27 February 2025

20వ శతాబ్దపు 34 ప్రముఖ ముస్లిం సంస్కర్తలు 34 Prominent Muslim Reformers of The 20th Century

 



ఇస్లామిక్ ప్రపంచంలో అనేక శతాబ్దాల మేధో క్షీణత మరియు దీర్ఘకాలిక స్తబ్దత తర్వాత, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు మహమ్మద్ అబ్దుహ్ వంటి అనేక మంది 19వ శతాబ్దపు పండితులు ముస్లింలకు వారి గొప్ప మేధో వారసత్వాన్ని మరియు వారి ప్రస్తుత వెనుకబాటుతనం యొక్క వాస్తవికతను గుర్తు చేయడానికి చొరవ తీసుకున్నారు.

 ముస్లింలలో ఏర్పడిన మేధో క్షీణత సైన్స్ మరియు ఆధునిక ప్రపంచం నుండి వారి నిర్లిప్తత నుండి ఉద్భవించిందని వారు నొక్కి చెప్పారు. ముస్లిం సమాజ సంస్కర్తలు భారతదేశం మరియు ఇస్లామిక్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఆధునిక ముస్లిం విద్యకు పునాది వేశారు.

ఇస్లామిక్ సూత్రాలు ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులతో సహా ఆధునిక విలువలకు అనుకూలంగా ఉన్నాయని ముస్లిం సమాజాన్ని ఒప్పించడానికి ముస్లిం సమాజ సంస్కర్తలు, పండితులు అవిశ్రాంతంగా కృషి చేశారు. ముస్లిం సమాజ సంస్కర్తల ప్రయత్నాలు ముస్లిం ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల స్థాపనకు దారితీశాయి, ఇవి ప్రగతిశీల ఆలోచన మరియు అభ్యాసానికి కేంద్రాలుగా మారాయి

ఇస్లామిక్ ప్రపంచంలో సైన్స్ పురోగతికి, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికి, హేతుబద్ధమైన ఆలోచనను, మేధో విచారణను ప్రోత్సహించడానికి  ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దోహదపడిన 34 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా ఇక్కడ ఉంది.

 

20వ శతాబ్దపు ప్రముఖ ముస్లిం సంఘ సంస్కర్తలు

 

1. అబ్దుల్ మజీద్ దర్యాబాది (1892–1977, భారతదేశం) -- ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు, పాత్రికేయుడు మరియు ఖురాన్ వ్యాఖ్యాత అయిన అబ్దుల్ మజీద్ దర్యాబాది సాంప్రదాయ ఇస్లామిక్ విద్వత్తు మరియు ఆధునిక మేధో విచారణ యొక్క అరుదైన కలయిక..

2. అబ్దుల్ మాలిక్ కరీం అమ్రుల్లా (హంకా) (1908–1981, ఇండోనేషియా) -- అబ్దుల్ మాలిక్ కరీం అమ్రుల్లా (హంకా) హేతుబద్ధమైన ఇస్లామిక్ ఆలోచనను సమర్థించారు మరియు అంధ సాంప్రదాయవాదాన్ని వ్యతిరేకించారు.

3. అబుల్ హసన్ అలీ హసాని నద్వి, మౌలానా (1914–1999, భారతదేశం) -- అబుల్ హసన్ అలీ హసాని నద్వి, మౌలానా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇస్లామిక్ పండితుడు, గొప్ప రచయిత మరియు లక్నోలోని నద్వతుల్ ఉలేమా ఛాన్సలర్‌గా పనిచేశారు. 16వ శతాబ్దం తర్వాత, ముస్లింలు శాస్త్రీయ విచారణపై ఆసక్తిని కోల్పోయారని మరియు మెటాఫిజికల్ శాస్త్రాలపై ఎక్కువ దృష్టి సారించారని, ఇది ముస్లిముల మేధో పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మౌలానా నద్వి గమనించారు.

4. అబుల్ కలాం ఆజాద్ (1888–1958, భారతదేశం) -- భారతదేశపు మొట్టమొదటి విద్యా మంత్రి,అయిన అబుల్ కలాం ఆజాద్ ఉన్నత శాస్త్రీయ అధ్యయనం కోసం సంస్థలు మరియు కళాశాలలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.

5. అహ్మద్ దహ్లాన్ (1868–1923, ఇండోనేషియా) -- అహ్మద్ దహ్లాన్ ఇండోనేషియాలో ముహమ్మదియా ఉద్యమ స్థాపకుడు. అహ్మద్ దహ్లాన్ ఆధునిక విద్య మరియు ఖురాన్ మరియు సున్నత్‌లకు  ముస్లింసమాజం తిరిగి రావడాన్నిగురించి  నొక్కి చెప్పారు. అహ్మద్ దహ్లాన్ ప్రారంభించిన ఉద్యమం ఇండోనేషియాలో వందలాది పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ఆసుపత్రుల స్థాపనకు దారితీసింది.

6. అలెగ్జాండర్ రస్సెల్ వెబ్ (1846–1916, USA) -- ఇస్లాం మతంలోకి మారిన మొదటి ప్రముఖ అమెరికన్లలో ఒకరైన అలెగ్జాండర్ రస్సెల్ వెబ్ తన రచనలు, ఉపన్యాసాలు మరియు మతాంతర సంభాషణల ద్వారా పశ్చిమ దేశాలలో ఇస్లాంను ప్రోత్సహించారు.

7. అలీ షరియాతి మజినాని (1933–1977, ఇరాన్) -- ఇస్లామిక్ ఆలోచనలను సోషలిస్ట్ మరియు విప్లవాత్మక ఆదర్శాలతో మిళితం చేసి, రాజకీయ మరియు మత సంస్కరణ ఉద్యమాలకు అలీ షరియాతి మజినాని ప్రేరణనిచ్చింది.

8. బషీర్ హుస్సేన్ జైదీ, కల్నల్ (1898–1982, భారతదేశం) -- అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ అయిన  బషీర్ హుస్సేన్ జైదీ అలీఘర్ విశ్వవిద్యాలయం యొక్క విద్యా కార్యక్రమాలు మరియు పరిశోధన కార్యక్రమాల విస్తరణలో, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రాల అభివృద్దిలో కీలక పాత్ర పోషించారు.

9. బుర్హానుద్దీన్ అల్-హెల్మీ (1911–1969, మలేషియా) -- మలేషియా స్వాతంత్ర్యం మరియు ఆధునిక ఇస్లామిక్ ఆధారిత పాలనా వ్యవస్థ స్థాపన కోసం బుర్హానుద్దీన్ అల్-హెల్మీకృషి చేసారు..

10. ఫజ్లుర్ రెహమాన్ మాలిక్ (1919–1988, పాకిస్తాన్) -- ఫజ్లుర్ రెహమాన్ మాలిక్ స్వతంత్ర తార్కికం (ఇజ్తిహాద్) పునరుజ్జీవనాన్ని నొక్కి చెప్పిన ఉదారవాద సంస్కర్త. ఖురాన్ ఆదేశాలను నెరవేర్చినందున ముస్లిం ప్రపంచంలో సైన్స్ ఒకప్పుడు అభివృద్ధి చెందిందని ఫజ్లుర్ రెహమాన్ మాలిక్ అన్నారు..

11. గమల్ అబ్దేల్ నాసర్ (1918–1970, ఈజిప్ట్) -- టిటో మరియు నెహ్రూలతో పాటు అలీన ఉద్యమంలో నాసర్ ప్రముఖ  నాయకుడు. నాసర్ అంతర్జాతీయ శాంతి కోసం పనిచేశాడు మరియు ఈజిప్టులో ఆధునీకరణను ప్రోత్సహించాడు.

12. హకీమ్ అజ్మల్ ఖాన్ (1868–1927, భారతదేశం) -- బహుముఖ వ్యక్తిత్వంకలిగిన హకీమ్ అజ్మల్ ఖాన్ - వైద్యుడు, పండితుడు మరియు జాతీయవాద నాయకుడు. మూలికా వైద్యం అభివృద్ధిలో హకీమ్ అజ్మల్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు మరియు ఢిల్లీలో ఆయుర్వేద మరియు యునాని టిబ్బియా కళాశాలను స్థాపించాడు. హకీమ్ అజ్మల్ ఖాన్ జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపకులలో ఒకడు.

13. హసన్ అల్-బన్నా (1906–1949, ఈజిప్ట్) -- ఇస్లామిక్ సూత్రాలలో మిళితమైన ఆధునిక పాలనను స్థాపించడానికి హసన్ అల్-బన్నా ప్రయత్నించారు  మరియు ముస్లిం బ్రదర్‌హుడ్‌ను స్థాపించారు.

14. హసీమ్ అస్యారి (1871–1947, ఇండోనేషియా) -- ఇండోనేషియాలోని అతిపెద్ద ఇస్లామిక్ సంస్థ అయిన నహ్ద్లాతుల్ ఉలామా వ్యవస్థాపకుడు అయిన  హసీమ్ అస్యారి సాంప్రదాయవాదం మరియు ఆధునికవాదం మధ్య సమతుల్యత కోసం కృషి చేసారు.

15. హుస్సేన్ అహ్మద్ మదానీ (1879–1957, భారతదేశం) -- భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో హుస్సేన్ అహ్మద్ మదానీ ముఖ్యమైన పాత్ర పోషించారు మరియు హిందూ-ముస్లిం ఐక్యతకు బలమైన సమర్ధకుడు.

16. ఇస్మాయిల్ అల్-ఫరూకి (1921–1986, పాలస్తీనా/USA) -- ఇస్లామిక్ అధ్యయనాలు మరియు మతాంతర సంభాషణలలో కృషి చేసిన  ఇస్మాయిల్ అల్-ఫరూకి గొప్ప పండితుడు. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇస్లామిక్ థాట్ (IIIT)ను ఇస్మాయిల్ అల్-ఫరూకి స్థాపించారు.

17. కెమాల్ అటాతుర్క్ (1881–1938, టర్కీ) -- టర్కీ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు మరియు మొదటి అధ్యక్షుడు అయిన కెమాల్ అటాతుర్క్. టర్కీ విద్యా వ్యవస్థను ఆధునీకరించారు, యూరోపియన్ జీవన విధానాలను ప్రోత్సహించారు, టర్కీ లో లాటిన్ వర్ణమాలను ప్రవేశపెట్టారు మరియు మహిళా విముక్తి emancipation ని ప్రోత్సహించారు.

18. మాల్కం X (ఎల్-హజ్ మాలిక్ ఎల్-షబాజ్) (1925–1965, USA) -- మాల్కం X ఇస్లాంను స్వీకరించారు మరియు ఇస్లామిక్ చట్రంలో జాతి సమానత్వాన్ని ప్రోత్సహించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో ఐక్యత కోసం మాల్కం Xకృషి చేసారు..

19. మాలెక్ బెన్నాబి (1905–1973, అల్జీరియా) -- ఇస్లామిక్ నాగరికత క్షీణతకు మేధోపరమైన సృజనాత్మకత మరియు కొత్త ఆలోచనలు లేకపోవడం కారణమని మాలెక్ బెన్నాబిఅన్నారు.  వ్యక్తులకు సాధికారత కల్పించే వాతావరణం యొక్క అవసరాన్ని మాలెక్ బెన్నాబి నొక్కి చెప్పారు.

20. మెహ్మెట్ అకిఫ్ ఎర్సోయ్ (1873–1936, టర్కీ) -- ఇస్లామిక్ ఆధునికవాది, కవి మరియు టర్కీ జాతీయ గీత రచయిత. మెహ్మెట్ విద్య మరియు నైతిక సంస్కరణల ద్వారా ఇస్లామిక్ పునరుజ్జీవనాన్ని సమర్థించారు.

21. మొహమ్మద్ నట్సీర్ (1908–1993, ఇండోనేషియా) -- ఇస్లామిక్ ఆలోచనాపరుడు, రాజకీయ నాయకుడు అయిన మొహమ్మద్ నట్సీర్. ప్రజాస్వామ్యం, విద్య మరియు ఇస్లామిక్-ఆధారిత బహుత్వ సమాజాన్ని సమర్ధించారు.

22. ముహమ్మద్ అలీ, మౌలానా (1878–1931, భారతదేశం) -- ఖిలాఫత్ ఉద్యమానికి ప్రముఖ నాయకుడు మరియు మహాత్మా గాంధీకి సన్నిహితుడు అయిన మౌలానా ముహమ్మద్ అలీ  హిందూ-ముస్లిం ఐక్యత మరియు దేశ స్వాతంత్ర్య౦ కోసం బలంగాకృషి చేసారు..

23. మొహమ్మద్ హుస్సేన్ హైకల్ (1888–1956, ఈజిప్ట్) -- ఇస్లామిక్ నాగరికత చారిత్రాత్మకంగా సైన్స్ మరియు హేతువాదంపై నిర్మించబడిందని మొహమ్మద్ హుస్సేన్ హైకల్ అన్నారు.. హైకల్ ది లైఫ్ ఆఫ్ ముహమ్మద్ (హయత్ ముహమ్మద్) రచయిత.

24. ముహమ్మద్ అసద్ (1900–1992, ఆస్ట్రియా/పాకిస్తాన్) -- ముహమ్మద్ అసద్ ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి మరియు ది రోడ్ టు మక్కా రచయిత. ఆధునిక పాలనలో ఇస్లామిక్ విలువల పునరుజ్జీవనం కోసం ముహమ్మద్ అసద్  కృషి  చేసారు..

25. ముహమ్మద్ ఇక్బాల్ (1877–1938, భారతదేశం) -- ఇజ్తిహాద్ మరియు విద్య ఆధారంగా సంస్కరించబడిన ముస్లిం గుర్తింపును ఊహించిన తత్వవేత్త మరియు కవి. ఉమ్మా సవాళ్లకు విద్య కీలక పరిష్కారం అని ముహమ్మద్ ఇక్బాల్ అన్నారు.

26. ముహమ్మద్ రషీద్ రిడా (1869–1935, ఈజిప్ట్) --ముహమ్మద్ రషీద్ రిడా ఆధునికీకరణ ప్రయత్నాలకు నాయకత్వం వహించారు  మరియు విజ్ఞాన శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యతను సమర్థించారు.

27. ముసా బిగివ్ (1870–1949, టాటర్‌స్తాన్) -- "ఇస్లామిక్  లూథర్" గా పిలబడే ముసా బిగివ్ విద్యా మరియు మతపరమైన సంస్కరణల కోసం ప్రారంబించిన జాదిద్ ఉద్యమంలో కీలక వ్యక్తి.

28. సయీద్ నూర్సీ (1877–1960, టర్కీ) -- సయీద్ నూర్సీ శాంతియుత ఇస్లామిక్ పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించారు, ఆధునిక శాస్త్రంతో ఇస్లాం యొక్క అనుకూలతను నొక్కి చెప్పారు. 

29. షేక్ మహమూద్ షల్తుట్ (1893–1963, ఈజిప్ట్) -- అబ్దుహ్ ఆలోచనా విధానంలో ప్రముఖ పండితుడు అయిన  షేక్ మహమూద్ షల్తుట్ అల్-అజార్ యొక్క గ్రాండ్ ఇమామ్.  

30. షిబ్లి నోమాని (1857–1914, భారతదేశం) -- షిబ్లి నోమాని ఆధునిక దృక్పథం కలిగిన ఇస్లామిక్ పండితుడు. అజంగఢ్‌లో షిబ్లి నేషనల్ కాలేజీ మరియు దారుల్ ముస్సానిఫిన్ (రచయితల సభ) షిబ్లి నోమాని వ్యవస్థాపకుడు.

31. సయ్యద్ అమీర్ అలీ (1849–1928, భారతదేశం) -- అమీర్ అలీ ఇస్లామిక్ చరిత్ర మరియు ఆధునిక అభివృద్ధిపై విస్తృతంగా రాసిన న్యాయనిపుణుడు మరియు చరిత్రకారుడు.

32. తహా హుస్సేన్ (1889–1973, ఈజిప్ట్) -- ఈజిప్టులోని అత్యంత ప్రభావవంతమైన మేధావులలో తహా హుస్సేన్ ఒకరు. ఈజిప్టు సమాజాన్ని ఆధునీకరించడానికి కృషి చేశారు మరియు ఇస్లామిక్ సంప్రదాయాన్ని పాశ్చాత్య ఆలోచనలతో సమన్వయం చేయడానికి ప్రయత్నించారు. 

33. జాకీర్ హుస్సేన్, డాక్టర్ (1897–1969, భారతదేశం) -- రాజనీతిజ్ఞుడు మరియు విద్యావేత్త అయిన జాకీర్ హుస్సేన్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ మరియు భారతదేశపు మొదటి ముస్లిం అధ్యక్షుడు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆధునిక విద్యకు బలమైన సమర్ధకుడు.

34. జియా గోకల్ప్ (1876–1924, టర్కీ) -- ఆధునిక జాతీయవాద విలువలతో పాటు  ఇస్లామిక్ విలువలను కూడా జియా గోకల్ప్ ప్రోత్సహించారు.

 

No comments:

Post a Comment