తెలంగాణ జనాభాలో ముస్లిం OBCలు దాదాపు 10.08% ఉన్నారని కుల గణన నివేదిక వెల్లడించింది. ఈ సామాజిక-ఆర్థిక సర్వేతో, తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న 4 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు పొందదానికి ముస్లింలలో ఆశలు పెరుగుతున్నాయి.
తెలంగాణలో కుల గణన ప్రకారం, తెలంగాణా రాష్ట్రంలోని
మొత్తం జనాభాలో ముస్లింలు 12.56% మంది ఉన్నారని, అందులో 10.08 మంది OBCలకు చెందినవారని తేలింది. తెలంగాణలోని ముస్లిం జనాభాలో 2.48% మాత్రమే OBC హోదాకు దూరంగా ఉన్నారు. తెలంగాణలో కుల గణన OBC వర్గం యొక్క పేదరిక స్థాయిలకు
సరిపోయే పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉన్నారని సూచిస్తుంది.
తెలంగాణ సర్వేలో ముస్లింయేతర ఇతర
వెనుకబడిన తరగతులు (OBCలు) 46.25%, షెడ్యూల్డ్ కులాలు 17.43% మరియు
షెడ్యూల్డ్ తెగలు 10.45% ఉన్నారని చూపిస్తుంది. ముస్లిమేతర సాధారణ కులాలు
(ఇతర కులాలు Other Castes) 13.31%, ముస్లింలు 12.56%, మరియు ఇతరులు ఉన్నారు
తెలంగాణ కుల సర్వే ముస్లింలు ఒక మత
సమూహం మాత్రమే కాదు, ఒక కుల సమూహం కూడా అని చూపింది.. ముస్లింల కుల గణన
వారిని ఇతర OBC సహచరులతో సమానంగా విద్య మరియు ఉపాధిలో రిజర్వేషన్
ప్రయోజనాలకు అర్హులుగా చేస్తుంది
SC&ST
వర్గాల నుండి మతం మారిన ముస్లింలకు
ప్రయోజనాలను అందించడానికి సుప్రీంకోర్టులో చట్టపరమైన పోరాటం జరుగుతోంది.
2006 సచార్ కమిషన్ నివేదిక మరియు 2007 రఘునాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ముస్లింలకు SC & ST రిజర్వేషన్లు మంజూరు చేయాలని సిఫార్సు చేశాయి
ఎందుకంటే వారి సామాజిక-ఆర్థిక పరిస్థితి హిందూ షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లు
ఇచ్చిన తర్వాత వారి సహచరుల కంటే అధ్వాన్నంగా మారింది. మతమార్పిడి ముస్లిం సమాజం
యొక్క సామాజిక-ఆర్థిక స్థితిని మార్చలేదని మరియు వారు నిశ్చయాత్మక చర్య affirmative action కు అర్హులని కమిషన్ పేర్కొంది..
భారత సామాజిక వ్యవస్థలో OBC హిందువుల శాతాన్ని నిర్ధారించడానికి మండల్ కమిషన్‌ను
ఏర్పాటు చేశారు. 1980లో మండల్ కమిషన్ తన నివేదికను సమర్పించినది.
V.P. సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కేంద్ర
సర్వీసులు మరియు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోసం "సామాజికంగా మరియు
విద్యాపరంగా OBC సమూహాలకు" 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది.
మండల్ కమిషన్ నివేదిక కొన్ని
ముస్లిం OBC కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా సిఫార్సు చేసింది కానీ అది ముస్లింలకు ఎలాంటి
ఊరట కలిగించలేదు. హిందూ OBCలు మండల్ కమిషన్ నుండి రిజర్వేషన్ ప్రయోజనాలను
పొందారు కానీ ముస్లిం OBCలు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం 2011లో దశాబ్ద జాతీయ జనాభా లెక్కలతో పాటు సామాజిక-ఆర్థిక కుల సర్వేను
నిర్వహించింది. అయితే, డేటా ప్రచురించలేదు.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం 2011లో సేకరించిన కుల డేటాను విస్మరించింది. OBC కుల గణన పట్ల పూర్తి ఉదాసీనతను ప్రదర్శించింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణ
హిందువులలో ఆర్థికంగా బలహీన వర్గాల economically weaker section కు అదనంగా 10% రిజర్వేషన్లు ఇచ్చినది. దానిని అఖిల భారత సర్వీసులలో
అమలు చేసింది.దీని వలన రిజర్వేషన్ పరిమితులు 62% కి పెరిగాయి. (27+12+12
+10 = 62%).
దీనిని సుప్రీంకోర్టులో సవాలు
చేశారు, కానీ సుప్రీం కోర్టు EWS రిజర్వేషన్ సమస్యపై ప్రభుత్వం వైపు నిలిచింది. OBC లకు
రిజర్వేషన్ ప్రయోజనాలపై 27% పరిమితిని సుప్రీంకోర్టు రద్దు చేసి, EWS కుల హిందువులకు 10% రిజర్వేషన్లను మంజూరు చేసింది.
మండల్ అనంతర దశాబ్దాలలో OBCలు కుల గణనను డిమాండ్ చేస్తున్నారు EWS రిజర్వేషన్‌ను సాధారణ కుల హిందువులకు ఇవ్వగలిగితే, OBC హిందువులకు ఎందుకు ఇవ్వకూడదని వారు వాదిస్తున్నారు? కుల చర్చ మోడీ ప్రభుత్వం పార్లమెంటులో సవరణ
తీసుకురావడానికి దారితీసింది మరియు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలకు కుల సర్వేలు
నిర్వహించే అధికారాన్ని ఇచ్చింది.
కుల గణన దేశంలో కొత్త రాజకీయ
చర్చను ప్రారంభించింది రాష్ట్ర స్థాయి కుల సర్వే జాతీయ రాజకీయాలపై తీవ్రమైన
ప్రభావాలను చూపుతుంది. BJP పాలిత రాష్ట్రాల్లో కుల జనాభా గణన ఉండదని BJP కేంద్ర నాయకత్వం ఆదేశం జారీ చేసింది.
ఇక ముస్లింల విషయానికొస్తే, OBC జాబితాలో ముస్లిములను చేర్చడం ముస్లిముల సామాజిక-ఆర్థిక
అభివృద్ధికి ఊతం ఇస్తుంది. ముస్లింలు ఎల్లప్పుడూ తమ కుల సర్వే కోసం డిమాండ్
చేస్తూనే ఉన్నారు మరియు ఇది బీహార్ మరియు తెలంగాణలో జరిగిన సర్వేలలో స్పష్టంగా
బయటపడింది. ఇప్పుడు ముస్లిములు OBC జాబితాలో
చేర్చబడిన తర్వాత రిజర్వేషన్ ప్రయోజనాలకు అర్హులు.
కుల జనాభా గణన యొక్క తక్షణ ప్రభావం
ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రణాళికా సంఘానికి డేటాను
తీసుకెళ్లి, కుల జనాభా గణనలో వెల్లడైన సామాజిక-ఆర్థిక స్థితి
ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా వాటిని అమలు చేయాలి. అలా జరిగితే దేశవ్యాప్తంగా కుల జనాభా గణన ముస్లింల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావచ్చు, లేకపోతే వారు నిరాశ చెందుతారు
.
No comments:
Post a Comment