సూఫీయిజం (అరబిక్‌లో తసవ్వూఫ్), ఇస్లాం యొక్క రహస్య వాదం మరియు
స్వాభావిక శాంతివాదం. సూఫీ పదానికి రెండు వెలకు పైగా నిర్వచనాలు
ఉన్నాయంటారు.
ఆడంబరాలకూ దూరంగాపవిత్రంగా యోగులుగా, సన్యాసులుగా,
స్వాములుగా జీవితాన్ని గడిపే వ్యక్తులు 'సూఫీలుగా
పిలబడతారు 'సూఫీ' అంటే- పవిత్రతకు,
(భౌతికబంధాల నుంచి) స్వేచ్ఛకు సంకేతం! దేవుడ్ని ప్రేమించే మార్గమే
సూఫీ సారాంశం. అన్ని బంధనాల్నివదులుకొని అన్నింటిలో దేవుడ్ని ప్రేమ మార్గంలో చూసే
పద్ధతి..
సూఫీయిజం
యొక్క సరళమైన మరియు ఉత్తమమైన వివరణను 11వ శతాబ్దపు లాహోర్‌కు చెందిన ప్రసిద్ధ
ఆధ్యాత్మికవేత్త అల్-హుజ్విరి Al-Hujwiri ఇచ్చారు. తన ప్రఖ్యాత గ్రంథంలో, కష్ఫ్ అల్-మహ్జుబ్ Kashf al-mahjub లో
హుజ్విరి ఒక ప్రవక్త సంప్రదాయాన్ని ఉటంకిస్తూ సూఫీని “సఫా (స్వచ్ఛత) స్వీకరించి కదర్
(అశుద్ధత)ను వదులుకునే వ్యక్తి”గా నిర్వచించారు.
ప్రపంచవ్యాప్తంగా
సూఫీయిజం అపారమైన ప్రజాదరణకు నోచుకోంది. భారతదేశంలో కూడా ముస్లింలలో అధిక శాతం
మంది సమ్మిళిత సూఫీ సంప్రదాయాలను అనుసరిస్తున్నారని నమ్ముతారు.
సూఫీలు అంతా మార్మికులు. నిజానికి అన్ని మతాలు
ప్రభోధించే మార్మిక అంశాలే సూఫీల బోధనలోకనిపిస్తుంది. సూఫీతత్వం క్రీస్తుశకం 620-1100 మధ్య
బలపడింది. దాని తర్వాత నేటి వరకు సూఫీ పరంపర కొనసాగుతూనే ఉన్నది. భారతదేశంలోకి
సూఫీ తత్వ ప్రవేశం పదమూడో శతాబ్దం నుంచి మొదలైంది
ఆధునిక
భారతదేశంలో ముస్లిం సమాజాల ఆవిర్భావంలో సంచార "సెయింట్స్ " మరియు
"ఆశీర్వదించబడిన పురుషులు" గా పిలువబడే సూఫీల పాత్ర గొప్పది. సూఫీ సెయింట్స్ లో ఎక్కువ మంది, మంగోలులు, ఇరాన్ సఫావిడ్‌ల హింస తరువాత భారతదేశంలో ఆశ్రయం
పొందారు. సూఫీ సెయింట్స్ భోదనలు, వారి దర్గాలు భారత
దేశం లో ఇస్లాం వ్యాప్తికి తోడ్పడినవి.
సూఫీ సెయింట్స్
బోధనలు ప్రజలలో సాంఘిక సమానత్వం ను చాటినవి. హిందువులు
సూఫీ మహనీయుల సమాధులను దర్శించి నేటికీ ఆరాధిస్తున్నారు.
సూఫీ పుణ్యక్షేత్రలు సామాన్య ప్రజలకు స్వాంతన
కలిగించినవి. వారి శారీరిక మానసిక వ్యాధులకు నివారణా కేంద్రాలుగా పనిచేసినవి.
సామాన్య ప్రజలపై అధిక ప్రభావాన్ని కలిగించినవి. కొన్ని దక్షిణాసియా ముస్లిం సూఫీ పుణ్యక్షేత్రాలకు
(అజ్మీర్, హజరత్ నిజమోద్దిన్, గుల్బర్గా) కు రాజరిక ఆదరణ లబించినది.
మొఘలులు
వారి తరువాత నిజాములు కూడా సూఫీ పుణ్యక్షేత్ర సముదాయాలను ఆదరించారు. దారా షుకోహ్ యొక్క స్వేచ్ఛా ఆలోచనాపరుడు మరియు
సన్నిహితుడు అయిన సర్మద్‌ను చంపినందుకు ప్రాయశ్చిత్తంగా సూఫీ షా నూర్ సలహా మేరకు
ఔరంగజేబు ఖుల్దాబాద్‌లోని జైనుద్దీన్ షిరాజీ (మ.1369) దర్గా ను దర్శించినాడు.
కర్నాటిక్ నవాబులు, ముఖ్యంగా సదాతుల్లా ఖాన్ మరియు ముహమ్మద్ షా సూఫీ సన్యాసుల పుణ్యక్షేత్రాలను నిర్మించారు మరియు వారిని ఆదరించారు. సూఫీ సెయింట్స్ లు నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ నాటి కాలపు పాలకుల ఆడంబరాలకు, ప్రభావానికి లోను కాలేదు. 'సూఫీ' ఇస్లాంలో నిరాడంబరతకు చిహ్నం.
సూఫీలు నవాబులు, ప్రభువులు
అందించిన కానుకలను సున్నితంగా తిరస్కరించారు. ఆర్భాటాలకు తావివ్వకుండా, అహంకార రహితులై, నామసంకీర్తనం చేస్తూ భక్తులకు
సందేశాలు అందిస్తూ, సత్యాన్వేషణలో ఆత్మ సాక్షాత్కారం
చేసుకున్నారు.
సూఫీ వేదాంత సోపానాల్లో ఈ దశను 'ఫనా-ఫి-అల్లాహ్' అంటారు.
ఇస్లాం నుంచి ఆవిర్భవించి ప్రపంచవ్యాప్తంగా
విస్తరించిన సూఫీ తత్వం కేవలం ఒక మతం కాదు. అది మత పరిధులను దాటి విశ్వచైతన్యాన్ని, భగవత్తత్వాన్నినింపుకొన్న విశాల మధురభక్తి సిద్ధాంతం
సూఫీ తరీఖాలు లేక శాఖలు నాలుగు. వీటిలో
తొలి శాఖ మరియు అత్యంత ప్రధానమైనది ‘చిష్టీ’ శాఖ.
చిష్తియా
తరువాత సహర్ వర్దియా,ఖాదరియా,నఖ్ష్ బందియామరియు షాధిలియ్య, కుబ్రావియ్య ఇతర
ముఖ్యమైన శాఖలు.
No comments:
Post a Comment