1857 స్వాతంత్ర్య ఉద్యమంలో పదకొండు నెలల పాటు రోహిల్‌ఖండ్ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేసినాడు నవాబ్ ఖాన్ బహదూర్ ఖాన్. నవాబ్ ఖాన్ బహదూర్ బరేలీని మాత్రమే కాకుండా చుట్టుపక్కల 9 జిల్లాలను కూడా పరిపాలించాడు. నవాబ్ ఖాన్ బహదూర్ ఖాన్ ధైర్యం మరియు త్యాగానికి గొప్ప ఉదాహరణగా నిలిచాడ
ఖాన్ బహదూర్ ఖాన్ 1857 విప్లవ
వీరుడు. ఖాన్ బహదూర్ ఖాన్ 1791లో నవాబ్ కుటుంబంలో జన్మించాడు. ఖాన్ బహదూర్ ఖాన్ రోహిల్లా
సర్దార్ హఫీజ్ రెహమత్ ఖాన్ మనవడు.
1857 మే 10న మీరట్‌లో విప్లవ నినాదం
లేవనెత్తబడింది మరియు దాని వార్త మే 14న బరేలీకి చేరినప్పుడు, బరేలీ లో కూడా బ్రిటిష్
వారికి వ్యతిరేకం గా విప్లవ సన్నాహాలు ముమ్మరం చేయబడ్డాయి. మే 31న, ఖాన్ బహదూర్ ఖాన్
మరియు అతని జనరల్స్ మరియు సైనికులు సుబేదార్ బఖ్త్ ఖాన్ నేతృత్వంలో బ్రిటిష్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించారు.
అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ మేజిస్ట్రేట్, సివిల్ సార్జెంట్, జైలు
సూపరింటెండెంట్ మరియు బరేలీ కళాశాల ప్రిన్సిపాల్ "సి.బుక్"ను
విప్లవకారులు చంపారు. సాయంత్రం ఐదు గంటల నాటికి, విప్లవకారులు బరేలీ డివిజన్‌ను తమ
ఆధీనంలోకి తీసుకున్నారు.
జూన్ 1న, విప్లవకారులు
విజయోత్సవ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు కొత్వాలి చేరుకోగానే, పెద్ద సంఖ్యలో
బరేలీ పౌరులు ఖాన్ బహదూర్ ఖాన్‌కు పట్టాభిషేకం చేసి, ఆయనను బరేలీ డివిజన్ నవాబుగా
ఎన్నుకున్నారు.
బ్రిటిష్ ప్రభుత్వం అనేక దురాగతాలు
మరియు దుర్వినియోగాలు చేసినప్పటికీ, శక్తివంతమైన పాలకుడిగా బరేలీ డివిజన్‌ను పదకొండు నెలల
పాటు బ్రిటిష్ ప్రభుత్వ పాలన నుండి విముక్తి కల్పించడం నవాబ్ ఖాన్ బహదూర్ ఖాన్
ధైర్యసాహసాలకు ఉదాహరణ.
తరువాత, బ్రిటిష్ ప్రభుత్వం
నవాబ్ ఖాన్ బహదూర్ ఖాన్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టి, ఫిబ్రవరి 24, 1860న, బరేలి పట్టణ కొత్వాలికి
తీసుకువచ్చి అదే రోజు ఉదయం 7:10 గంటలకు ఉరితీశారు.ఉరితీసిన తర్వాత బరేలి నగరంలో
ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ఉండటానికి, నవాబ్ ఖాన్ బహదూర్ ఖాన్ మృతదేహాన్ని జిల్లా జైలు ఆవరణలో
ఖననం చేశారు.
No comments:
Post a Comment