న్యూఢిల్లీ - భారతదేశంలో ముస్లింలు 2024 నాటికి చార్టర్డ్ అకౌంటెంట్లు (CAలు) 'ప్రాక్టీసింగ్' గా అతి తక్కువ సంఖ్య లో ఉన్నారని 'Muslims in India 1947-2024 - Fake
Narratives vs Ground Realities' అనే కొత్త పుస్తకం పేర్కొంది.
వివిధ రాష్ట్రాలు, ప్రముఖ నగరాలలో ముస్లిం CAలు
·
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ మరియు ధన్‌బాద్ తర్వాత
మూడవ అతిపెద్ద నగరమైన రాంచీలో, 1,019 మంది ప్రాక్టీసింగ్ CAలలో ఒక మహిళతో సహా 33 మంది ముస్లింలు మాత్రమే ఉన్నారు.
· ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో, 2,445 మంది CA ప్రాక్టీస్ చేస్తున్న వారిలో తొమ్మిది మంది ముస్లింలే
·
కేరళలోని కన్నూర్ నగరంలో మొత్తం 102 మంది CAలు క్రియాశీల ప్రాక్టీస్‌లో ఉన్నారు, వారిలో 15 మంది ముస్లింలు.
·
కేరళలోని మరొక నగరమైన అల్లెప్పీలో 15 మంది CAలు ఉన్నారు, వారిలో ముస్లిములు ఎవరు లేరు.
· జనవరి 2025లో, కేరళలో ఒక ముస్లిం అమ్మాయి చార్టర్డ్ అకౌంటెంట్ల పరీక్షల ఫైనల్స్‌లో దక్షిణ రాష్ట్రంలో మొదటి స్థానంలో మరియు భారతదేశంలో ఐదవ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది, కేరళలో CA ఉత్తీర్ణత రేటు కేవలం 13.44 శాతం మాత్రమే.
·
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో మొత్తం 145 మంది CAలలో ఇద్దరు మహిళల తో సహా 12 మంది ముస్లింలు ఉన్నారు.
చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 556 మంది ప్రాక్టీస్ సిఎలు ఉన్నారు, వీరిలో ఒక మహిళ తో సహా ఇద్దరు ముస్లింసిఎలు కలరు
· హర్యానాలోని గురుగ్రామ్‌లో మొత్తం 7,325 మంది CAలలో 29 మంది ముస్లింCAలు ఉన్నారు.
· మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో, మొత్తం 1,301 మంది CAలలో 63 మంది ముస్లిం CAలు ఉన్నారు.
· పంజాబ్‌లోని 120 CA కంపెనీలలో ఒక్క ముస్లిం కూడా లేడు
·
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నగరంలో మొత్తం 550 మంది సిఎలలో నలుగురు ముస్లిం సిఎలు
ఉన్నారు.
·
పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో 25 సిఎలలో ముస్లింసిఎలు ఎవరు లేరు.
·
పశ్చిమ బెంగాల్‌లోని పర్యాటక కేంద్రమైన దోర్స్ Doars లో మొత్తం 49 సిఎలు ఉన్నారు వారిలో ముస్లింసిఎలు ఎవరు
లేరు.
·
ఉత్తర దినాజ్‌పూర్‌లో మొత్తం 54 సిఎలలో ఇద్దరు ముస్లింసిఎలు కలరు.
· డార్జిలింగ్ హిల్స్‌లో మొత్తం 16 సిఎలలో ఒక్క ముస్లింసిఎ లేరు.
· సిక్కింలో మొత్తం 22 మంది సిఎలు ఉన్నారు, వారిలో ఎవరూ ముస్లింలు లేరు.
· అస్సాంలో, 431 మంది CA ప్రాక్టీస్ చేస్తున్న వారిలో ఒకే ఒక్క ముస్లిం ఉన్నాడు.
·
. 22 ఏళ్ల అమ్రత్ హారిస్ ఫైజల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) నిర్వహించిన పరీక్షలలో. 600కి 484 స్కోరుతో రాణించింది, అమ్రత్ హారిస్ ఫైజల్ ఆమె గతంలో 2021లో CA ఇంటర్మీడియట్ పరీక్షలో 16వ ర్యాంక్ సాధించింది. అమ్రత్ హారిస్
ఫైజల్ సోదరి మరియు బావమరిది ఇద్దరూ అర్హత కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్లు.
·
యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ మెమన్ కమ్యూనిటీ నుండి
ఉత్తమ CAగా
నిలిచాడు.
·
డిసెంబర్ 2012లో, హోడా బింట్ అహ్మద్ అలీ ఖాన్ రాజస్థాన్‌లోని
టోంక్ నుండి చార్టర్డ్ అకౌంటెంట్ ప్రీ-టెస్ట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొదటి
ముస్లిం అమ్మాయి.
· రాజస్థాన్‌లోని టోంక్ నగరానికి చెందిన ఇద్దరు ముస్లిం అబ్బాయిలు, తారిక్ హసన్ మరియు వసీం ఉర్ రెహమాన్ కూడా చార్టర్డ్ అకౌంటెంట్ ప్రీ-టెస్ట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు
·
మార్చి 2015లో, కర్ణాటక తీరం లోని కర్నాడ్ నుండి షబానా మొదటి ముస్లిం మహిళా CA అయ్యారు.
·
కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు లేదా ముగ్గురు ముస్లిం
మహిళా చార్టర్డ్ అకౌంటెంట్లు మాత్రమే ఉన్నారు.
· కేంద్ర మైనారిటీ వ్యవహారాల మాజీ మంత్రి కె. రెహమాన్ ఖాన్, 1960లలో కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటి ముస్లిం CA అయిన చార్టర్డ్ అకౌంటెంట్ (FCA)గా పనిచేశారు, తరువాత 1968 నుండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) బెంగళూరు శాఖకు ఒక సంవత్సరం పాటు ఛైర్మన్‌గా పనిచేశారు.
·
మే 2018లో, మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కరాడ్ నగరానికి
చెందిన ఇర్ఫాన్ మరియు అంజుమ్ బాగ్బన్ మహారాష్ట్ర రాష్ట్రంలో మొట్టమొదటి ముస్లిం CA జంటగా నిలిచారు.
·
జనవరి 2019లో, రాజస్తాన్ కు చెందిన ఇద్దరు ముస్లిం యువకులు CA పరీక్షలలో మొదటి మరియు రెండవ ర్యాంకులు సాధించారు.-కోటకు
చెందిన షాదాబ్ హుస్సేన్, గుజరాత్
కు చెందిన షాహిద్
హుస్సేన్ షోకత్ మీనన్ మొదటి రెండు స్థానాలను సాధించారు.
·
CA పరీక్ష
(పాత సిలబస్)లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి ముస్లిం షాదాబ్ అయ్యాడు. గుజరాత్‌కు
చెందిన షాదాబ్ కంటే కేవలం 13
మార్కులు తక్కువ సాధించినాడు. షాహిద్ హుసేన్ షోకత్ మీనన్
·
నవీ ముంబై విద్యార్థులు జి సలీం అన్సారీ మరియు హఫ్సా
అబ్దుల్ వహాబ్ దల్వి జాతీయ CA పరీక్షలలో అగ్రస్థానంలో నిలిచారు. సలీం 477 మార్కులతో జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్
సాధించారు
·
ఫిబ్రవరి 2019లో, 16 మంది ముస్లిం విద్యార్థులు CA పరీక్షలలో విజయం సాధించారు.
· ICAI కామర్స్ విజార్డ్ టెస్ట్ ఫేజ్ IIలో అర్హత సాధించిన 1,013 మంది విద్యార్థులలో 16 మంది ముస్లిములు.
·
ICAI యొక్క
వెస్ట్రన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ యొక్క 28 మంది సభ్యులలో ఇద్దరు ముస్లింలు ఉన్నారు, వీరిలో K Murtaza గతంలో దాని ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
·
ప్రస్తుతం ICAI యొక్క వెస్ట్రన్ ఇండియా రీజినల్ కౌన్సిల్లో
18 మంది ముస్లిం సభ్యులు ఉన్నారు.
· తూర్పు ఇండియా రీజియన్ కౌన్సిల్‌లో 81 మందిలో ఒక ముస్లిం ఉన్నారు - ఆరిఫ్ అహ్మద్.
·
ఆగస్టు 1949 మరియు 2024 మధ్య, ICAI కౌన్సిల్ మొత్తం 73 మంది చీఫ్‌లు కలరు వారిలో ఇద్దరు ముస్లింలు - QM అహ్మద్ (1967-1970) మరియు WA ఖాన్ (1979-82).
·
ప్రస్తుతం, ICAI కౌన్సిల్ 116 మంది సీనియర్ అధికారులలో ముస్లింలు ఎవరు
లేరు.
·
సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ (COP) కలిగి ఉన్న CAల గురించిన డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా 3,610 CAలలో 65 మంది ముస్లింలు.
· 2022లో, ICAI యొక్క పాట్నా బ్రాంచ్‌లో 1,380 CAలలో 36 మంది ముస్లింలు ఉన్నారు, వీరిలో ఐదుగురు మహిళలు
·
ICAI సభ్యత్వ జాబితాలో ముస్లింలు
కేవలం 1.7 శాతం మాత్రమే ఉన్నారు.
·
రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ (RNI)తో సర్క్యులేషన్
ఆడిట్‌లలో సహాయం కోసం ఎంప్యానెల్డ్ CAల 2020 జాబితా ప్రకారం, 87 మందిలో ముగ్గురు మాత్రమే ముస్లింలు - M హబీబుల్లా, మహమ్మద్ షబ్బీర్
మరియు ఫౌజియా సిద్ధిఖీ.
మూలం: క్లారియన్ ఇండియా, జనవరి 31, 2025
No comments:
Post a Comment