11 February 2025

ఆగా ఖాన్ వారసత్వం-భారతీయ మూలాలను మరియు ఆఫ్రికన్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది

 


ఆగా ఖాన్,  షియా ఇస్లాంలో  నిజారీ ఇస్మాయీలీల ఇమామ్ బిరుదు.1866లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఆగా ఖాన్I (1800–81), నిజారీ ఇస్మాయిలీల 46వ ఇమామ్ గా, భారతదేశ ఖోజా ముస్లింల అధిపతిగా నిర్ధారించబడ్డాడు. 1887లోభారత వైస్రాయ్ ద్వారా  ఆగా ఖాన్ అనే బిరుదును అధికారికంగా గుర్తించారు.

ఆగా ఖాన్  బ్రిటీష్ ఇండియాలో తుపాకీచే గౌరవ వందనం అందుకున్నఏకైక మతపరమైన లేదా సమాజ నేత అయ్యారు. ఆగా ఖాన్I కేవలం ఖోజా ముస్లింల ఆధ్యాత్మిక నాయకుడిగా ఎదగటమే కాకుండా ఖోజా ముస్లింల వ్యాపార నెట్‌వర్క్‌ల వ్యాప్తిని కూడా వ్యాపింపజేశారు..

ఖోజా ముస్లిం సమాజ ప్రయాణం ముంబైలో ప్రారంభమైంది, మత గురువుగా ఆగా ఖాన్I ఖోజా ముస్లింల ఆదాయంలో దశమ భాగమును స్వికరించడమే కాకుండా  దానిని ఖోజా ముస్లిం కమ్యూనిటీ ధార్మిక మరియు వ్యాపార మద్దతు కోసం ఉపయోగించారు

భారతదేశ ఖోజా ముస్లింలు అధికముగా గుజరాత్ మరియు సింధ్‌లో స్థిరపడినారు. ఖోజాలు నివసించే గుజరాత్ మరియు సింద్‌లు కరువులకు గురయ్యాయి, ఆగా ఖాన్I వారిని తూర్పు ఆఫ్రికాలోని కొత్త యూరోపియన్ కాలనీలకు వెళ్లమని ప్రోత్సహించారు. ముంబైలోని  మజ్‌గావ్‌లో ఆగా ఖాన్I సమాధి కలదు.

మెరుగైన అవకాశాల కోసం, ఖోజాలు తూర్పు ఆఫ్రికాకు వెళ్లారు, అక్కడ ఆగా ఖాన్ III (1885–1957) విద్య మరియు ఆర్థిక సహాయం ద్వారా వారికి మద్దతు ఇచ్చాడు. 1945లో ఆగా ఖాన్ III తన అనుచరులు తూర్పు ఆఫ్రికా లో లోతట్టు ప్రాంతాలకు విస్తరించాలని ఆజ్ఞాపించి, వారికి సులభమైన నిబంధనలపై రుణాలు అందించే ఏర్పాట్లు చేసారు.

ఆగా ఖాన్ III, తన 72 సంవత్సరాల పాలనలో తూర్పు ఆఫ్రికా ఇస్మాయిలీలకు మద్దతు ఇచ్చాడు, పాఠశాలలు మరియు మసీదులను ఏర్పాటు చేశాడు మరియు వారి తరపున వలస పాలకులతో మధ్యవర్తిత్వం వహించాడు. తూర్పు ఆఫ్రికాలోని ఆసియన్లు, యూరోపియన్ వలసవాదులు మరియు స్థానిక ఆఫ్రికన్ల మధ్య చిక్కుకున్నారు, కానీ ఆగా ఖాన్ ప్రభావం ఇస్మాయిలీలకు గణనీయంగా సహాయపడింది.

తూర్పు ఆఫ్రికాలో ఇస్మాయిల జీవితం సులభమైన జీవితం కాదు. వ్యాపారులు లేదా దుకాణదారులుగా పనిచేయడం వల్ల పెద్ద కుటుంబాలను పోషించడానికి  చిన్న లాభాలు మాత్రమే వచ్చాయి. ఇస్మాయిలీలు ప్రధానంగా శాఖాహారానికి అలవాటు పడటానికి ఇది కారణమైనది.

తూర్పు ఆఫ్రికా కు వలసవెళ్ళిన ఇస్మాయిలీలు స్థానిక ఆహార పదార్థాలకు అలవాటు పడ్డారు, కాసావా మరియు వేరుశెనగ వంటి ఆఫ్రికన్ ప్రధాన ఆహార పదార్ధాలను తమ భారతీయ వంటకాలతో మిళితం చేసారు. ఆహరం విషయం లో  తూర్పు ఆఫ్రికా లోని ఇస్మాయిలీలు భారతీయ మూలాలను మరియు వలస మరియు అనుసరణ ద్వారా ఏర్పడిన ఆఫ్రికన్ ప్రభావాలను ప్రతిబింబిస్తారు.

అగా ఖాన్ III భారతదేశం మరియు అంతకు మించి ఇస్మాయిల్ ముస్లిం సమాజానికి ఆకర్షణీయమైన మరియు ప్రగతిశీల నాయకుడు. అగా ఖాన్ III సామాజిక సమస్యలపై సంస్కరణ-దృక్పథం కలిగిన విధానాన్ని కలిగి ఉన్నాడు మరియు తన సమాజానికి సమగ్ర నాయకత్వం అందించాడు.  ఆగా ఖాన్ III మహిళల విద్యను  ప్రోత్సహించిన ప్రగతిశీలవాది.

1946లో ఆర్దికముగా అభివృద్ధి చెందిన తూర్పు ఆఫ్రికాలోని ఇస్మాయిలీలు దార్-ఎ-సలాం Dares-Salaam లో ఆగా ఖాన్ III వజ్రోత్సవాన్ని Diamond Jubilee celebrations ఆగా ఖాన్ ను వజ్రాలతో,తూకం వేయడం ద్వారా జరుపుకున్నారు, అయితే  వచ్చిన నిధి ఆగా ఖాన్ అభివృద్ధి నిధికి వెళ్ళింది

పాకిస్తాన్, భారతదేశం, మధ్య ఆసియా, యూరప్, తూర్పు ఆఫ్రికా , మధ్యప్రాచ్యం మరియు ఉత్తర అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది సభ్యులు నివసిస్తున్న నిజారీ సమాజానికి ఆగా ఖాన్ IV (1957–2025) బలమైన నాయకుడయ్యాడు . 

ఆగా ఖాన్ ఫౌండేషన్ వంటి సంస్థల ద్వారా, ఆగా ఖాన్ IV దక్షిణాసియా మరియు తూర్పు ఆఫ్రికాలో విద్య, ఆరోగ్యం మరియు గృహ సేవలను అందించే సహాయ సంస్థలకు నిధులు సమకూర్చారు.  1977లో ఆగా ఖాన్ IV  ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఇస్మాయిలీ స్టడీస్‌’ను స్థాపించాడు . విద్య, కళలు, ఆరోగ్యం మరియు అభివృద్ధిని ప్రోత్సహించే తొమ్మిది అనుబంధ సంస్థలకు ఒక గొడుగు సంస్థ అయిన ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ (AKDN)ను కూడా ఆగా ఖాన్ IV స్థాపించాడు. ఆ సమూహంలో, ఆగా ఖాన్ ఫండ్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ (AKFED) అభివృద్ధి చెందుతున్న దేశాలలో తయారీ, పర్యాటకం మరియు ఆర్థిక సేవలను ప్రోత్సహించడానికి అభివృద్ధి కార్యక్రమాలలో పెట్టుబడి పెడుతుంది. 2020ల ప్రారంభం నాటికి లాభాపేక్షలేని అభివృద్ధి సమూహం $4 బిలియన్ల ఆదాయాన్ని సంపాదించింది, దీనిని దాని ప్రపంచవ్యాప్తంగా అనుబంధ సంస్థలలో తిరిగి పెట్టుబడి పెట్టారు.

అగా ఖాన్ IV బ్రిటిష్ మరియు కెనడియన్లతో తన ప్రభావాన్ని ఉపయోగించి ఇస్మాయిలీలను పునరావాసం కల్పించాడు మరియు వారిలో చాలామంది అభివృద్ధి చెందారు. ఆగా ఖాన్ అభివృద్ధి నిధి ఇప్పటికీ ఆఫ్రికాలో పనిచేస్తుంది, మతం మరియు ప్రగతిశీల ఆలోచన మంచి ప్రభావం చూపగల అరుదైన ఉదాహరణ.

అగా ఖాన్ IVకు  భారత దేశంలో సామాజికాభివృద్ధికి ఏకేడీఎన్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్  ప్రధానం చేసింది.

2015లో అగా ఖాన్ IV పోర్చుగల్‌లో ఇస్మాయీలీ ఇమామేట్ యొక్క ప్రపంచ స్థానాన్ని స్థాపించాడు. 2025లో  మరణించిన ఆగా ఖాన్ IV, ఈజిప్టులోని అస్వాన్‌లో తన పూర్వీకుడితో ఖననం చేయబడ్డారు.. ఇస్మాయిలీ సమాజం యొక్క సంపదలో ఎక్కువ భాగం ఆఫ్రికాలో ఉంది

2025లో ఆగా ఖాన్ IV మరణించిన తరువాత, అతని కుమారుడు రహీమ్ అల్-హుస్సేనీ ఇస్మాయీలీ ఇమామ్‌ల వంశపారంపర్య వంశంలో 50వ అగా ఖాన్ Vగా నియమించబడ్డాడు 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 

 


No comments:

Post a Comment