నిరంతరం అభివృద్ధి చెందుతున్న
వ్యాపార ప్రపంచంలో
టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ మరియు
ఆతిథ్యం వంటి వివిధ రంగాలలో భారతీయ ముస్లిం వ్యాపారవేత్తలు ప్రపంచ వేదికపై భారతదేశ
స్థాయిని పెంచుతున్నారు.
ప్రపంచ
వ్యాపార రంగంలో భారత స్థానాన్ని మరింత పటిష్టం చేస్తున్నారు. ప్రభావవంతమైన భారతీయ
ముస్లిము వ్యవస్థాపకులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను పెంచుతున్నారు.
ప్రముఖ భారతీయ ముస్లిము వ్యాపార దిగ్గజాలలో
కొందరిని మీకు పరిచయం చేస్తాను:
అజీమ్ ప్రేమ్‌జీ-విప్రో
భారతదేశంలో అత్యంత ధనిక ముస్లిం వ్యాపారవేత్తగా
పరిగణించబడే అజీమ్ ప్రేమ్‌జీ, భారతదేశ సాంకేతిక రంగం వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. భారత దేశంలోని
అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన విప్రో ఛైర్మన్‌గా, ప్రేమ్‌జీ నాయకత్వం విప్రో కంపెనీ వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో తన
పరిధిని విస్తరించడంలో సహాయపడింది. అజీమ్ ప్రేమ్‌జీ సహకారాలు వ్యాపార ప్రపంచానికి
మించి విస్తరించాయి. ప్రేమ్‌జీ తన దాతృత్వ కార్యక్రమాలతో గణనీయమైన విరాళాలతో తనను తాను ఒక దాతగా
స్థిరపరచుకున్నారు.
మేరాజ్ మనల్ 'హిమాలయ':
భారతదేశపు ప్రముఖ మూలికా సంస్థ 'హిమాలయ' విజయానికి మూలకారణం
అయిన మేరాజ్ మనల్, సహజ
ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి తన అంకితభావానికి ప్రసిద్ధి చెందారు. హిమాలయ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా విస్తరించడానికి, 90కి పైగా దేశాలలో
ఉత్పత్తులను అమ్మడానికి మేరాజ్ మనల్ వ్యాపార నైపుణ్యం సహాయపడింది. మేరాజ్ మనల్ తన
విజయానికి “ఆవిష్కరణ మరియు నాణ్యత పట్ల నిబద్ధత” కారణమని
చెప్పారు.
"ఉత్పత్తులను అమ్మడం మాత్రమే
కాదు; ఒక జీవన
విధానాన్ని అమ్ముతున్నాము" అని మేరాజ్ మనల్ అంటారు.. భారతీయ మూలికా మరియు సహజ
ఉత్పత్తుల పట్ల ప్రపంచవ్యాప్త ఆసక్తిని బలోపేతం
చేయడంలో మేరాజ్ మనల్ నిరంతర విజయం ముఖ్యమైన పాత్ర పోషించింది.
రఫీక్ మాలిక్ -'మెట్రో'
భారతదేశంలోని ప్రముఖ పాదరక్షల
బ్రాండ్‌లలో ఒకటైన 'మెట్రో' వ్యవస్థాపకుడు,
యజమాని అయిన రఫీక్
మాలిక్ గణనీయమైన అంతర్జాతీయ వృద్ధిని, ఖ్యాతిని సాధించారు. రఫీక్ మాలిక్ వ్యవస్థాపక నైపుణ్యాలు ‘మెట్రో’ను
భారతదేశం మరియు విదేశాలలో రిటైల్ రంగంలో వృద్దికి కీలక పాత్ర పోషించినవి.. రఫీక్
మాలిక్ నాయకత్వంలో, మెట్రో
విస్తరించి ప్రపంచ
మార్కెట్లలో భారతీయ బ్రాండ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌కు దోహదపడింది. "మెట్రో
అంటే కేవలం బూట్లు మాత్రమే కాదు; ఇది ప్రతి కస్టమర్‌కు నాణ్యత మరియు శైలిని అందించడం గలదు "
అని రఫీక్ మాలిక్ అన్నారు.
యూసుఫ్ అలీ - 'లులు'షాపింగ్ మాల్
హాస్పిటాలిటీ మరియు రిటైల్ మొగల్
యూసుఫ్ అలీ, అనేక
ప్రపంచ దేశాలలో మరియు భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చైన్‌లు మరియు షాపింగ్ మాల్‌లలో
ఒకటైన 'లులు' యజమాని. యూసుఫ్ అలీ రిటైల్
మరియు హాస్పిటాలిటీ రంగాలలో తనదైన ముద్ర వేశారు. “లులు మాల్” బహుళ
దేశాలలో ఉండటంతో, యూసుఫ్
అలీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పెద్ద ఎత్తున షాపింగ్ కేంద్రాల
నుండి లగ్జరీ హోటళ్ల వరకు,
యూసుఫ్
అలీ యొక్క వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో యూసుఫ్ అలీ వ్యవస్థాపక నైపుణ్యానికి నిదర్శనం.
"మా కస్టమర్లు ఎక్కడ ఉన్నా, వారికి అసమానమైన షాపింగ్ అనుభవాన్ని అందించడమే మా
లక్ష్యం" అని యూసుఫ్ అలీ వివరించారు.
యూసుఫ్
ఖ్వాజా హమీద్-సిప్లా
బిలియనీర్
వ్యాపారవేత్త మరియు శాస్త్రవేత్త అయిన యూసుఫ్ ఖ్వాజా హమీద్ 1935లో తన
తండ్రి ఖ్వాజా అబ్దుల్ హమీద్ స్థాపించిన జనరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ సిప్లాకు
ఛైర్మన్‌గా ఉన్నారు. పేదలను ప్రభావితం చేసే ఇతర వ్యాధులకు జనరిక్ ఎయిడ్స్ మందులు
మరియు చికిత్సలను అందించడంతో పాటు,
హమీద్ భారతదేశం వెలుపల ఖ్యాతిని
సంపాదించాడు.
అభివృద్ధి
చెందుతున్న దేశాలలో ఎయిడ్స్‌ను నిర్మూలించడానికి మరియు ప్రాణాలను రక్షించే మందులను
అందించడానికి హమీద్ చేసిన కృషి అతన్ని ఆధునిక రాబిన్ హుడ్‌గా వర్ణించడానికి
దారితీసింది. 2005లో,
భారత ప్రభుత్వం యూసుఫ్ ఖ్వాజా హమీద్ కు
“పద్మ
భూషణ్” అవార్డును ప్రదానం చేసింది.
ఆజాద్ మూపెన్-ఆస్టర్ డిఎమ్ హెల్త్‌కేర్
ఆజాద్
మూపెన్ భారతదేశానికి చెందిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థాపకుడు. ఆసియా-పసిఫిక్‌లో ఆజాద్
మూపెన్ అనేక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అభివృద్ధి చేశారు. ఆజాద్ మూపెన్ భారతీయ
మరియు మధ్యప్రాచ్య ఆరోగ్య సంరక్షణ సంస్థ అయిన ఆస్టర్ డిఎమ్ హెల్త్‌కేర్‌కు ఛైర్మన్
మరియు మేనేజింగ్ డైరెక్టర్ కూడా.
34 సంవత్సరాలలో, ఆస్టర్
డిఎమ్ హెల్త్‌కేర్ దుబాయ్‌లోని ఒకే డాక్టర్ క్లినిక్ నుండి ఎనిమిది దేశాలలో 377 కి
పైగా సౌకర్యాలతో ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సమ్మేళనంగా అభివృద్ధి చెందింది. ఆస్టర్
డిఎమ్ హెల్త్‌కేర్ సంస్థ జిసిసి మరియు భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్
సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. 2011లో భారత ప్రభుత్వం ఆజాద్ మూపెన్ కు
పద్మశ్రీ అవార్డును కూడా ప్రదానం చేసింది.
హబిల్
ఖోరకివాలా-వోకార్డ్ట్
హబిల్
ఖోరకివాలా భారతీయ బహుళజాతి ఔషధ మరియు బయోటెక్నాలజీ సంస్థ అయిన వోకార్డ్ట్
వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్. 1967లో,
హబిల్ ఖోరకివాలా వోకార్డ్ట్‌ను
స్థాపించారు, వోకార్డ్ట్ జెనరిక్ డ్రగ్స్, ఫార్ములేషన్స్, బయోఫార్మాస్యూటికల్స్, న్యూట్రిషన్
ప్రొడక్ట్స్, టీకాలు మరియు యాక్టివ్ ఫార్మాస్యూటికల్
ఇంగ్రీడియెంట్స్ (APIలు) యొక్క అగ్రశ్రేణి భారతీయ తయారీదారులలో
ఒకటిగా ఎదిగింది.
పైన వివరించినవారు కాక అనేక మంది ఇతర
ముస్లిం వ్యాపారవేత్తలు కూడా భారతదేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నారు. ముస్లిం
వ్యాపారవేత్తల వెంచర్లు ఆరోగ్య సంరక్షణ నుండి మౌలిక సదుపాయాల వరకు బహుళ పరిశ్రమలను
విస్తరించి, భారతదేశంలోని
ముస్లిం వ్యవస్థాపకుల వైవిధ్యం మరియు చైతన్యాన్ని హైలైట్ చేస్తాయి.
ముస్లిం వ్యాపారవేత్తలు యువ తరానికి
రోల్ మోడల్‌లుగా కూడా పనిచేస్తున్నారు మరియు వ్యవస్థాపకతకు అవధులు లేవని నిరూపిస్తున్నారు. ముస్లిం
వ్యాపారవేత్తలు తమ వ్యాపార చతురత ద్వారా, ప్రపంచ వేదికపై భారతదేశం ఆర్థిక శక్తి కేంద్రంగా
అభివృద్ధి చెందుతూనే ఉండేలా చూస్తున్నారు.
No comments:
Post a Comment