19 February 2025

పరమత సహనం కలిగిన రాజు ఛత్రపతి శివాజీ (1627-1680)

 

తన ముస్లిం సైనికులతో కలసి వెళ్తున్న ఛత్రపతి శివాజీచిత్రకారుడు మీర్ మహమ్మద్


పశ్చిమ భారత దేశం లో మరాఠా సామ్రాజ్యం స్థాపించి ఛత్రపతి శివాజీ రాజె భోస్లే గా పేరుగాంచిన శివాజీ భోస్లే 1627 లో పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీజిజాబాయి పుణ్యదంపతులకు జన్మించినారు. శివాజీ పూర్వీకులు మొదటి నుంచి ముస్లింలతో మంచి సంబంధాలను కలిగి ఉండేవారు వారి పాలనలోని ప్రజలు  మరియు సైన్యం లోని ఆదిక సంఖ్యాకులు ముస్లింలు.

ఛత్రపతి శివాజీ  దక్కన్ పీఠభూమిలో ప్రముఖ యోధుడు మరియు రాజుగా ఖ్యాతి గాంచినారు. అనేక మంది భారతీయ చరిత్రకారులచే హిందూ అబిమాని,హిందూ సామ్రాజ్య స్థాపకునిగా, ముస్లిం వ్యతిరేకిగా చిత్రించబడిన శివాజీ మహారాజ్  వ్యక్తిత్వం,అనుసరించిన పాలన పద్దతులను, ఇతరమతాల పట్ల ఛత్రపతి శివాజీ అనుసరించిన విధానాలను  పరిశీలించిన శివాజీ లౌకిక వాది మరియు తన పరిపాలనలో సంపూర్ణ పరమతసహనం ను పాటించినట్లు అర్ధమవుతుంది.

ఛత్రపతి శివాజీ సైన్యంలో మూడొంతులు మంది ముస్లిములు మరియు ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. శివాజీ తన సైన్యంలోని (నౌకా,ఫిరంగి దళం లో) ఉన్నత పదువులలో అనేక మంది ముస్లింలను నియమించినాడు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు!శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా లో  మొఘలుల చెర నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మేహతర్  కూడా ముస్లిమే మరియు ఛత్రపతి శివాజీ అంగరక్షకులు గా ముస్లింలు నియమించబడినారు. శివాజీ అంగరక్షకులుగా ఉన్న  27 మంది లో 13గురు ముస్లింలు. రుస్తోం--జమాన్ శివాజీ ప్రధాన అంగరక్షకుడు

ఛత్రపతి శివాజీ  మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరియు బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా  కు వ్యతిరేకంగా పోరాడినారు.అంతా మాత్రాన శివాజీ మహారాజ్ ను  ముస్లిం వ్యతిరేకి అనలేము ఎందుకనగా ఔరంగజేబ్ సైన్యం లో అధిక భాగం హిందూ రాజపుత్రులు కలరు. అదిల్ షా సైన్యం లో అధిక శాతం దక్కన్ హిందువులు. ఔరంగజేబ్ మరియు అదిల్ షా లు మిత్రులు కారు ఒకరికి ఒకరు శత్రువులు. అదేవిధంగా శివాజీ, ముస్లిం పాలకుడైన  గోల్కొండ నవాబు తానిషా కు  సన్నిహిత మిత్రులు.

ఛత్రపతి శివాజీ తన పాలనలోని ముస్లింలు మరియు వారి మతం పట్ల సహనం ప్రదర్శించేను. ఇస్లాం మరియు హిందూ మతం బిన్నమైనవి అయినప్పటికి దైవిక చిత్రకారుడు వాటిని తన చిత్రం లో సరియైన పాళ్లలో కలిపి చిత్రించును  అదేవిధంగా  ప్రార్ధనకు ఇవ్వబడే అజాన్,ఆలయాలలో మ్రోగించే గంటలు భగవంతుని కోసమే అని శివాజీ ఔరంగజేబ్ కు రాసిన లేఖలో  చాటినాడు.  

శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ ముస్లిం సూఫీ గురువైన యాకుత్ బాబా ను గౌరవించేవారు వారి ఆద్యాత్మిక నిర్దేశకత్వం పొందేవారుయుద్దసమయం లో ముస్లిం స్త్రీలను, పిల్లలను అగౌరవించవద్దని వారికి సహాయం చేయమని  తన సైనికులను ఆదేశించినారు. పవిత్రస్థలాలను ధ్వంసం చేయవద్దని,మసీదులకు రక్షణ కల్పించమని దివ్య ఖురాన్ ప్రతులు లబించిన వాటిని తమ ముస్లిం సోదరులకు సగౌరవంగా అందించమని కోరినారు. శివాజీ తన రాజధాని రాయగడ్ లోని తన భవనానికి ఎదురుగా ఒక మసీదు ను నిర్మించేను. శివాజీ సామ్రాజ్యం లోని పద్మ్ దుర్గ్ వంటి అనేక కోటలలో ముస్లిం సైనికుల సమాధులు కలవు

ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు.వాస్తవానికి చత్రాప్తి శివాజీ సెక్యులర్  పాలకులు అని భావించవచ్చు కానీ కొంత మంది చరిత్ర కారులు వారిని కేవలం హిందూ పక్షపాతి గా చిత్రీకరించినారు. ఖాఫీ ఖాన్ అనే మొఘల్ చరిత్రకారుడు, ఫ్రాంకోయిస్ బెర్నిఏర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు శివాజీ ఇతర మతాలపట్ల చూపిన సహనమును కొనియాడిరి.

శివాజీ సైన్యం లో అధిక శాతం మంది ముస్లింలు. మొఘలులకు బీజాపూర్ సుల్తానుకు మద్య సంధి కుదిరిన తదుపరి బీజాపూర్ ను విడిచిన 700 మండి పఠాన్ సైనికులను శివాజీ తన సైన్యం లో చేర్చుకొనేను. శివాజీ తన సామ్రాజ్య పరిరక్షణకు,తీర ప్రాంత రక్షణకు  నావికా దళమును ఏర్పాటు చేసినాడు. తన నావికా దళ అధిపతిగా దర్యాదరంగ్ ను నియమించినాడు. శివాజీ నావికా దళం లోని అనేక మంది నావికులు ముస్లింలు మరియు మత్సకారులు.

శివాజీ తన సైన్యం లో ఫిరంగి దళమును అబివృద్ధి చేసెను ఇబ్రాహిం ఖాన్ ప్రధాన ఫిరంగి దళాధి పతి గా నియమింపబడేను మరియు ఫిరంగి దళం లోని అనేక మంది సైనికులు ముస్లింలు. శివాజీ సైన్యం లోని ఆశ్విక దళము లో 66వేల ముస్లింలు కలరు. సిద్ది హిలాల్ శివాజీ సైన్యం లోని ముఖ్య దళాధిపతి. బీజాపూర్ అధినేత అధిల్ షా శివాజీ కి చెందిన పన్హాలా కోట ను ముట్టదించినప్పుడు  సిద్ధి హిలాల్ అసమాన ధైర్య సాహసములను ప్రదర్శించేను మరియు సిద్ధి హిలాల్ కుమారుడు సిద్ధి వహ్వాహ్ ముట్టడి లో గాయపడేను. మరాఠా చరిత్రలో brave  Marathas గా (శౌర్య వంతులైన మరాఠా లు) పేరుగాంచిన  వారిలో సిద్ది హిలాల్ ఒకరు.

కాజీ హైదర్ చత్రపతి  శివాజీ మహారాజ్ మరియు ముఖ్య పాలనా కార్యదర్శి గా ఉండేవారు . మౌలానా హైదర్ అలీ శివాజీ ఆంతరంగిక కార్యదర్శి శివాజీ తన సామ్రాజ్యం లో ఉద్యోగ భాద్యతలను నిర్వహిస్తున్న ముస్లిం కాజీలకు వేతనములు చెల్లించినట్లు ఆధారాలు కలవు. సిద్ది ఇబ్రాహిం శివాజీ సైన్యంలో ప్రముఖ దళాధిపతి. నూర్ ఖాన్ బేగ్ శివాజీ ముఖ్య అంతరంగికుడు. అఫ్జల్ ఖాన్ తో శివాజీ పోరాడినప్పుడు శివాజీ వెంట ఉన్న ముగ్గురు అంగరక్షకులలో సిద్ది ఇబ్రాహిం ఒకరు.

శివాజీ సైన్యంలో దాదాపు 50కు పైగా ముఖ్యమైన దళాధిపతులుగా(generals) ముస్లిం లు కలరు. ప్రతి దళాధిపతి తో పాటు అనేక మందిముస్లిం సైనికులు ఉండే వారు. ఛత్రపతి శివాజీ సైన్యం లోని ముఖ్య ముస్లిం దళాధిపతుల లో సిద్ది హిలాల్,దర్యా సారంగ్, దౌలత్ ఖాన్, ఇబ్రాహిం ఖాన్, కాజీ హైదర్, సిద్ది ఇబ్రాహిం, సిద్ది వహ్వాహ్,నూర్ ఖాన్ బేగ్ , శ్యామా ఖాన్, హుసెన్ ఖాన్ మియని, సిద్ది మిస్ట్రీ, సుల్తాన్ ఖాన్,దావూద్ ఖాన్, మదరి మెహతర్ వంటి వారు  ముఖ్యులు.

 

 

 

No comments:

Post a Comment