16 February 2025

ముస్లింలలో నమోదు/ఎన్రోల్మెంట్ లో లింగ అంతరం ఇతర వర్గాలకు దగ్గరగా ఉంది: నివేదిక Gender gap in enrolment among Muslims close to other communities: report

 



ముస్లింలు మహిళలు విద్యను అభ్యసించకుండా నిరోధిస్తారనే అపోహ మద్య సమకాలీన భారతదేశంలో ముస్లింలకు నిశ్చయాత్మక చర్య Affirmative Action for Muslims in Contemporary India అనే చర్చ లో ముస్లిం పురుషులు మరియు మహిళలలో విద్య మరియు ఎన్రోల్మెంట్ enrolment లో మద్య అంతరం తక్కువగా ఉంది, కానీ ఈ అంతరం ఇతర వర్గాలతో పోలిస్తే చాలా ఎక్కువగా లేదు." అని 2013లో సచార్ కమిటీ సిఫార్సుల అమలును మూల్యాంకనం చేసిన కమిటీకి అధ్యక్షత వహించిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ అమితాబ్ కుందు అభిప్రాయపడ్డారు.

విద్యలో ముస్లిం నమోదు/ఎన్రోలెంట్  స్థాయిలు వాస్తవానికి ఇతర వర్గాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ; లింగ అంతరం ఇతరులకు చాలా దగ్గరగా ఉందని డేటా తెలియజేస్తుది.

·       ముస్లిం పురుషులు మరియు స్త్రీల మధ్య నమోదు రేటులో వ్యత్యాసం 5.32% వద్ద ఉందని, హిందువులలో అది  4.99% ఉందని ప్రొఫెసర్ అమితాబ్ కుందు అన్నారు.

ప్రొఫెసర్ అమితాబ్ కుందు ప్రకారం నమోదు/ఎన్రోల్మెంట్ లో లింగ అసమానతను చూపే గణాంకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

·       హిందువులలో, ఎప్పుడూ నమోదు కాని never enrolled స్త్రీలు మరియు పురుషుల మధ్య వ్యత్యాసం 5.83%, కాగా ముస్లింలలో అది 4.97% మరియు క్రైస్తవులలో 0.85% గా ఉంది.

·       ప్రస్తుత హాజరు current attendance విషయానికొస్తే, పురుష-స్త్రీ అంతరం gap హిందువులలో 4.99%, ముస్లింలలో 5.32% మరియు క్రైస్తవులలో 1.29%గా  ఉంది.

సమస్య విద్య పట్ల మతపరమైన లేదా లింగ ఆధారిత వ్యతిరేకతలో లేదని, విస్తృత సామాజిక-ఆర్థిక పరిస్థితులలో ఉందని డేటా సూచించింది.

 

 

 

No comments:

Post a Comment