భారతదేశ
స్వాతంత్ర్యోద్యమపు అత్యంత ముఖ్యమైన
సంఘటనలలో ఒకటి 1946 లో
జరిగిన నావికా తిరుగుబాటు. 1946 రాయల్ ఇండియన్ నేవల్
(R.I.N)
తిరుగుబాటును
1857
తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత సైనికులు చేసిన అతి ముఖ్యమైన
తిరుగుబాటుగా పరిగణిస్తారు.
1946 ఫిబ్రవరి 18 నుండి 23 వరకు, రేటింగ్స్ అని పిలువబడే 30,000 కంటే ఎక్కువ రేటింగ్స్/సాధారణ నావికులు మరియు 74 యుద్ధనౌకలు మరియు 20 సంస్థాపనల (installations) కు చెందిన తక్కువ స్థాయి అధికారులు (low-ranking officers) సమ్మెలో పాల్గొన్నారు, దీనిని తిరుగుబాటు లేదా విప్లవం (mutiny or rebellion) అని
కూడా పిలుస్తారు.
1946
ఫిబ్రవరి, 1న జాతీయవాద నినాదాలు చేసినందుకు మరియు
బ్రిటిష్ వ్యతిరేక సాహిత్యాన్ని తన వద్ద ఉంచినందుకు అరెస్టు చేయబడిన బాలై చంద్ర
దత్ అరెస్టు భారత నావికా తిరుగుబాటుకు ప్రధాన కారణం..
1946 రాయల్ ఇండియన్ నేవల్ (R.I.N)
తిరుగుబాటు గురించి ప్రముఖ భారతీయ చరిత్రకారుడు సుమిత్ సర్కార్ ఇలా వ్రాశాడు, "ఈ తిరుగుబాటు విజయవంతమై ఉంటే, స్వాతంత్ర్యం కోసం
భారతదేశం యొక్క పోరాటం వేరే మలుపు తిరిగి ఉండేది."
1757లో ప్లాసీ యుద్ధం తరువాత భారతదేశంలోని బ్రిటిష్ రాజ్ రెండు పెద్ద
సాయుధ తిరుగుబాట్లను ఎదుర్కొంది: మొదటిది. 1857 నాటి సైనిక తిరుగుబాటు మరియు రెండవది 1946 లో
జరిగిన నావికా తిరుగుబాటు.
రాయల్ ఇండియన్ నేవీ (ఆర్.ఐ.ఎన్/R.I.N) తిరుగుబాటు ఫిబ్రవరి 18, 1946న
ఐఎన్ఎస్ తల్వార్‌లో సిగ్నల్‌మ్యాన్‌గా ఉన్న ముహమ్మద్ షుయబ్ ఖాన్ (పున్ను ఖాన్ అని
కూడా పిలుస్తారు) నాయకత్వంలో ప్రారంభమైంది. నావికా రేటింగ్‌లు(నావికులు) సుభాష్
చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ భావజాలం ద్వారా ప్రభావితమయ్యారు.
రాయల్ ఇండియన్ నేవీ (ఆర్.ఐ.ఎన్/R.I.N) తిరుగుబాటు నాయకుడు ముహమ్మద్ షుయబ్ ఖాన్ (పున్ను ఖాన్
బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాడు. ఖాన్ INS కుమావున్
ఎక్కి,
మైక్
ద్వారా రేటింగ్‌లను ఉద్దేశించి ప్రసంగించాడు. ఇండియన్ రేటింగ్స్ ను ఓడలను వదిలి
తిరుగుబాటులో పాల్గోమని కోరినాడు.
తిరుగుబాటుదారులకు తగిన మద్దత్తు
ఇవ్వడానికి జాతీయవాద నాయకులు ఇష్టపడలేదు.భారతదేశంలోని రాజకీయ నాయకులు
రేటింగ్‌ల తిరుగుబాటు లేదా నావికా తిరుగుబాటు ను ఖండించారు. నావికా తిరుగుబాటు
విజయవంతం అయితే అది ఆనాటి ప్రభుత్వ పతనానికి కారణమై ఉండేది..
భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ నాయకులు విప్లవాన్ని కోరుకోలేదు - వారు శాంతియుతంగా అధికార మార్పిడిని కోరుకున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులలో, కాంగ్రెస్ నాయకురాలు అరుణా అసఫ్ అలీ మాత్రమే రేటింగ్స్ సమ్మెకు తన మద్దతును అందించారు మరియు స్ట్రైకర్లకు అనుకూలంగా ఉండేలా తన పార్టీ నాయకులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఫిబ్రవరి 22న వల్లభాయ్ పటేల్ తిరుగుబాటుదారులకు లొంగిపోవాలని సందేశం పంపారు.
భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమే నౌకాదళ తిరుగుబాటుకు మద్దతుగా ముందుకు వచ్చి సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. గాంధీ, జవహర్లాల్ నెహ్రూ మరియు ముహమ్మద్ అలీ జిన్నాతో సహా జాతీయవాద నాయకులు నౌకాదళ రేటింగ్‌లు'శాంతంగా ఉండమని సలహా ఇచ్చారు. తిరుగుబాటు జరిగిన 4 రోజుల తర్వాత, భారత రాజకీయ నాయకులు నావికాదళ రేటింగ్‌లను లొంగిపోవాలని సలహా ఇచ్చారు. “సర్దార్ పటేల్ తిరుగుబాటు చేసిన ఇండియన్ రేటింగ్స్ ను 'బేషరతుగా ఆయుధాలను అప్పగించండి' అని సలహా ఇచ్చినాడు. ప్రభుత్వం లేదా నావికాదళ అధికారులు ఎటువంటి కఠినమైన చర్య తీసుకోరు అని అన్నాడు.”
రాజకీయ నాయకులు
ఎవరినీ శిక్షించబోమని, డిమాండ్ల సాధనకు చర్యలు తీసుకుంటామని
హామీ ఇచ్చారు.
1946 ఫిబ్రవరి 23న,
“ఖాన్
నాయకత్వం లో బారతీయ తిరుగుబాటు నావికా
రేటింగ్స్ లొంగిపోయినారు. లొంగిపోయిన తర్వాత
తిరుగుబాటు చేసిన భారతీయ నావికులను అదుపులోకి తీసుకున్నారు మరియు అదే సంవత్సరం
ఆగస్టులో విడుదల చేశారు.
బ్రిటిష్ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ
ఫిబ్రవరి 26, 1946న హౌస్ ఆఫ్ కామన్స్‌లో నావికా తిరుగుబాటు గురించి మరియు బొంబాయి, కరాచీ మరియు మద్రాసులో జరిగిన ప్రభుత్వ మరియు ప్రేవేట్ ఆస్తి నష్టం, జన నష్టం, విద్వంసం గురించి ఒక ప్రకటన చేసారు. మిస్టర్ అట్లీ తన
ప్రకటనలో,
"కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ నాయకులు నావికా తిరుగుబాటు
పలితంగా చెలరేగిన అలర్లను ఖండించడం మరియు ఆపడానికి ప్రయత్నించారు. భారత రాజకీయ పార్టిలు ఈ నావికా తిరుగుబాటును సమర్ధించ లేదు”
నౌకాదళ తిరుగుబాటు యొక్క ఒక విశేషమైన అంశం
ఏమిటంటే, నావికాదళ రేటింగ్స్ మరియు వారికి మద్దత్తు గా వీదిలోకి వచ్చిన
పౌరులు వివిధ విశ్వాసాల ఐక్యతను చాటారు. వారు బొంబాయి వీధుల్లో
"హిందూ-ముస్లిం ఏకం" మరియు "ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదాలు
చేశారు.
బారతీయ నావికా
రేటింగ్స్ తిరుగుబాటుకు సమర్ధన గా ప్రజాభిప్రాయం రేకెత్తి౦ది..
మద్దతుదారులు తీవ్రంగా ఆందోళనలు దేశవ్యాప్తంగా సామూహిక సమావేశాలు నిర్వహించబడనవి.
నాటక రచయిత ఉత్పల్
దత్ ద్వారా నావికా తిరుగుబాటు ఆధారంగా బంగ్లా నాటకం కల్లోల్ (సౌండ్ ఆఫ్ ది వేవ్)ని
భారత ప్రభుత్వం నిషేధించింది మరియు ఉత్పల్ దత్ జైలు పాలయ్యాడు. కల్లోల్ (సౌండ్ ఆఫ్
ది వేవ్) నాటకం మొదటిసారిగా 1965లో కలకత్తాలోని మినర్వా థియేటర్‌లో ప్రదర్శించబడింది మరియు ఇది
పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించింది.
తిరుగుబాటు జరిగిన నాలుగు రోజుల్లో
ముంబై (అప్పటి బొంబాయి)లో 400 మందికి పైగా పైగా సాయుధ బ్రిటిష్ దళాలచే చంపబడ్డారు. ప్రాణనష్టంలో
ఎక్కువ మంది నావికాదళ రేటింగ్‌లకు మద్దతుగా రోడ్ మీదకు వచ్చిన పౌరులు.
ప్రభుత్వ ప్రవర్తన మరియు రాజకీయ నేతల
వాగ్దానాల ఉల్లంఘనతో తిరుగుబాటుదారులు ఎంత నిరుత్సాహానికి, ఆగ్రహానికి గురయ్యారో బిస్వనాథ్ బోస్ పుస్తకం ఒక సంగ్రహావలోకనం
ఇస్తుంది. “దేశభక్తి నేరమైతే, మనం నేరస్థులమై ఉండాలి” బిస్వనాథ్ బోస్ అని రాశాడు.
నావికా దళ రేటింగ్స్ 'తిరుగుబాటు'
జాతీయవాదం
కాదని,
వారికి ఇచ్చే ఆహార
నాణ్యత నావికాదళ తిరుగుబాటుకు కారణమని అనేక మంది వ్యాఖ్యాతలు మరియు చరిత్రకారులు
పేర్కొన్నారు
No comments:
Post a Comment