ్యయనం వెల్లడించింది. పాఠశాలలు, ఆరోగ్య సేవలు, పైపు నీరు మరియు మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాల పరంగా భారతీయ నగరాల్లో దళితులు మరియు ముస్లింల పట్ల విభజన (segregation) పెరుగుతోందని తాజా అధ్యయనం కనుగొంది.
భారత పరిశోధన ప్రాజెక్ట్ ముస్లింలు లేదా
దళితులు అధిక సంఖ్యలో ఉన్న పొరుగు ప్రాంతాలలో ప్రభుత్వం అందించే ప్రజా సేవలు
తక్కువగా ఉన్నాయని కనుగొంది. మాధ్యమిక పాఠశాలలు, క్లినిక్‌లు
మరియు ఆసుపత్రులు, విద్యుత్, నీరు
మరియు మురుగునీటి పారుదలతో సహా దాదాపు ప్రతి సేవకు ఇదే పరిస్థితి. 100% ముస్లిం
జనాభా ఉన్న ప్రాంతంలో పెరుగుతున్న పిల్లవాడు 0% ముస్లిం జనాభా ఉన్న ప్రాంతంలో
పెరుగుతున్న పిల్లవాడి కంటే రెండు సంవత్సరాల తక్కువ విద్యను పొందుతున్నాడు..
సామాజిక సద్భావన మరియు అవగాహనకు కూడా
విభజన
Segregation
ఒక పెద్ద అవరోధం. ఎడిటర్ కాషిఫ్-ఉల్-హుడా,
ప్రకారం “హిందువులు
మరియు ముస్లింలు వారి సమాజాలలో ఘెట్టోయిజ్ చేయబడుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
ఇది బహువచన భారతదేశ భవిష్యత్తుకు కలవరపెట్టే ధోరణి.”
విభిన్న వర్గాల ప్రజల
మధ్య పరస్పర చర్య మరియు స్నేహా౦ బాగా తగ్గుతున్న పరిస్థితులలో ముస్లింల "మానసిక ఘెట్టోయిజేషన్"
గురించి సారా అథర్ ఉద్వేగభరితంగా రాశారు. “
మోహ్సిన్ ఆలం భట్ రాసిన బాధాకరమైన విచారంతో నేను ముగిస్తాను..
హిందూ-మెజారిటీ పొరుగు ప్రాంతాలలో అద్దె గృహాల నుండి భారతీయ ముస్లింలను
క్రమబద్ధంగా బహిష్కరించడం ప్రతిరోజూ ముస్లింలకు "ఎవరికి చెందినది, ఎవరికి చెందనది of who belongs, and who does
not”.అని
గుర్తుచేస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి విశ్వాసం,
కులం
మరియు గుర్తింపు ఉన్న ప్రజలకు సమాన హక్కులు కలిగిన దేశాన్ని నిర్మించాలని భారత
రాజ్యాంగం ప్రతిజ్ఞ చేసింది. కానీ భారతీయులు తమ జీవితాలను గడిపే విధానాలలో -
మెజారిటీ మతం మరియు ప్రత్యేక కులాల ప్రజలు, మన పొరుగు ప్రాంతాలు,
మన
పాఠశాలలు మరియు మన జీవితాల నుండి దళితులు మరియు ముస్లింలను బహిష్కరిస్తున్న
విధానాలలో - భారతీయ నగరాలు మరియు భారతీయ గ్రామాలు అధిక పక్షపాతంతో వేరు చేయబడిన వర్ణవివక్ష
ఆవాసాలుగా apartheid
habitats segregated ఉన్నాయి.
తెలుగు సేత: సల్మాన్ హైదర్
No comments:
Post a Comment